హాతీ ఘోడా పాల్కీ.. జై కన్హయ్యా లాల్ కీ!” అంటూ ఫ్లోరిడాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తి, సంగీతం, నృత్యం, ఆటపాటలతో కన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 29న సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. Longwoodలోని Mother Earth Sanctuary వేదికగా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, Radhe Radhe Band ఆధ్వర్యంలో భజన్ క్లబ్బింగ్, మట్కీ ఫోడ్, హారతి, గర్బా డ్యాన్స్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే DJ Chikku సంగీతంతో వేడుకలు మరింత సందడిగా సాగనున్నాయి. సందర్శకుల కోసం రుచికరమైన ఆహారం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కార్యక్రమానికి RSVP ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని కన్నయ్య జన్మాష్టమిని ఆనందంగా జరుపుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
RSVP: https://docs.google.com/forms/d/e/1FAIpQLSexDL_JmCXwemTrbKH_eAB8ypQQvlejAh5XTSz-qxNK5wx5Yw/viewform
More Detials Contact:
Neeta Varma: 203-631-7801
Falguni Shah: 917-328-0774
Anita Gupta: 407-325-8773















