హ్యూస్టన్‌లోని ISKCON of Houston ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యే ఈ వేడుకలు సెప్టెంబర్ 7 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జన్మాష్టమి వేడుకలతో పాటు వార్షిక కీర్తన్ ఫెస్ట్ 2026ను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ఇస్కాన్ హ్యూస్టన్ ఆలయానికి 40వ వార్షికోత్సవం కావడంతో వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 4న గ్రాండ్ జన్మాష్టమి సెలబ్రేషన్స్‌లో భాగంగా 3 హారతులు, ఫ్రూట్ ఫెస్టివల్, చిన్నారుల కాస్ట్యూమ్ కాంటెస్ట్తో పాటు ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేశారు. కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 5న శ్రీల ప్రభుపాద డే, భజన్ సంధ్య, సెప్టెంబర్ 6న ఫ్లవర్ ఫెస్టివల్ (పుష్ప అభిషేకం), సెప్టెంబర్ 7న కీర్తన్ ఫెస్ట్ ఫినాలే నిర్వహించనున్నారు.
జన్మాష్టమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పార్కింగ్‌కు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. భక్తుల కోసం 7401 Katy Freeway, Houston, TX 77024 వద్ద ఉచిత పార్కింగ్, షటిల్ సదుపాయం కల్పించారు. ఈ సదుపాయం సెప్టెంబర్ 4న సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అందుబాటులో ఉంటుంది.
0 నుంచి 12 ఏళ్ల చిన్నారుల కోసం కాస్ట్యూమ్ కాంటెస్ట్ కూడా నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.














