9895 వార్తలు

దేశ సర్వోన్నత న్యాయస్థానం… సామాన్యుడి ఆఖరి ఆశాదీపం. రాజ్యాంగ నిబంధనలకు, పౌర హక్కులకు రక్షణ కవచం. అటువంటి అత్యున్నత పీఠం నుండి వెలువడే ప్రతి మాట సమాజానికి ఒక దిక్సూచి కావాలి. కానీ, అదే న్యాయస్థానం వేదికగా సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజాస్వామ్యవాదుల గుండెల్లో మంటలు రేపాయి. దేశంలో నిరుద్యోగ యువత ‘బొద్దింకల్లా’ తయారయ్యారని, పనిపాట లేకుండా సోషల్ మీడియాలో తిరుగుతున్నారని, ఆర్టీఐ […] The post నిజమైన పరాన్నజీవులెవరు? appeared first on Navatelangana.

హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద ధర్నా చేశారు. వరి ధాన్యం రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందని.. అన్నదాతను అరిగోసలు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల గోస ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలనే సచివాలయం ఎదుట ధర్నా చేపట్టినట్లు కవిత తెలిపారు. రెండున్నర ఏళ్లలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కవితతోపాటు ఆ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు ఫలక్‌నుమా పీఎస్‌కు తరలించారు.



వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ “దర్శకుడు కమల్.. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే చెప్పాడు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పా డు. అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం సిద్ధమయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. కం టెంట్ కూడా కొత్తగా ఉంటుంది. జూన్ 19న బలమైన కంటెంట్‌తో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తు లు’ ఆడియెన్స్ ముం దుకు వస్తోంది”అని అన్నారు. దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ “నా డెబ్యూ మూవ

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై జైలులో ఉన్న మాజీ జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన తల్లి శస్త్రచికిత్స కారణంగా జూన్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆయన విడుదల కానున్నారు. రూ.1 లక్ష ష్యూరిటీ చెల్లించడంతో పాటు, ఈ మూడు రోజుల్లో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోర్టు ఆదేశించింది. […] The post మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు తాత్కాలిక బెయిల్ appeared first on Navatelangana.

అమరావతి: మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని ఎపి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి పుట్టిందే అబద్ధాలపై అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒక అపరిచితుడు అని జగన్ కుటుంబం చేసిన దారుణాలను పార్థశారధి రెడ్డి బయటపెట్టారని, ఆనాడు పులివెందులలో ఘటనలకు బాధ్యుడైన వారు ఇప్పుడు వైసిపిలో ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆనాడు కాంగ్రెస్ నాయకులు, బొత్స కూడా మాట్లాడారని, ఆనాడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారో.. అదే తాను చెప్పానని అన్నారు. తన తండ్రి చావుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కారణమని జగన్ ఆనాడు చెప్పారని, రిలయన్స్ సంస్థలపై ఆనాడు జగన్ అనుచరులు దాడులు చేశారని విమర్శించారు. వివేకానందరెడ్డి ఎలా చనిపోయారంటే చిన్న పిల్లాడు కూడా చెబుతాడని, గొడ్డలి పార్టీ అంటే జగన్ కు ఎందుకు అంతబాధ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని, వైసిపి పాలనలో పరిపాలన గాడి తప్పిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పెట్టామని, కేంద్రం సహాయ సహకారాలతో అభివృద్ధి బాట పట్టామని అన్నారు. ఎవరూ రెండేళ్లలో ఊహించ

షియోమీ 17 మ్యాక్స్ చైనాలో విడుదలైంది. ఈ పరికరం షియోమీ 17 లైనప్‌లో ఐదవ మోడల్‌గా నిలిచింది. షియోమీ 17 మ్యాక్స్ మోడల్‌లో, లైనప్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే అదే ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ధర ఎంత, ముఖ్య ఫీచర్లు గురించి తెలుసుకుందాం. షియోమీ 17 మ్యాక్స్ ధరఈ సరికొత్త షియోమీ స్మార్ట్‌ఫోన్ నాలుగు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 12GB + 256GB వేరియంట్ ధర CNY 4,799 (సుమారుగా రూ. 68,000) 16GB + 256GB వేరియంట్ ధర CNY 5,099 (సుమారుగా రూ. 72,000) 12GB + 512GB వేరియంట్ ధర CNY 5,399 (సుమారుగా రూ. 76,000) 16GB + 512GB వేరియంట్ ధర CNY 5,799 (సుమారుగా రూ. 82,000). ప్రస్తుతం ఈ పరికరం చైనాలో ప్రీ- ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.మే 25 నుంచి ఆన్లైన్ స్టోర్ ద్వారా సేల్ కు రానుంది. ఈ ధర వద్ద భారత మార్కెట్లో విడుదల చేస్తే, ఇది ఐఫోన్ 17, శాంసంగ్ S25 ప్లస్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది. షియోమీ 17 మ్యాక్స్ ఫీచర్లుఈ డ్యూయల్-సిమ్ ఫోన్‌లో 6.9-అంగుళాల 1.5K (1,200×2,608 ప

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్, రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్.. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఆ తర్వాత రియల్టర్‌కు ధారాదత్తం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. The post డిప్యూటీ కలెక్టర్‌కు రూ.వందల కోట్ల ఆస్తులు appeared first on Navatelangana.

ముంబై: బాలీవుడ్ నటి, ఎంపి కంగనా రనౌత్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆమె తన ఇంటి నుంచి కారు ఎక్కేందుకు వస్తున్న వీడియో అది. అయితే అందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా..? ఈ వీడియో కంగనా మెడలో నల్లపూసల దండతో కనిపించింది. నల్లపూసలు, మట్టిగాజులతో కంగనా కనిపించడంతో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కంగన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్ చేయగా.. ఆమె పెళ్లి జరిగితే తప్పకుండా గ్రాండ్‌గా చేసుకుంటారని మరొకరు అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే, అది సినిమా షూటింగ్ కోసం వేసుకున్న గెటప్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం కంగనా ముంబైలో ఉంటున్నారు. తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ సీక్వెల్‌లో నటిస్తున్నారు. ‘క్వీన్-2’ అనే టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమాలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా సంప్రదాయబద్ధంగా తయారైనట్లు తెలుస్తోంది. zzz

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన పర్యాటకులతో నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందారు. ఘటన సమయంలో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది బస్సులో ఉన్నారు. ప్రయాణికులందరికీ స్వల్పగాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. The post యూపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఏపీవాసులు మృతి appeared first on Navatelangana.

నోకియా ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌ఎండీ తాజాగా భారత టెక్ మార్కెట్లో సరసమైన ధరకే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ పరికరం హెచ్‌ఎండీ వైబ్ 2 5G పేరిట విడుదల అయింది. ఇది గత సంవత్సరం వచ్చిన హెచ్‌ఎండీ వైబ్ 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో 6.7-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. చాలారోజుల నుంచి తక్కువ ధరకే మంచి ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ కొనాలని చూస్తుంటే, ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. హెచ్‌ఎండీ వైబ్ 2 5G ధర భారతదేశంలో ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లాంచ్ అయింది. 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. కాగా, ఈ పరికరం నార్డిక్ బ్లూ, కాస్మిక్ లావెండర్, పీచ్ పింక్ రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లతో పోటీ? పోటీ పరంగా, ఈ తాజా ఫోన్ Ai+ నోవా 2 5G, శాంసంగ్ M06 5G, లావా షార్క్ 5G, పోకో C81 వంటి మోడళ్లతో పోటీపడుతుంది. హెచ్‌ఎండీ వైబ్ 2 5G ధర ఈ ఫోన్ 6.7-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పరికరం 2.3GHz

ఐక్యూ సంస్థ తాజాగా చైనాలో సరికొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని ఐక్యూ ప్యాడ్ 6 ప్రో పేరిట విడుదల చేసింది. చైనాలో వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు వస్తోన్న ఈ కొత్త టాబ్లెట్ మూడు రంగుల ఎంపికలలో లభిస్తోంది. ఈ పరికరం 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 13,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఐక్యూ ప్యాడ్ 6 ప్రో ధర, లభ్యత ఐక్యూ ప్యాడ్ 6 ప్రో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,499 (సుమారుగా రూ. 64,000) 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,999 (సుమారుగా రూ. 71,000) 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,799 (సుమారుగా రూ. 83,000) 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 6,699 (సుమారుగా రూ. 95,000) ఈ కొత్త టాబ్లెట్ గ్రే క్రిస్టల్, ఐల్ ఆఫ్ మ్యాన్, సిల్వర్‌వింగ్ రంగులలో లభిస్తుంది. ఐక్యూ ప్యాడ్ 6 ప్రో ఫీచర్లు ఈ టాబ్లెట్‌లో 13.2-అంగుళాల 4K LCD టచ్‌స్క్రీన్ ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం,

అడవిలో బిడి ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఒకేసారి పులి దాడి చేసింది. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. దీంతో సిందేవహి తాలుకాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఎండిపోయిన బీడీ ఆకులు ఏరుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లడం అక్కడ సర్వసాధారణం. శుక్రవారం ఉదయం కూడా గంజేవాహి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు వెళ్లారు. దాదాపు ఉదయం 8 గంటల సమయంలో ఓ పులి మాటువేసి వారిపై దాడి చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బాధితులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అది భయంకరంగా విరుచుకుపడింది. దీంతో ఘటనా స్థలంలోనే నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. మృతులను కవుదుబాయి దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, సునీతా కౌశిక్ మొహర్లేగా గుర్తించారు. వీరంతా 33 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యవారే.

నవతెలంగాణ – హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా పడింది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్ పడింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 89 రన్ష్ తేడాతో విజయం సాధించింది. దీంతో అయిదు సార్లు చాంపియన్ అయిన చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హత కోల్పోయింది. చెన్నై జట్టు రెండో అఫెన్స్‌గా భావిస్తూ .. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ […] The post రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ జరిమానా appeared first on Navatelangana.

– డాక్టర్ కె.వి. రమణాచారికి అంకితోత్సవంనవతెలంగాణ -సుల్తాన్ బజార్ ప్రముఖ రచయిత డాక్టర్ వై. రామకృష్ణారావు రచించిన తరంగిణి నవల ఆవిష్కరణ సభ వంశీ ఆర్ట్ థియేటర్స్, వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానంద రావు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు ఐఏఎస్ (రి) డా. కె.వి. రమణ చారికి అంకితం […] The post ‘తరంగిణి’ నవల ఆవిష్కరణ… appeared first on Navatelangana.

హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని అన్నారు. అమెరికాలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉందని, ఫార్మాసిటీని కొనసాగిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని తెలియజేశారు. రేవంత్ ప్రభుత్వం కేవలం జిమ్మిక్కు చేస్తోందని, ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. 75 శాతం ఫార్మాసిటీ 25 శాతం మిగతావి ఉండాలని చూశామని, ఈ సర్కార్ 75 శాతం వ్యాపారం, 25 శాతమే ఫార్మా ఉండేలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం..ఫార్మా సిటీని రీసోర్ట్ చేస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు ప్రారంభించామని, ఈ ప్రభుత్వం ఏం చేసినా నడవదని.. కోర్టులో నిలబడదని హరీష్ రావు అన్నారు.

ఒప్పో భారత టెక్ మార్కెట్లో తన అత్యంత ప్రీమియం అయిన ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాను లాంచ్ చేసింది. అంతేకాదు సంస్థ ఈ పరికరంతో మరో రెండు కొత్త 5G ఫోన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ పరికరం ఫైండ్ ఎక్స్9 శ్రేణిలో అగ్రశ్రేణి మోడల్. ఈ పరికరంతో పాటు కంపెనీ ఫైండ్ ఎక్స్9ఎస్ ను కూడా విడుదల చేసింది. ఈ పరికరాలు ఇప్పుడు దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రో మోడళ్ల శ్రేణిలో చేరాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకునే ముందు, ముందుగా దీని ధరను చూద్దాం. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ధర, లభ్యతఒప్పో ఫైండ్ X9 అల్ట్రా 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.169,999 నుండి ప్రారంభమవుతుంది. కాగా, ఈ పరికరం కాన్యన్ ఆరెంజ్, టండ్రా అంబర్ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకుంటే రూ.11,000 వరకు విలువైన ఒక ఉచిత ప్రీమియం గిఫ్ట్ బాక్స్‌ను పొందవచ్చు. ఈ గిఫ్ట్ బాక్స్‌లో ఒప్పో ఎంకో ఎయిర్ 5 ప్రో TWS, ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా కోసం ఒక అధికారిక కవర్ కేస్ ఉంటాయి.

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామన్నారు. ‘‘ కేంద్ర పర్యావరణశాఖ ఫార్మాసిటీకే అనుమతిచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉంది. ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ సర్కార్ కోర్టుకు చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని […] The post ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తాం: హరీశ్‌రావు appeared first on Navatelangana.

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఒకే రోజు నలుగురు రైతులు చనిపోయారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్స్ దొరుకుతున్నాయని, డబ్బుల సంచులపై ఉన్న శ్రద్ధ ధాన్యం సంచులపై లేదని విమర్శించారు. భూదోపిడీపై పెట్టే శ్రద్ధ రైతులపై లేదని, రెండున్నర ఏళ్లయినా ఇంకా తమపైనే ఏడుస్తున్నారని మండిపడ్డారు. రేపటి కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కెటిఆర్ కోరారు. రేపు ప్రభుత్వ స్పందన చూసి కార్యాచరణ ప్రకటిస్తామని, బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ధ్వజమెత్తారు. 9 రోజులు రాచమర్యాదలు చేసిందెవరు? అని ప్రశ్నించారు. ఎవరైనా దొరికితే కేసు పెట్టు అని ఆ బాలిక వివరాలు బయటపెట్టిన వారిపై కేసు పెట్టాలని సూచించారు. కేంద్రమంత్రి కొడుకు అయితే ఏమైనా మినహాయింపు ఉంటుందా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

ఏసర్ భారత టెక్ మార్కెట్లో సరికొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని ఏసర్ ఆస్పైర్ 5 AI పేరిట తీసుకొచ్చింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల WUXGA డిస్‌ప్లే, 32GB వరకు LPDDR5 RAM, 1TB వరకు NVMe SSD స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది విండోస్ 11 హోమ్‌పై పనిచేస్తుంది. కంటెంట్ వినియోగం, తేలికపాటి గేమింగ్ కోసం ఆస్పైర్ 5 AIని సన్నగా, తేలికగా ఉండే ల్యాప్‌టాప్‌గా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఏసర్ ఆస్పైర్ 5 AI ధర, లభ్యతఏసర్ ఆస్పైర్ 5 AI ధర భారతదేశంలో ర్.79,999 నుండి ప్రారంభమవుతుంది. కాగా, కేవలం సిల్వర్ రంగులో మాత్రమే లభిస్తోన్న ఈ ల్యాప్‌టాప్ ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, ఏసర్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఏసర్ ఆస్పైర్ 5 AI స్పెసిఫికేషన్లు ఏసర్ ఆస్పైర్ 5 AIలో 1,920 x 1,200 పిక్సెల్ రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియోతో కూడిన 14-అంగుళాల WUXGA IPS డిస్‌ప్లే ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ ప్రాసెసర్‌ల ద్వారా పనిచేస్తుంది. ఏసర్, ఇంటెల్ కోర్ అ

నవతెలంగాణ – హైదరాబాద్ : కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను ఈడీ అధికారులు హర్యానాలోని గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవాలని, బెయిల్ రద్దు చేయాలని ఈడీ కోరడంతో ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో, నకిలీ ఆధార్ కార్డుతో గుర్గావ్‌లో దాక్కున్న నౌహీరాను అధికారులు పట్టుకున్నారు. ఆమెను శుక్రవారం హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు […] The post హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్ appeared first on Navatelangana.

తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. నటుడు జెడి చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మే 1న విడుదలైన ఈ సినిమా బోల్తాపడింది. హీరో అమెరికా వెళ్లాలని అనుకుంటే.. అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లా అతడి ప్లాన్ రివర్స్ అవుతుంది. దీంతో ట్రంప్‌పై కోపం పెంచుకున్న హీరో ఏం చేశాడు అనేదే సినిమా సారాంశం. అయితే రిలీజై నెల కూడా కాకముందే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.