24578 articles




మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను ప్రపంచ స్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందు కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా శామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరా ల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి చెప్పారు. సోమశిలలో మరో ప్రపంచస్థా యి కోర్సు కృష్ణానది తీరంలో, నల్లమల అడవులు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యాటక క్లస్టర్ సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడల ప్రచారానికి కపిల్ దేవ్ సేవలు వినియోగించుకుంటామన్నారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 12వ ఎడిషన్ సందర్భంగా శనివారం గోల్కొండలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డిపి వరల్డ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (డిపి వరల్ పిజిటీఐ), హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఈవెంట్ పార్ట్‌నర్‌గా తెలంగాణ టూరిజం వ్యవహారిస్తోందన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ జస్విందర్ సింగ్ బిర్గి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌కు రూ.కోటి ప్రైజ్‌మనీగా

ఫిరోజ్‌పూర్ (పంజాబ్): పంజాబ్‌లో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఫిరోజ్‌పూర్‌లో గుర్తు తెలియని దుండగులు.. ఆప్ నేత గుర్ ప్రీత్ సింగ్(అలియాస్ గోపి) ను కాల్చి చంపారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మామ్‌డోట్ పట్టణంలో గోపి, 22 ఏళ్ల హర్‌ప్రీత్ అలియాస్ హ్యాపీతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.కారులో వచ్చిన నలుగురు దుండగులు ప్రధాన మార్కెట్ వద్ద వాహనం దిగి, గోపీ, హర్‌ప్రీత్‌లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపిని వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, హర్‌ప్రీత్‌ను చికిత్స కోసం లూథియానాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.







కాఠ్మండు: నేపాల్ అకస్మిక వరదల విధ్యంసంలో మృతుల సంఖ్య 734కు పెరిగింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 2,498 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ విపత్తుల శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం నేపాల్ అధికారులు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, పరిస్థితి విషమంగానే తెలుస్తోంది. ఇక, 5,000 మందికి పైగా నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా 11,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహాయక చర్యల కొనసాగుతున్నట్లు నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఆర్‌ఎంఏ) పేర్కొంది."రసువాలోని భోటేకోశి నదిలో వరద ప్రవాహం మరింత పెరిగినట్లు సమాచారం అందిందని ఎన్‌డిఆర్‌ఆర్‌ఎంఏ తెలిపింది. "గాలింపు, సహాయక, పునరావాస చర్యలలో నిమగ్నమైన సిబ్బంది, నదీతీర ప్రాంతాలలో ఉన్నవారు.. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్‌తో సహా ప్రభావిత ప్రాంతాలలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి" అని సూచించింది.





న్యూఢిల్లీ: వచ్చే నెల 12న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ 57వ సమావేశం జరగడానికి ఒక రోజు ముందు, అనగా సెప్టెంబర్ 11న జిఎస్‌టి అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు కౌన్సిల్ సచివాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నట్టు తెలిపింది. అయితే, గత సంవత్సరం జరిగిన సమావేశంలో వస్తువులు, సేవలపై జిఎస్‌టి రేట్లు, పన్ను శ్లాబుల్లో భారీ మార్పులకు కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు జరుగబోయే కౌన్సిల్ సమావేశంలో, నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను ఇతరులకు బదిలీ చేసే వ్యాపార సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా, జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియలో ఆటోమేషన్‌తో పాటు ఇతర మార్పులను కూడా కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్‌ను బదిలీ చేసే పెద్ద వ్యాపార సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ మంజూరు చేసే విషయంలో కేంద్ర జీఎస్టీ విభాగాలు, వివిధ రాష్ట్రాల జీఎస్టీ విభాగాలు అనుసరిస్తున్న విధానాల్లో ఏకరూపత

నవతెలంగాణ – హైదరాబాద్ :దేశవ్యాప్తంగా ‘నీట్ పీజీ 2026’ పరీక్ష ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. దీంతో అతడిని సిబ్బంది గుర్తించి వెనక్కి పంపారు. దేశవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో ఈ పీజీ పరీక్ష జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరగనుంది. The post నీట్ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి appeared first on Navatelangana.

విండ్‌హోక్: జింబాబ్వే, నమీబియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పసికూన నమీబియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న సౌతాఫ్రికా జట్టు.. శనివారం జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సికూన నమీబియా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 145 పరుగులు చేయగా.. అనంతరం లక్ష ఛేదనకు దిగిన సఫారీ టీమ్ భీకర బ్యాటింగ్‌తో 13.4 ఓవర్లలోనే కేవలం 3 వికెటుల మాత్రమే కోల్పోయి లక్షాన్ని అందుకుంది. డెవాల్ బ్రెవిస్ (75 నాటౌట్) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఓపెనర్లు ప్రిటోరియస్(22), జోర్డాన్ హెర్మన్(20) విఫమైనా డెవాల్ చెరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34), మరుమనీ (30) టాప్ స్కోరర్లు.



