నవతెలంగాణ-సిర్పూర్ (టి )గ్రామంలో నాటుసారా తయారీతో పాటు బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్న ప్రజల ఫిర్యాదుపై పాలకమండలి స్పందించింది. గ్రామస్తుల వినతిని పరిగణలోకి తీసుకున్న సర్పంచ్ ఒడ్డెటి నాగమణి, పాలకమండలి సభ్యులు గత నెల 13న నిర్వహించిన గ్రామసభలో ఈ అంశంపై చర్చించారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం కాగజ్‌నగర్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. […]
The post నాటు సారాయి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలి appeared first on Navatelangana.











