కాఠ్మండు: నేపాల్ అకస్మిక వరదల విధ్యంసంలో మృతుల సంఖ్య 734కు పెరిగింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 2,498 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ విపత్తుల శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం నేపాల్ అధికారులు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, పరిస్థితి విషమంగానే తెలుస్తోంది. ఇక, 5,000 మందికి పైగా నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా 11,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహాయక చర్యల కొనసాగుతున్నట్లు నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఆర్‌ఎంఏ) పేర్కొంది.

"రసువాలోని భోటేకోశి నదిలో వరద ప్రవాహం మరింత పెరిగినట్లు సమాచారం అందిందని ఎన్‌డిఆర్‌ఆర్‌ఎంఏ తెలిపింది. "గాలింపు, సహాయక, పునరావాస చర్యలలో నిమగ్నమైన సిబ్బంది, నదీతీర ప్రాంతాలలో ఉన్నవారు.. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్‌తో సహా ప్రభావిత ప్రాంతాలలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి" అని సూచించింది.