
1579 వార్తలు

అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి కన్నవారి కష్టాలను తీర్చాలనుకున్న ఒక యువకుడి కలలు అర్థాంతరంగా ముగిశాయి. కర్నూలు నగరం గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నకొడుకు ఉన్నత స్థితిలో తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులకు, చందు విగతజీవిగా వస్తున్నాడనే వార్త తీరని వేదనను మిగిల్చింది.

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో భూ వివాదాల కారణంగా గ్రామ తాగునీటి బోరుకు కొందరు తాళం వేయడంతో గ్రామస్తులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో తాగునీరు లేక అల్లాడుతున్నారు. పంచాయతీ అధికారులు తాళాలు తీసినా, మళ్ళీ వేస్తున్నారు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మీ పాదాలు మీ అంతర్గత ఆరోగ్యానికి అద్దం వంటివి. పాదాల్లో వాపు, తిమ్మిర్లు, చల్లబడటం, పొడిబారడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి కిడ్నీ, గుండె, మధుమేహం, థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధులకు సంకేతాలు కావచ్చు. ప్రారంభ దశలోనే వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం.

తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఆర్తి అగర్వాల్ ఒకరు. మొదటి సినిమాతోనే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. తాజాగా ఆమె గురించి దర్శకుడు విజయ్ భాస్కర్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

పొలాల్లో కనిపించిన ఓ అడవి బాతు పిల్ల లక్షణాలను ఈ కథనం వివరిస్తుంది. అడవి బాతుల దేహ నిర్మాణం, ఆహారపు అలవాట్లు, పిల్లలను పెంచే తీరు వంటి వివరాలు తెలుపుతుంది. వన్యప్రాణులను పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం చట్టరీత్యా నేరం అని, వాటిని వాటి సహజ ఆవాసాల్లోనే వదిలివేయడం ఉత్తమం అని స్పష్టం చేస్తుంది.

నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో చెల్లి పెళ్లి వేడుకలో ప్రదీప్ అనే యువకుడు డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. అన్నవరంలోని "అన్నయ్యా అన్నావంటే" పాటకు నృత్యం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా ఉన్న పెళ్లి ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ సంగతి పక్కన పెడితే రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలకు ఎక్కడ హాని జరిగినా వెంటనే తన దైన శైలిలో స్పందిస్తుంటుంది. అందులో భాగంగానే ఇటీవల ఎడ్ల బండిపై ఆటోను పెట్టి ర్యాలీ చేసిన ఓ నేతపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిందీ జబర్దస్త్ యాంకర్.

ప్రస్తుతం ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. అలాగే ఇప్పుడు మలయాళీ థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు సత్తా చాటుతుంది. ఒక చిన్న కుట్ర అతడి కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు, కథ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, వెన్నులో వణుకు పుట్టించే సస్పెన్స్‌తో నిండిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. తన లైంగిక వాంఛ తీర్చేందుకు ఆయన భార్య ఒప్పుకోలేదు. వెరసి కిరాతకమైన ప్లాన్ వేసి.. అడ్డంగా దొరికాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్ లో జరిగిన ఓ హత్య కేసులో మిస్టరీని చేధిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూసాయి. హత్య చేసి ఏమి ఎరగనట్టు అమాయకంగా నటిస్తూ కుటుంబ సభ్యులు, పోలీసుల వెంట విచారణకు తిరిగాడు. సీన్ కట్ చేస్తే అసలు నిందితుడని తేలడంతో కటకటాల వెనక్కి నెట్టారు ఖాకీలు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గుడికల్ గ్రామంలో గురువారం నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ గుడికల్ దర్గా ఉరుసు ఉత్సవాల వేళ, సంతోషంగా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటపై కేసు నమోదు చేసిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాబా వంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన అంచనాల ఆధారంగా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాలు, ప్రమాదాల గురించి ఈయన ముందే అంచనా వేసి తెలియజేశాడు. ఆయన చెప్పినవి చాలా వరకు నిజం అవ్వడంతో చాలా మంది ఈయన జోస్యంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈయన తన జ్యోతిష్యం ప్రకారం మే నెలలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని తెలియజేశారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సరోజ్ మిశ్రా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కుంభమేళా బ్యూటీ మోనాలిసా భోస్లే షాకింగ్ ఆరోపణలు చేసింది. ఈ విషయం గురించి తన ఫ్యామిలీకి చెప్పినా పెద్దగా పట్టించుకోలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

డబ్బుతో కొలవలేనిది ఏదైనా ఉందీ అంటే అది 'కృతజ్ఞత'. కేవలం 35 వేల రూపాయల సహాయం ఒక మనిషి ప్రాణం ఇచ్చేంతటి బంధాన్ని ఎలా సృష్టించిందో ఈ కథ చదివితే తెలుస్తుంది. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిన నటుడు శివాజీ రాజా.. ఆ వివరలు ఇలా..

హరిద్వార్‌లోని గంగా నది తీరంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా భావించే గంగా ఘాట్ వద్ద ఒక మహిళ తన పెంపుడు కుక్కకు స్నానం చేయించడం ఈ వివాదానికి మూలమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

తెలుగు సినిమా దర్శకుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా టీవీ 9తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదురైన కొన్ని విషయాలను పంచుకున్నారు.

ఆర్థిక రాజధాని ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ మరణాలకు వారు తిన్న పుచ్చకాయే కారణమనే అనుమానాలు మొదట్లో వ్యక్తం కావడంతో, వేసవిలో అత్యధికంగా అమ్ముడయ్యే పుచ్చకాయపై ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఫోరెన్సిక్ నివేదికలు, దర్యాప్తులో వెలుగుచూస్తున్న అంశాలు ఈ మరణాల వెనుక మరేదో రహస్యం దాగి ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి.

ఓవైపు కమెడియన్ గా చేస్తూనే మరోవైపు హీరోగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నటుడు సత్య. అలా తాజాగా అతను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జెట్లీ. టీజర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఈ మూవీ శుక్రవారం (మే01) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సాధారణంగా కొండచిలువలు అడవుల్లోనో, చెట్ల మీదో ఉంటాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా నీటి లోతులో, చేపలా ఈదుకుంటూ వెళ్తున్న భారీ పైథాన్‌ను ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకున్నటున్నారు బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు

గుంటూరు నగరంలో మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్ష్మీపురం, ఇన్నర్ రింగ్ రోడ్డులోని స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు మహిళలు, పురుషులు పట్టుబడ్డారు. వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని నిర్ధారణ కావడంతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా యజమానులకు టాస్క్ ఫోర్స్ దాడులతో వణుకు పుడుతోంది.

AP School Holidays: వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) సంబంధించి పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. సెలవులతో పాటు విద్యార్థులను పైతరగతులకు సిద్ధం చేసేందుకు జూన్ 12 నుంచి ప్రత్యేక బోధన ఉంటుంది. 1, 2, 6 తరగతులకు 36 రోజులు..

అమెరికా - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉమ్మడి వాణిజ్య ఒప్పందానికి విరుద్ధంగా యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాలనూ తెరిచి ఉంచుతామని యూరోపియన్ యూనియన్ శనివారం (మే 2, 2026) హెచ్చరించింది.