1550 వార్తలు

ఇడ్లీ-దోసెలు మనకు ఇష్టమైన దక్షిణ భారత వంటకాలు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మల్లెపువ్వుల్లా మెత్తటి, ఉబ్బిన ఇడ్లీలు తింటే, ఆ రోజు చక్కగా ప్రారంభమవుతుంది. అయితే, వేసవిలో వేడి కారణంగా పిండి త్వరగా పులిసిపోతుంది. చాలాసార్లు, పిండి మరీ ఉబ్బిపోయి గిన్నెలోంచి బయటకు రావడం మొదలవుతుంది. దాని రుచి చాలా పుల్లగా లేదా వగరుగా మారుతుంది. అటువంటి సందర్భంలో, పులిసిపోయిన ఈ పిండిని పారవేయడం తప్ప మనకు మరో మార్గం ఉండదు. కానీ ఈ పిండిని అస్సలు పారవేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

Rohit Sharma : గాయం కారణంగా దాదాపు 22 రోజుల పాటు ఆటకు దూరమైన రోహిత్, మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. సోమవారం LSGతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.

ODI World Cup 2027: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో టీం ఇండియా వికెట్ కీపర్ స్థానంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఫామ్ కోల్పోయి తడబడుతున్న రిషబ్ పంత్‌ను పక్కన పెట్టి, కేరళ స్టార్ సంజూ శాంసన్‌కు వన్డేల్లో శాశ్వత చోటు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

Tirupati Gangamma Jatara: తిరుపతిలో మే నెలలో జరిగే ప్రసిద్ధ జానపద ఉత్సవం గంగమ్మ మహా జాతర. ఇది ఏడురోజులు కొనసాగి, గ్రామదేవత గంగమ్మను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. 900 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ చారిత్రక జాతరలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు అదొక సెంటిమెంట్. అయితే గత ఏడాది కాలంగా సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు, మంగళవారం నాడు స్వల్పంగా తగ్గి ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు.

వైవాహిక జీవితంలో లైంగిక కోరిక కాలక్రమేణా తగ్గుతుందని పూరి జగన్నాథ్ వివరిస్తున్నారు. ప్రారంభ ఉత్సాహం, ఆకర్షణ క్రమంగా మాయమై, రోజువారీ జీవితం, ఒత్తిళ్లు దాని స్థానాన్ని ఆక్రమిస్తాయి. సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రేమ, బాధ్యతలే ముఖ్యమని, లైంగిక కోరిక పారిపోయినా దానికోసం తగాదాలు పడకూడదని ఆయన సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనం వాన చినుకులతో ఉపశమనం పొందినా.. అవే చినుకులు రైతన్నల పాలిట కన్నీటి చుక్కలయ్యాయి. అటు ఏపీ ఇటు తెలంగాణలోని పలు జిలల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. ఈ ప్రకృతి కోపానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

టాక్ ఆప్ ది స్టేట్‌గా మారిన కరీంనగర్ దోపిడీపై ఇన్వెస్టిగేషన్ యమా స్పీడ్‌గా సాగుతోంది...! ఐదుగురిలో ఇద్దరు దొంగలను ఐడెంటిఫై చేశారు. ముఠాలో ముగ్గురు బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. అలాగే... పొలిటికల్ గానూ ఇష్యూ కాక రేపుతోంది. పూర్తి వివరాలు కథనం లోపల...

అనకాపల్లి జిల్లాలో ఓ టీవీ యాంకర్ గెద్దాడ మేరీ అలియాస్ మధుశ్రీ దొంగతనం కేసులో అరెస్టయ్యారు. ఆమె భర్త స్నేహితుడు లోకనాథ్‌తో కలిసి ఇళ్లల్లో చోరీలు చేసి, బంగారం, వెండి అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల జంట పగటిపూట ఇళ్లను రెక్కీ చేసి, రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దోచుకునేది.

వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల ప్రభావం కేవలం మనుషులపైనే కాకుండా మూగజీవులపై కూడా తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పెంపుడు కుక్కలు చాలా సులభంగా వడదెబ్బకు గురవుతున్నాయి. అయితే చాలామంది యజమానులు ఈ విషయాన్ని సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.

ఇద్దరు ప్రేమికుల మధ్య తలెత్తిన వివాదమే కాస్తా వారి మృత్యువును వెంటాడింది. మొదట ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ప్రియుడి మరణం తట్టుకోలేక ఆ ప్రేమికురాలు సైతం ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి నూరెళ్లు బతకాలనుకున్న వారి కల కలగానే మిగిలిపోయింది. ఇంతకూ ప్రాణాలు తీసుకునేంత వివాదం వారిద్దరి మధ్య ఏంటో చూద్దాం పదండి.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సరికొత్త ట్రాప్‌డోర్ సాలీడు జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 'టైటనిడియోప్స్ కొలహాపూరెన్సిస్' అని పిలిచే ఈ సాలీడు తన బొరియకు రహస్య తలుపు నిర్మించుకోవడం, 43 ఏళ్ల వరకు జీవించడం వంటి ఆసక్తికర విశేషాలను కలిగి ఉంది. ఆ వివరాలు..

భారతీయ సంస్కృతిలో ఉప్పును ఆహారానికి రుచిని పెంచే పదార్థంగా మాత్రమే కాకుండా సానుకూల శక్తికి చిహ్నంగా, వాస్తుశిల్పంలో ఒక ముఖ్యమైన సాధనంగా కూడా పరిగణిస్తారు. వంటగదిలో సాధారణంగా కనిపించే ఈ పదార్థం మీ ఆర్థిక స్థితికి, మీ ఇంట్లోని సంతోషం, శాంతికి నేరుగా సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు..

చాలా మంది ఊబకాయం, అధిక బరువు మాత్రమే కాకుండా ,పొట్టదగ్గర అధిక కొవ్వు పెరిగి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రతి రోజూ ఉదయం ఈ ఓట్స్ తో తయారు చేసిన గంజి తాగడం వలన పొట్టదగ్గర ఉన్న అధిక చెడు కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుందంట. అయితే దీనిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూసేద్దాం..

క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాటు ఇతర బ్యాటర్ల సమిష్టి కృషితో జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.

హిందువులకు అత్యంత పవిత్రమైన, శివుని నివాసంగా భావించే కైలాష్ మానసరోవర్ యాత్ర 2026 కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఈ ఏడాది జూన్ నుండి ఆగస్టు నెలల మధ్య ఈ ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. యాత్రను మరింత సులభతరం చేసేందుకు, దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రాముఖ్యత కలిగిన ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం చాలా అవసరం.

Thalapathy Vijay Car Collection: ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, విజయ్ ఒక BMW i7ను కూడా కొనుగోలు చేశాడు. ఈ పూర్తి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ ధర సుమారు రూ.2 కోట్లు. ఇది 449 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని ప్రధాన..

క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారింది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ తన బ్యాట్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇన్నింగ్స్‌లో పూరన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. కేవలం 21 బంతుల్లోనే 8 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలింగ్‌ను ముక్కలు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 12 రోజుల తర్వాత భారీ దొంగ తనాన్ని ఛేదించారు జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు.. అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది..

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం రాశులపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తుంది. అయితే అతి త్వరలో కీడు, నీడ గ్రహంగా పిలిచే కేతు గ్రహం ఆగస్టు 2న నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహకందని ప్రయోజనాలు చేకూరుతుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మల్లె మొక్కకు అధికంగా పూలు పూయాలంటే కేవలం నీరు పోస్తే సరిపోదు. ప్రూనింగ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూర్యరశ్మి ప్రాధాన్యత, మొక్కకు కావాల్సిన ప్రత్యేక ఎరువుల మిశ్రమం గురించి ఇక్కడ తెలుసుకోండి. ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకోండి. ఆవచెక్క పొడి, వేపపిండి వంటి సహజ ఎరువులతో మీ మల్లె మొక్కను మొగ్గలతో నింపేయండి.

దేశంలో జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమిళనాడులో విజయం దిశగా దూసుకెళ్తున్న టీవీకే చీఫ్ విజయ్‌కు ప్రధాని మోదీ అభినందలను తెలిపారు. తమిళనాడు పురోగతిని, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.

Salt Vastu Tips: ఉప్పు కేవలం రుచికి మాత్రమే కాదు, వాస్తు, ఆధ్యాత్మిక పరంగానూ ప్రాముఖ్యత కలిగి ఉందని నమ్మకం ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తగ్గించి, శాంతి, శ్రేయస్సును పెంచుతుందని భావిస్తారు. సాయంత్రం ఉప్పు ఇవ్వకూడదని, దానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలనే విశ్వాసం ఉంది. ఉప్పును సరిగా ఉపయోగిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.