తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఆర్తి అగర్వాల్ ఒకరు. మొదటి సినిమాతోనే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. తాజాగా ఆమె గురించి దర్శకుడు విజయ్ భాస్కర్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.