హైదరాబాద్, కుషాయిగూడ మార్కెట్ సమీపంలో 54 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో చేసిన అద్భుత అలంకరణలు, టపాసుల వెలుగులు మధ్య స్వామివారి విగ్రహం దర్శనమిచ్చి భక్తులను మంత్రముగ్ధులను చేసింది.

ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు అంజన్న భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. “జై శ్రీరామ్” నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోగా, మొత్తం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. వేడుకకు సంబంధించిన దృశ్యాలు భక్తుల్లో గూస్‌బంప్స్ కలిగించేలా ఉండటం విశేషం.