
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. సోమవారం 70,996 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,809 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.














