24437 articles

టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొత్త రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఆయన క్రికెటర్‌గా మాత్రమే మనందరికీ పరిచయం. అయితే ఆయన ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాతగా సందడి చేయనున్నారు. బిగ్‌బాస్ బంగ్లా రియాల్టీ షోకి గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దాదాపు దశాబ్ధకాలం విరామం తర్వాత బిగ్‌బాస్ బంగ్లా ప్రారంభం కానుంది. తొలి సీజన్‌కు మిథున్ చక్రవర్తి, రెండో సీజన్‌కు నటుడు జీత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే సీజన్-3కి గంగూలీ వ్యాఖ్యాతగా అలరించబోతున్నారు. బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా చేయడానికి ఒప్పుకోవడం వెనుక ఉన్న కారణాన్ని గంగూలీ పంచుకున్నారు. ‘‘బిగ్‌బాస్ ఒక వైవిధ్యమైన షో. అందరికీ దగ్గరైన షో. సుదీర్ఘ విరామం తర్వాత బెంగాల్‌లో మళ్లీ మొదలవుతోంది. ఇంతకు ముందు వచ్చిన బిగ్‌బాస్ షోలను రోజూ చూసే సమయం ఉండేది కాదు. వీకెండ్ మాత్రం కచ్చితంగా చూసే వాడిని. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ఎలా చేశారో బాగా పరిశీలించా. ఇది చేయడం నాకు ఆసక్తికరంగానే ఉంది’’ అన్నారు. ఇక గ్రాండ్ ప్రీమియర్‌కు టీం ఇండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా విచ్చేసి సందడి చేశారు.




గుంటూరు: నగరంలో పట్టపగలే దారుణ హత్య జరగడం కలకలం సృష్టించింది. స్థాని కొండా వెంకటప్పయ్య కాలనీలో చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో చిన్నా నిందితుడిగా ఉన్నాడు. ఘర్షణల నేపథ్యంలో అతను తెలంగాణలోని సూర్యాపేట వెళ్లి అక్కడే కుటుంబంతో జీవిస్తున్నాడు. గుంటూరులో ఉండే అతడి బాబాయ్ చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం సూర్యాపేట నుంచి గుంటూరు వచ్చాడు. దీంతో ప్రత్యర్థులు కాపు కాచి చిన్నాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



అమరావతి: రెసిడెన్షియల్ స్కూల్ లో చేరకుండా గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఎపి మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ సమీపంలో గల గిరిజన గురుకుల పాఠశాల మారిక వలస స్కూల్ పై కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్టి విద్యార్థుల ప్రమాణాలు పెంచేందుకే సెంటర్ ఆఫ్ ఎక్స్ లైన్స్ కేంద్రాలు ఉన్నాయని, మారిక వలస రెసిడెన్షియల్ స్కూల్ లో సివొఇ ఏర్పాటు చేశామని, 445 మందిని ఇతర ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించామని సంధ్యారాణి తెలియజేశారు. ఇతర స్కూళ్లలో చేరనివ్వకుండా కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవద్దా? అని ప్రశ్నించారు. ఎస్టి విద్యార్థులు.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకోవాలని సంధ్యారాణి కోరారు.


హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అజామాబాద్ లో ప్రభుత్వ భూమిని రూ. 500 కోట్ల భూమిని 87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. మాజీ సిఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. భూమి కొనుగోలుకు ఆయిల్ ఫెడ్ సిద్ధంగా ఉన్నా..ప్రైవేట్ వారికి ఇస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. తక్షణమే అక్రమ భూకేటాయింపును రద్దు చేయాలని సూచించారు. అజామాబాద్ ఆర్ టిసి క్రాస్ రోడ్స్ లోని భూమిని ఆయిల్ ఫెడ్ కే దక్కేలా చూడాలని, ఆయిల్ ఫెడ్ కు చెందిన 3.23 గుంటల భూమిని కాపాడాలని హరీష్ రావు కోరారు.



శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎక్కువగా నోబాల్స్ వేశాడు. 2021 నుంచి ఇఫ్పటివకూ జడేజా దాదాపు 85 నోబాల్స్ వేయడం గమనార్హం. ఇక ఈ సిరీస్‌తో ఆరంగేట్రం చేసిన సారాంశ్ జైన్ కూడా కొన్ని నోబాల్స్ వేశాడు. .ఇదే విషయమై స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతలే మాట్లాడుతూ ‘టెస్టుల్లోనూ నో బాల్ వేస్తే ఫ్రీహిట్ ఇస్తే బాగుంటుంది’ అని అన్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఓ కీలక సూచన చేశారు. ఇలా పదే పదే నోబాల్స్ విసిరే బౌలర్లపై చర్యలు తీసుకోవాలని.. అదే సమయంలో బౌలింగ కోచ్‌ను కూడా బాధ్యుడిని చేయాలని అన్నారు. ‘‘ఇటీవల నో బాల్స్‌ను వేయడంపై చర్చ సాగుతోంది. ఇది అత్యంత కీలక విషయమని గుర్తించాలి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆటగాళ్లు కొన్నింటిని కంట్రోల్ చేయగలరు. బ్యాటర్ అయితే గార్డ్‌ను తీసుకోవడం.. అదే బౌలర్‌గా నో బాల్స్ వేయకుండా ఉండటం. ఇప్పుడున్న కాలంలో ప్రతి దానిని గణించడం జరుగుతుంది. అలాంటప్పుడు బౌలింగ్ క్రీజ్‌ను ఎందుకు దాటాలి. ఈ తప్పిదాలు క్షమించరానివి’’ అని గావస్కర్ వ్యాఖ్యానించారు. ‘‘భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడు. నో బాల్ వేసిన తర్వాత ఫ్రీ


న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జి ధరలు భారీగా పెరగడంతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్‌జిస్ ధరను కిలోకు రూ.3.89 పెంచింది. పశ్చిమాసియాలో మరోమారు నెలకొన్న సంక్షోభం, హోర్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా రవాణాకు అంతరాయాలు ఏర్పడటం వల్ల అంతర్జాతీయ ఎల్‌ఎన్‌జి ధరలు గణనీయంగా పెరిగాయని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన ఈ ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఢిల్లీలో సిఎన్‌జి ధర కిలోకు రూ.83.09 నుంచి రూ.86.98కు చేరింది. ఈ తాజా పెంపుతో ఈ ఏడాది ఢిల్లీలో సిఎన్‌జి ధర మొత్తం దాదాపు కిలోకు రూ.10 మేర పెరిగింది. మే రెండో వారంలో నాలుగు విడతల్లో మొత్తం రూ.6 పెంచడంతో ధర రూ.83.09కు చేరింది. తాజాగా మరో రూ.3.89 పెంచారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్‌లలో కూడా సిఎన్‌జి ధరలు పెరిగాయి. ప్రస్తుతం నోయిడా, ఘాజియాబాద్‌లో కిలో సిఎన్‌జి ధర రూ.95.59 కాగా, గురుగ్రామ్‌లో రూ.92.01గా ఉంది.

ఆమిదాలగొంది: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్నాయి. రహదారి పక్కనే ఆడుకుంటున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు దాటడంతో అతడిని తప్పించబోయి కర్ణాటక ఆర్టిసి బస్సు.. స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్ల కాళ్లు విరగ్గా.. 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: దివ్యాంగులకు బ్యాటరీ వీల్ ఛైర్లు, వాహనాలు అందించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి రూ.50 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిదులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు..అమలు చేశారా? అని ప్రశ్నించారు. పదేళ్లలో దివ్యాంగులకు ఏం చేశారో బిఆర్ఎస్ చెప్పాలి? అని పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇంకా మిగిలిన వారికి కూడా సంక్షేమం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. దివ్యాంగ దంపతులు ఒకేచోట పనిచేసేలా సవరణలు చేశామని, 34 జివో తీసుకొచ్చి దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చామని తెలియజేశారు. అర్హత ఉన్న దివ్యాంగులందరికీ కొత్తగా పింఛన్లు ఇచ్చామని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తున్నామని, పుట్టిన వెంటనే అంగవైకల్యం ఉంటే బాల్ భరోసా పథకం తీసుకొచ్చామని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.



అమరావతి: మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ పై మాటల దాడి ఇప్పటికీ ఆగలేదని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనేనని, పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరే అని కొనియాడారు. కావాలనే వ్యక్తిగతంగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారని, కొంతమంది వ్యక్తి హననం చేస్తుంటారని విమర్శించారు. వైసిపిని విమర్శించే విషయంలో పాత్రలు మాత్రమే మారుతున్నాయని, వారి వారి వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీ నుంచి వెళ్లారని తెలియజేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసిపిపై విమర్శలు చేస్తున్నారని, అటెన్షన్ కోసమే విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని, 40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడలేదని, జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి అనడం దారుణం అని, సొ

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సొంత కారణాలతోనే విజయసాయిరెడ్డి వైసిపి నుంచి బయటకు వెళ్లారని.. పార్టీ వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని సజ్జల అన్నారు.విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ.. 40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని సాయిరెడ్డి అనడం దారుణని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడలేదని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసిపిపై విమర్శలు చేస్తున్నారని.. పబ్లిసిటీ కోసం సిఎం చంద్రబాబు చేసే ప్రయత్నాలను జగన్‌కు ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనేనని, పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరేనని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

