
ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్లానింగ్, భవిష్యత్ ఆర్థిక భద్రతపై అవగాహన కల్పించేందుకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) మిస్సోరి చాప్టర్ ఆధ్వర్యంలో ఉచిత ఫైనాన్షియల్ లిటరసీ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.

హ్యూస్టన్‌లోని ISKCON of Houston ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యే ఈ వేడుకలు సెప్టెంబర్ 7 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జన్మాష్టమి వేడుకలతో పాటు వార్షిక కీర్తన్ ఫెస్ట్ 2026ను కూడా నిర్వహిస్తున్నారు.

అమెరికాలోని బే ఏరియాలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా “Dussehra Diwali Dhamaka – Festival of Lights” గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. Association of Indo Americans (AIA), Bolly 92.3 FM ఆధ్వర్యంలో ఈ వేడుకలు అక్టోబర్ 17, 2026న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి.



ఫ్లోరిడాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తి, సంగీతం, నృత్యం, ఆటపాటలతో కన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 29న సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. Longwoodలోని Mother Earth Sanctuary వేదికగా కార్యక్రమం నిర్వహించనున్నారు.

న్యూయార్క్‌లోని నార్త్ హెంప్‌స్టెడ్‌లో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ సన్మానాలతో పాటు డాక్టర్ దత్తాత్రేయుడు నోరిని సత్కరించారు. భారతీయ-అమెరికన్ సమాజం సేవలను గుర్తిస్తూ ఆగస్టు 15ను ‘ఇండియా డే’గా గుర్తించే కార్యక్రమం కూడా చేపట్టారు.

మిచిగన్‌లో డా. హరనాథ్ పోలిచెర్ల వేన్ కౌంటీ కన్వెన్షన్‌కు ప్రెసింక్ట్ డెలిగేట్‌గా రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఈ బాధ్యత ఆయన ప్రజాసేవ, కమ్యూనిటీ భాగస్వామ్యం, నాయకత్వానికి గుర్తింపుగా నిలిచిందని మద్దతుదారులు పేర్కొన్నారు.

న్యూజెర్సీలో FIA NY-NJ-CT-NE, న్యూయార్క్ భారత కాన్సులేట్, Zoho Corporation కలిసి 1,383 అమెరికా జెండాలతో ‘250’ ఆకారాన్ని రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. India@80, America@250 వేడుకలకు గుర్తుగా నిర్వహించిన ఈ కార్యక్రమం భారతీయ-అమెరికన్ సమాజం ఐక్యత, దేశభక్తి, భారత్-అమెరికా స్నేహానికి ప్రతీకగా నిలిచింది.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో టీటీఏ ప్రతి ఏడాది అమెరికావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.

చార్లెట్‌లో వాలీబాల్ అభిమానులకు పండుగ రానుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో GTA Charlotte Volleyball Tournament 2026 నిర్వహించనున్నారు. చార్లెట్‌లో వాలీబాల్ అభిమానులకు పండుగ రానుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో GTA Charlotte Volleyball Tournament 2026 నిర్వహించనున్నారు.

అమెరికాలోని డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ (DATA) ఆధ్వర్యంలో DATA Bathukamma 2026 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మన మూలాలను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కెనడాలోని విండ్సర్‌లో బతుకమ్మ 2026 వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అక్టోబర్ 10న నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

అమెరికా తెలుగు సంఘం (ఆటా) విస్కాన్సిన్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిక్నిక్ ఘనంగా జరిగింది. విస్కాన్సిన్‌లోని తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రోజంతా ఆహ్లాదకరంగా గడిపారు. పిక్నిక్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రకాల ఆటలు, సరదా పోటీలు, సంగీతం, నృత్య కార్యక్రమాలతో సందడి నెలకొంది. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది.

హార్ట్‌ఫోర్డ్‌లో నిర్వహించిన “బ్యాండ్ ఇన్‌ఫ్యూషన్ – లైవ్ ఇన్ హార్ట్‌ఫోర్డ్” మ్యూజిక్ ఈవెంట్ ఘన విజయం సాధించింది. హార్ట్‌ఫోర్డ్ హంగామా ఆధ్వర్యంలో, InFusion సమర్పణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంగీతాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.





దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని.. డల్లాస్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. కార్టర్ బ్లడ్‌కేర్ సహకారంతో సెప్టెంబర్ 26న ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అమెరికా పర్యటనలో భాగంగా షార్లెట్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. IOC, TPCC NRI సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్లెట్‌లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు, తెలంగాణ వాసులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు.

సంగీత ప్రియులను అలరించిన మేస్ట్రో ఇళయరాజా “రాజా 50 – ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్” కార్యక్రమం ఆగస్టు 15న గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఇళయరాజా తన అద్భుతమైన సంగీత ప్రస్థానంలోని ఎన్నో మధుర గీతాలను ప్రత్యక్షంగా ఆలపించడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

గుజరాతీ, భారతీయ వైద్య నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే గుజరాతీ/ఇండియన్ ఫిజీషియన్ కన్వెన్షన్ 2026 ఆగస్టు 19 నుంచి 23 వరకు ఒర్లాండోలోని హిల్టన్ రిసార్ట్‌లో ఘనంగా జరుగుతోంది.

కొలరాడోలోని డెన్వర్ తెలుగు కమ్యూనిటీకి చెందిన GTA తెలంగాణ డెన్వర్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘మైల్ హై పికిల్‌బాల్ లీగ్’ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆగస్టు 29, 2026 శనివారం లిటిల్‌టన్‌లోని Epic Pickleball Clubలో ఈ పోటీలు జరగనున్నాయి.