హిందువులకు అత్యంత పవిత్రమైన, శివుని నివాసంగా భావించే కైలాష్ మానసరోవర్ యాత్ర 2026 కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఈ ఏడాది జూన్ నుండి ఆగస్టు నెలల మధ్య ఈ ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. యాత్రను మరింత సులభతరం చేసేందుకు, దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రాముఖ్యత కలిగిన ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం చాలా అవసరం.