అమెరికాలోని షార్లెట్‌లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్నపూర్ణ ఫుడ్ ట్రక్‌ను ప్రత్యేకంగా ప్రారంభించారు. అమెరికాలోనే భారతీయ రుచులను అందించాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ ట్రక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అంతేకాదు.. శ్రావణిక – ది ఇండియన్ బుటిక్ ఆన్ వీల్స్ను కూడా షార్లెట్‌లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తులు, ఫ్యాషన్‌ను అందించే ఈ మొబైల్ బుటిక్ కూడా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మొత్తంగా.. భక్తి, భారతీయ రుచులు, సంప్రదాయ ఫ్యాషన్ కలగలిసిన షార్లెట్ గణేష్ ఉత్సవాలు సందడిగా సాగాయి.