9979 వార్తలు

నవతెలంగాణ – మిడ్జిల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల కు తగిలి గడ్డి ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైన సంఘటన వెలుగోముల గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంత కోడూరు గ్రామానికి చెందిన కురువ చిన్న మల్లేష్ బంధువులైన వెలుగోముల గ్రామానికి చెందిన బిర్లా నాగయ్య వ్యవసాయ పొలంలో ట్రాక్టర్లో గడ్డి చుట్టాలు నింపుకొని వెళ్తుండగా రోడ్డుపై ఉన్న విద్యుత్ ఎల్ టి తీగలకు తగిలి ట్రాక్టర్ ఇంజన్ తో పాటు […] The post విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ దగ్ధం appeared first on Navatelangana.



– ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైన రేవంత్ సర్కార్– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డినవతెలంగాణ – తొగుట : ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడంతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. తడిచిన పొద్దు తిరుగుడు ధాన్యంను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల […] The post రైతుల కన్నీటిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం appeared first on Navatelangana.

– రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ ముక్రమ్ అహ్మద్‌ను అభినందించిన షబ్బీర్ అలీనవతెలంగాణ – కామారెడ్డిటీజీ – ఈఏపీసెట్ (వ్యవసాయ, ఫార్మసీ విభాగం)లో రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ ప్రథమ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన విద్యార్థి ముక్రమ్ అహ్మద్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గురువారం సచివాలయంలోని తన కార్యాలయ ఛాంబర్‌లో ఘనంగా అభినందించారు. టీఎంఆర్,ఈఐఎస్‌కు చెందిన ముక్రమ్ అహ్మద్ 150.17 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంకు సాధించడం పట్ల షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం […] The post టీజీ–ఈఏపీసెట్‌లో కామారెడ్డి విద్యార్థుల సత్తా appeared first on Navatelangana.

– బెస్ట్ కంటెంట్ క్రియటర్ లకు నగదు బాహుమతినవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకురావడం కోసమే యూటూబర్లు, ఇన్ఫ్లూయర్లకు రీల్స్ కంపిటిషన్ నిర్వహించమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గత మూడు రోజుల క్రితం పిలుపు మేరకు పలువురు యూటూబర్ లు జిల్లాలోని పర్యటక ప్రాంతాలు, ప్రాచీన దేవాలయాలు, జలపాతాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయగా ప్రజల నుంచి వచ్చిన స్పందనను గుర్తించి విజేతలుగా ప్రకటించారు. […] The post సోషల్ మీడియా ప్రచారంతో పర్యాటక గుర్తింపు appeared first on Navatelangana.


నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పోలీస్ స్టేషన్ ను భువనగిరి డిసిపి బి రవీందర్ యాదవ్ సందర్శించి పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లతో రిసెప్షన్ అధికారి, సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందడంతో పాటు పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని సూచించారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లోని […] The post భువనగిరి రూరల్ పోలీస్ స్టేషను సందర్శించిన డి.ఎస్.పి appeared first on Navatelangana.

– ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా నాయకత్వం– జిల్లా నాయకుడు చిరంజీవికి పరామర్శనవతెలంగాణ – అశ్వారావుపేట : సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జూన్ 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు నేతృత్వంలో […] The post జూన్ 3,4,5 తేదీల్లో సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు appeared first on Navatelangana.

నవతెలంగాణ – రాయికల్: పట్టణ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం తల్లుల సమావేశం నిర్వహించారు.వైస్ చైర్మన్ తురుగ సౌజన్య అధ్యక్షతన, సీడీపీఓ జయప్రద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించి,పిల్లల బరువు,పొడవు పరిశీలించారు.ఈ సందర్భంగా సీడీపీఓ జయప్రద మాట్లాడుతూ చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని,ప్రీ స్కూల్ విద్య పిల్లల మానసిక,మేధో వికాసానికి పునాదిగా నిలుస్తుందని తెలిపారు.ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్‌వాడీల్లో నర్సరీ, ఎల్‌కేజీ,యూకేజీ స్థాయి బోధన అందిస్తున్నామని చెప్పారు.అనంతరం పట్టణంలోని అంగన్‌వాడీ […] The post చిన్నారుల మేధోవికాసానికి మూలం అంగన్‌వాడీ కేంద్రాలు: సీడీపీఓ appeared first on Navatelangana.

నవతెలంగాణ – వనపర్తి : భారత దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణ శిల్పి అని, యువతకు స్ఫూర్తి ప్రదాత అయ్యారని, ఆయన ఆశయాల సాధన కోసం అందరం కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సూచించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ […] The post ఆధునిక భారత నిర్మాణ శిల్పి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ appeared first on Navatelangana.



నవతెలంగాణ – డిచ్ పల్లి : 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 29 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్వేత మాట్లాడుతూ పంట మార్పిడి విధానం అనుసరించడం ద్వారా నేలలో […] The post పంట మార్పిడి పాటించండి..సుస్థిర ఆదాయాన్ని పొందండి appeared first on Navatelangana.


నవతెలంగాణ – వనపర్తి : పెద్దమందడి మండలం బలిజ పల్లె గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కొండారెడ్డి గారి భార్య శకుంతల గారు మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి కొండారెడ్డి గారిని వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. శకుంతల గారు లేని బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో టిపిసిసి […] The post కొండారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జిల్లాలు పూర్తిగా అడిగితే పోవడంతో నీటి సమస్య ఏర్పడిందని గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ అన్నారు. ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ డిస్టిక్ గ్రామస్తులు తీసుకురావడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామానికి నీరు సమస్య రాకుండా ఉండొచ్చుగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించడంతో గ్రామస్తులు వర్షం వ్యక్తం చేశారు. అనుకున్న తర్వాయి గురువారం నుండి గ్రామంలోని ప్రతి గల్లీ గల్లీకి నీటిని ట్యాంకర్ ద్వారా […] The post ట్యాంకర్ సాయంతో నీటి వసతిని కల్పించిన సర్పంచ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – అచ్చంపేట : మండల పరిధిలోని సింగారం గ్రామంలో రోడ్డు మలుపు లో నివాస గృహాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సు తిరగటానికి ఇబ్బందిగా ఉంది. దింతో గ్రామానికి చెందిన దుర్గి శ్రీనివాసులు, రవీంద్ర శర్మ (పురోహితులు) వాళ్ళ అమ్మ నాన్నలు స్వర్గీయ దుర్గిసత్యనారాయణ శర్మ, దుర్గిబాలక్రి ష్టమ్మగార్ల పేర్ల మీద విలువైన సొంత స్థలం గ్రామ ప్రజల సౌకర్యరార్థం కోసం విరాళంగా ఇచ్చారు. వారికీ సింగారం గ్రామప్రజలు, సర్పంచ్ నీలం శేఖర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. The post గ్రామ ప్రజల సౌకర్యం కోసం సొంత స్థలం విరాళం appeared first on Navatelangana.

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలోని12వ వార్డు పగిడిపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వార్డ్ కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్ లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం తో అండర్ డ్రైనేజీ పనులని శంకుస్థాపన చేసినట్లు జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దరున్నట్లు తెలిపారు. The post అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని చెండేగావ్ గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను ఎంపిడిఓ శ్రీనివాస్ గురువారం స్థానిక సర్పంచ్ బ్రాండెడ్ వార్ లక్ష్మణ్ తో కలిసి పరిశీలించారని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు గృహాలు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి ప్రారంభోత్సవాలు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసుకున్న ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు వారి ఖాతాలో […] The post చండేగావ్ జిపి గ్రామంలో ఇందిరమ్మ గృహలను పరిశీలించిన ఎంపీడీవో appeared first on Navatelangana.

నవతెలంగాణ – సదాశివనగర్ : మండలంలోని పద్మా జి వాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను బోధిస్తున్నామని తెలిపారు. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ,ఉచిత యూనిఫామ్, ఉచిత నోట్ […] The post పద్మాజి వాడిలో బడిబాట appeared first on Navatelangana.

నవతెలంగాణ – డిచ్ పల్లి : డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని మిట్టపల్లి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీనియర్ డీజీఎం ప్రభాకర్ గురువారం పాల్గోని ప్రారంభించారు. డిచ్ పల్లి రైల్వే స్టేషన్ ఏరియాల్లో పవర్ గ్రిడ్ ఉద్యోగులు అందరు కలిసి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సీనియర్ డీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా తమ సంస్థ ఉద్యోగులు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.15 రోజులపాటు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ […] The post పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ… appeared first on Navatelangana.

నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మాజీ ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్ పెద్ద కుమారుడు బాధవత్ విశాల్ నాయక్ దినకర్మ కార్యక్రమం గురువారం మండలంలోని ఓపెన్ తలలో రూప్లా నాయక్ తండాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ధర్పల్లి మాజీ జెడ్పిటిసి, బిఅర్ఎస్ రూరల్ ఇంచార్జీ బాజిరెడ్డి జగన్ మోహన్, మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, నాయకులు, […] The post మాజీ ఎంపీపీ కుమారుడి దినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.