9979 వార్తలు

నవతెలంగాణ – జన్నారం : జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్(53) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మృతుని బంధువులు తెలిపిన ప్రకారం చంద్రమోహన్ గత కొన్ని సంవత్సరాల నుండి కరీంనగర్ లో సివిల్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు అని తెలిపారు. వృద్ధులైన చంద్రమోహన్ తల్లిదండ్రులు రాంపూర్ గ్రామంలో ఉండటంతో ఆయన సతీమణి గత మూడు రోజుల క్రితం రాంపూర్ కు వచ్చి వారి బాగోగులు చూసుకుంటున్నారు. కరీంనగర్లో […] The post గుండెపోటుతో వ్యక్తి మృతి… appeared first on Navatelangana.


నవతెలంగాణ – కంఠేశ్వర్ : మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష లో భాగంగా డాక్టర్ జయలక్ష్మి జెడి బేసిక్ సర్వీస్, మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష రాష్ట్ర సంయోజక్ ఆది కామేశ్వర రావు నిజామాబాద్ జిల్లా జిజిహెచ్ లో ఉన్న ఏఆర్టి సెంటర్ ను మొదటగా సందర్శించారు. డాక్టర్స్ అలాగే సిబ్బంది తో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పేషెంట్ కు క్రమం తప్పకుండా మందులు వాడే విధంగా చూడడం అలాగే అర్హులైన వారికి వైరల్ లోడ్ చేయడం, అలాగే వారిని మధ్యలో మందులు […] The post హెచ్ఐవి సోకిన వారికి సురక్ష తో మౌలిక సేవలు appeared first on Navatelangana.


నవతెలంగాణ – తుంగతుర్తి : మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నార్కోటిక్ డాగ్, పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సమాజంలో గంజాయి లాంటి మాదకద్రవ్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని అన్నారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలోని టీ స్టాల్స్,పాన్ షాప్స్,హోటల్స్,కూరగాయల దుకాణాల యందు నార్కోటిక్ డాగ్ […] The post నార్కోటిక్ డాగ్ తో విస్తృత తనిఖీలు appeared first on Navatelangana.


నవతెలంగాణ – తుంగతుర్తి : ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలని,మిల్లుల వద్ద తరుగు,కోతలు లేకుండా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని రావులపల్లి,వెంపటి గ్రామాలలోని ఐకెపి కేంద్రాల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మిల్లులకు చేరిన లారీలు రోజులు గడిచిన అన్లోడ్ చేయడం లేదని కింటాకు మూడు కేజీల చొప్పున తరుగు తీస్తున్నారని,అధికారులకు చెప్పిన స్పందన లేదని అన్నారు. […] The post ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి: తాటికొండ సీతయ్య appeared first on Navatelangana.


నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని పెర్కిట్ ప్రైమ్ ఆశ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ కాలనీ కమ్యూనిటీ హాల్ 23 వ వార్డు యందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ అజీజ్, మెదడు వైద్య నిపుణురాలు అపర్ణ తదితరులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినారు. ల్యాబ్ టెస్ట్, ఈసీజీ, బీపీ, షుగర్, టుడి ఈకో తదితర పరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొట్టు రాజు, కాలనీవాసులు […] The post ఆశ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం appeared first on Navatelangana.




నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలును గురువారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహంనికి, పూలమాలలు వేసి నివాళులర్పించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు సాంకేతిక రంగాన్ని పరిచయం చేసి, దేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి నాయకుడు […] The post మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు appeared first on Navatelangana.


నవతెలంగాణ – వేములవాడతెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వర్ధ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం వేములవాడ పట్టణంలో జెండా గద్దె నిర్మాణ మంజూరు కోసం మున్సిపల్ సూపర్వైజర్ సంపత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా జెండా పండుగ ఇన్‌చార్జ్ అబ్దుల్ మజీద్ పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు నూనె మల్లేష్ యాదవ్, […] The post తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె నిర్మాణానికి వినతి.. appeared first on Navatelangana.


– ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు సెన్సిటైజేషన్ కార్యక్రమంనవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు హాల్‌లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లకు నాల్సా పథకాలపై సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు […] The post నాల్సా పథకాలపై అవగాహన కల్పించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతుండటంతో ఢిల్లీలో జరగాల్సిన నాలుగో ‘భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ (India-Africa Forum Summit)’ వాయిదా పడింది. మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ సదస్సును ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)’ ఇటీవల […] The post ఎబోలా ఎఫెక్ట్.. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా..! appeared first on Navatelangana.

నవతెలంగాణ – అశ్వారావుపేట : వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో గురువారం అల్లిగూడెం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి, డి. స్రవంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని అమలు చేయడం ద్వారా చీడపీడలు, కలుపు మొక్కల సమస్యలను నియంత్రించవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ పామ్‌తో పాటు ఇతర ఉద్యాన పంటల్లో […] The post అల్లిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – సారంగాపూర్ : మార్కెట్ కు తెచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది. రైతులు అధైర్య పడద్దు అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. గురువారం మండలకేంద్రంతోపాటు కౌట్ల(బి), జామ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎండలు సైతం లెక్కచెయ్యకుండా రైతులు ఇబ్బందులను పరిష్కరించ డానికి స్వయంగా తన అనుచరులతో బయలుదేరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోడంలను పరిశించి..రెండు వారాలు కష్టపడితే మొక్కజొన్న జొన్న వరి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందన్నారు.ఎండలో […] The post మార్కెట్ కు వచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది: మాజీ మంత్రి appeared first on Navatelangana.

– ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు – వైద్యుల నియామకంపై చర్యలు తీసుకుంటాం – డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబునవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కమిషనర్ దిలీప్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై పరిశీలన చేపట్టారు. చికిత్స పొందుతున్న […] The post ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత appeared first on Navatelangana.

నవతెలంగాణ – ఆలేరు రూరల్ : జలగం జనార్దన్ (జెన్ను సార్) 5వ వర్ధంతి సందర్భంగా ఆలేరు మండలం మందనపల్లిలో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్ధన్ నివాళులర్పించారు.జెన్ను సార్ సమసమాజ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన విప్లవ నేత అని కొనియాడారు.14 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న అసమానతలు, […] The post ప్రతిఘటన పోరాటయోధుడు జలగం జనార్దన్‌కు విప్లవ జోహార్లు appeared first on Navatelangana.

– ఏఎంసీ చైర్మన్ మహేందర్నవతెలంగాణ-చిన్నకోడూరుప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ వ్యయం, అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ అన్నారు. గురువారం చిన్నకోడూరులోని ఆగ్రోస్లో సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు, జనుము, జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పచ్చి రొట్ట ఎరువుల ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుందన్నారు. మట్టిలో సూక్ష్మ జీవాల సంఖ్య పెరిగి మట్టి ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. పర్యావరణానికి హితమైన వ్యవసాయానికి దోహదపడుతుందన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ […] The post ప్రకృతి వ్యవసాయం లాభదాయకం appeared first on Navatelangana.