
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను ప్రపంచ స్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందు కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా శామీర్‌పేట సమీపంలోని జవహర్‌నగర్‌లో 130 ఎకరా ల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి చెప్పారు. సోమశిలలో మరో ప్రపంచస్థా యి కోర్సు కృష్ణానది తీరంలో, నల్లమల అడవులు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యాటక క్లస్టర్ సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
క్రీడల ప్రచారానికి కపిల్ దేవ్ సేవలు వినియోగించుకుంటామన్నారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 12వ ఎడిషన్ సందర్భంగా శనివారం గోల్కొండలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డిపి వరల్డ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (డిపి వరల్ పిజిటీఐ), హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఈవెంట్ పార్ట్‌నర్‌గా తెలంగాణ టూరిజం వ్యవహారిస్తోందన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ జస్విందర్ సింగ్ బిర్గి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌కు రూ.కోటి ప్రైజ్‌మనీగా ప్రకటించినట్టు ఆయ న తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగే టోర్నీలో 132 మంది గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు.











