కెనడాలోని మిల్టన్‌లో ‘మిల్టన్ కా రాజా – గణేష్ సెలబ్రేషన్స్ 2026’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ఫ్రెండ్స్ క్లబ్ – మిల్టన్ ఆధ్వర్యంలో తొలి రోజు వేడుకలు భక్తి, సంప్రదాయం, సంతోషం, కమ్యూనిటీ ఐక్యతతో సందడిగా సాగాయి.
ఈ సందర్భంగా కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యురాలు క్రిస్టినా టెస్సర్ డెర్క్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె వేడుకల్లో పాల్గొని తెలుగు కమ్యూనిటీతో కలిసి ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకున్నారు. ఆమె రాకతో తొలి రోజు వేడుకలకు మరింత ప్రత్యేకత చేకూరింది.
వేడుకల్లో భాగంగా విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే గోశాల థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, భక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించారు.
తొలి రోజు వేడుకలను విజయవంతం చేసిన ప్రతి కుటుంబం, వాలంటీర్, భక్తుడు, మద్దతుదారులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
‘ఒక్క బప్పా.. ఒక్క కమ్యూనిటీ.. ఒక మరపురాని వేడుక’ అనే సందేశంతో రానున్న కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తెలుగు ఫ్రెండ్స్ క్లబ్ – మిల్టన్ ఆధ్వర్యంలో ‘మిల్టన్ కా రాజా 2026’ గణేష్ వేడుకలు కొనసాగనున్నాయి.

















