
హైదరాబాద్: కల్వకుంట్ల తిక్కల్ రావు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. కెటిఆర్ పనికిమాలిన మాటలు మానుకోవాలని అన్నారు. అద్దంకి కెటిఆర్ కు కౌంటర్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం అని సిఎం కావాలని కెటిఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటి కొనసాగుతుందని.. ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. బండి భగీరథ్ కేసులో ప్రభుత్వం సరిగా స్పందించిందని నిందితుడిని అరెస్ట్ చేశారని తెలియజేశారు. దొంగలను కాపాడాల్సిన అవసరం సిఎం రేవంత్ రెడ్డికి లేదని అద్దంకి దయాకర్ రావు పేర్కొన్నారు.













