🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

4063 వార్తలు

‘కామాఖ్య’లో తిరుపతిగా..
పాత
తెలంగాణ

‘కామాఖ్య’లో తిరుపతిగా..

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్‌ ‘కామాఖ్య’. మై ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్‌, యశ్వంత్‌ రాజ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.తాజాగా మేకర్స్‌ సముద్రఖని ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఆయనకు హదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ‘తిరుపతి’గా ఆయన పాత్రను పరిచయం చేశారు. ఆయన ప్రెజెన్స్‌ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా […] The post ‘కామాఖ్య’లో తిరుపతిగా.. appeared first on Navatelangana.

మీ ఎదుట నేను హాజరుకాలేను: కేజ్రీవాల్
పాత
తెలంగాణ

మీ ఎదుట నేను హాజరుకాలేను: కేజ్రీవాల్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆయన న్యాయమూర్తికి ఒక లేఖ రాస్తూ, కోర్టుపై తనకు విశ్వాసం పోయిందని తెలిపారు. తన అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందన్న ఆశలు ఆవిరయ్యాయని, అందుకే మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాని అందులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గానీ, కనీసం నా తరఫు న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకాబోనని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా తనకు ఉన్న హక్కుల ప్రకారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. గతంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ, కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఆమె బంధవులకు కేంద్ర ప్రభుత్వంలోని పలువురితో సత్సంబంధాలున్నాయని కేజ్రీవాల్ మొదటి నుంచి ఆరోపిస్తూ కేసు నుంచి ఆమె తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

క్వార్టర్ ఫైనల్లో భారత్
పాత
తెలంగాణ

క్వార్టర్ ఫైనల్లో భారత్

ప్రతిష్ఠాత్మకమైన థామస్, ఉబేర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన టీమ్ విభాగం రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 50 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ విభాగం పోటీల్లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఇక తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు 41 తేడాతో కెనడాను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌లో పటిష్టమైన చైనాతో భారత్ తలపడనుంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సింగిల్స్‌లో భారత స్టార్ ఆటగాడు లక్షసేన్ విజయం సాధించాడు. స్టీఫెన్ సామ్‌తో జరిగిన పోరులో సేన్ 2114, 2116తో జయకేతనం ఎగుర వేశాడు. మరో సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి 218, 216తో షెరే ధాండ్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన ఆయుశ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఇక పురుషుల తొలి డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జంట విజయం సాధించింది. రిజ్కిజాక్ జంటతో జరిగిన పోరులో సాత్విక్ జోడీ 2114, 2116తో జయభేరి మోగించింది. మూడో సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 2111, 2117 తేడాతో హోండా భూపతిను చిత్తు చేశాడు. ఇక చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌ఎం

కోల్‌ సిండికేట్‌ నేపథ్యంలో ‘ది బ్లాక్‌ గోల్డ్‌’
పాత
తెలంగాణ

కోల్‌ సిండికేట్‌ నేపథ్యంలో ‘ది బ్లాక్‌ గోల్డ్‌’

హీరోయిన్‌ సంయుక్త ప్రస్తుతం నటిస్తున్న హీరోయిన్‌-సెంట్రిక్‌ పాన్‌-ఇండియన్‌ యాక్షన్‌ డ్రామా ‘ది బ్లాక్‌ గోల్డ్‌’.యోగేష్‌ ఖవీజ దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్‌ సహకారంతో హాస్య వ¶వీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు.తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్‌ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్‌ ఆఫీసర్‌ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు. […] The post కోల్‌ సిండికేట్‌ నేపథ్యంలో ‘ది బ్లాక్‌ గోల్డ్‌’ appeared first on Navatelangana.

చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
పాత
తెలంగాణ

చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

ఒమన్ తీరానికి సమీపంలో మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు లక్షంగా చేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. షినాస్ పోర్టు సరిహద్దుకు సమీపంలో టోగో దేశ జెండా కలిగిన నౌక ఎమ్‌టి సిరోన్‌పై ఏప్రిల్ 25న ఈ దాడి జరిగిందని తెలిపింది.ఇరాన్ టార్గెట్ చేసిన నౌకలో భారత సిబ్బంది కూడా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్‌దీప్ సింగ్ రణ్‌ధావా తెలిపారు. ఇతర నౌకలతో పాటూ వెళుతున్న ఎమ్‌టి సిరోన్ నౌకను ఇరాన్ కోస్ట్ గార్డు దళాలు అడ్డగించి హెచ్చరికగా కాల్పులు జరిపాయని చెప్పారు. అయితే, నౌకలో భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని అన్నారు. విదేశాంగ శాఖతో పాటూ ఇతర వర్గాల సమన్వయంతో అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు.

దక్షిణ సూడాన్‎లో కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి
పాత
లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు
పాత
తెలంగాణ

లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సక్సేనా ఆమోదం తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ప్రకటించారు. ఇదొక చరిత్రాత్మకమైన రోజని, ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో లెహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఆమోదించిన ఐదు జిల్లాలతో వీటి సంఖ్య ఏడుకు చేరుకుంటుందని సక్సేనా తెలిపారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల పేర్లను నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జన్‌స్కర్, ద్రాస్‌గా ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, వృద్ధి, ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. పాలనను నేరుగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు.

బిర్యానీ విందు తర్వాత విషాదం
పాత
తెలంగాణ

బిర్యానీ విందు తర్వాత విషాదం

ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు 12 గంటల వ్యవధిలో వరుసగా మరణించడం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనకు ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 13 ఏళ్ల జైనబ్, ఆమె అక్క, తల్లిదండ్రులు శనివారం రాత్రి బిర్యానీ విందులో పాల్గొన్నారు. అర్ధరాత్రి తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఆదివారం తెల్లవారుజామున వారికి తీవ్ర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా మృతి చెందారు. బిర్యానీ విందు తర్వాత విషాదం అబ్దుల్లా అబ్దుల్ ఖాదర్ (40) అనే స్థానిక వ్యాపారి మొబైల్ యాక్సెసరీస్ దుకాణం నిర్వహించేవాడు. ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు జైనబ్ (13), ఆయేషా (16)తో కలిసి మరో ఐదుగురు బంధువులతో శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు విందులో పాల్గొన్నారు. ఆ విందులో బిర్యానీ వడ్డించారు. విందు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు పైధోనిలోని తమ ఇంటికి వెళ్లారు. అప్పటివరకు ఎవరికీ ఆరోగ్య సమస్యలు కనిపించలేదని సమాచారం. ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి వాంతులు, విరేచనాలు

ఢిల్లీని కమ్మేసిన భారీ దుమ్ము తుఫాన్..ఉక్కిరిబిక్కిరి అయిన జనం
పాత
టిజిఆర్‌జెసి సెట్ హాల్ టికెట్లు విడుదల
పాత
తెలంగాణ

టిజిఆర్‌జెసి సెట్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ (టిఆర్‌ఈఐఎస్) సోమవారం టిఎస్‌ఆర్‌జెసి సెట్- 2026 హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgrjc.cgg.gov.in నుండి తమ అడ్మిట్ కార్డులను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టిఆర్‌ఈఐఎస్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్ష మే 3 న ఆదివారం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రెండున్నర గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది. మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని సంస్థ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవని, అభ్యర్థులు ముందుగానే ప్రింటౌట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ లలో పరీక

పోలీసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: ఇకపై పుట్టిన రోజు, పెళ్లి రోజు సెలవు
పాత
IPL 2026: ఢిల్లీ కోటలో భువీ, హేజిల్‌వుడ్ విధ్వంసం.. పేకమేడలా కూలిన క్యాపిటల్స్ బ్యాటింగ్
పాత
డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్ గుండెపోటుతో మృతి..
పాత
బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ
పాత
గుట్టలు చీల్చి యధేఛ్చగా రాళ్ల దోపిడీ
పాత
తెలంగాణ

గుట్టలు చీల్చి యధేఛ్చగా రాళ్ల దోపిడీ

నవతెలంగాణ-నవాబు పేటగుట్టలు చీల్చి పెద్ద పెద్ద బండరాళ్లను పగులగొట్టి యధేఛ్చగా కొందరు రాళ్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ప్రధాన రహదారి పక్కనే ఉండటం గమనార్హం. సంబందించిన మండల స్థాయి అధికారులు వస్తూ పోయే ప్రధాన రహదారి పక్కనే ఉన్నా.. వారికి కనపడటం లేదా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సహాజసిద్దంగా ఏర్పడిన గుట్టలు తవ్వాలంటే సంబంధించిన మైనింగ్ రెవెన్యూ అధికారులతో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కాని ఇలా ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు […] The post గుట్టలు చీల్చి యధేఛ్చగా రాళ్ల దోపిడీ appeared first on Navatelangana.

ప్రాజెక్టు నిర్వాసితులు, రైల్వే లైన్ లో భూముల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి
పాత
తెలంగాణ

ప్రాజెక్టు నిర్వాసితులు, రైల్వే లైన్ లో భూముల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ నవతెలంగాణ – హైదరాబాద్: బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన, కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని, నడికుడి నుండి బీబీనగర్ వరకు రైల్వే రెండవ లైన్ లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను వెంటనే ప్రకటించి కాంగ్రెస్ కార్యకర్తలకు […] The post ప్రాజెక్టు నిర్వాసితులు, రైల్వే లైన్ లో భూముల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి appeared first on Navatelangana.

బిజెపిలో ఆప్ ఎంపిల విలీనం ఖరారు: రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్
పాత
తెలంగాణ

బిజెపిలో ఆప్ ఎంపిల విలీనం ఖరారు: రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్

కేజ్రీవాల్ నాయకత్వపు ఆప్ నిట్టనిలువునా చీలింది. ఈ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ రెబెల్ ఎంపిలు బిజెపిలో అధికారికంగా విలీనం అయ్యారు. వీరి విలీనాన్ని ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సోమవారం తెలిపారు. ప్రస్తుత పరిణామంతో కేజ్రీవాల్ పార్టీ బలం ఎగువ సభలో కేవలం మూడుకు చేరింది. ఇదే దశలో అధికార పక్షం బిజెపి సంఖ్యాబలం రాజ్యసభలో 113కు చేరుకుంది. ఇప్పుడు ఆప్ వీడి , బిజెపిలో చేరిన ఎంపిలలో రాఘవ ఛద్ధా, అశోక్ మిట్టల్, హర్బజన్ సింగ్ (క్రికెటర్), విక్రమ్‌జిత్ సాహ్నే, స్వాతీ మాలివాల్, రాజీందర్ గుప్తా ఉన్నారు. వీరంతా కూడా ఆప్‌లో సీనియర్ నేతలే. వీరి బిజెపి చేరిక తరువాత రాజ్యసభ సెక్రెటెరియట్ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఈ ఏడుగురిని బిజెపి సభ్యుల జాబితాలో చేర్చుతూ తాజా వివరణ ఇచ్చింది. ఈ ఏడుగురు ఎంపీలు కూడా పంజాబ్ నుంచి రాజ్యసభకు ఆప్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఇక ఢిల్లీ నుంచి ఉన్న ముగ్గురు ఆప్ ఎంపిలలో ఇద్దరు ఆప్‌లో ఉన్నారు. వీరు సంజయ్ సింగ్, ఎనడి గుప్తా, ఇక స్వాతీమాలీవాల్ బిజెపిలోకి వెళ్లారు. బిజెపిలోకి చేరిన ఏడుగుర

వేసవి విందుగా సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన'.. పల్లెటూరి ప్రేమలో తడిసిముద్దవ్వాల్సిందే!
పాత
కాలి బూడిదైన మొక్కజొన్న.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పాత
తెలంగాణ

కాలి బూడిదైన మొక్కజొన్న.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్నవతెలంగాణ – మిడ్జిల్ ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన 6 ఎకరాల మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని బూడిదైందని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. పంట నష్టపోయిన రైతులను చెందిన కుమ్మరి రాములు, నాగేష్, రవి రైతుల కాలిపోయిన మొక్కజొన్న పంటను రైతులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన […] The post కాలి బూడిదైన మొక్కజొన్న.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి appeared first on Navatelangana.

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
పాత
తెలంగాణ

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయమే 60 మంది అధికారులు 8 గ్రూపులుగా చేరుకుని కార్యాలయంలోని అన్ని విభాగాలను తనిఖీలు చేశారు. అయితే ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లలో అనినీతి ఆరోపణలపై ఈ నెల 7న ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. ఎసిబి అధికారుల సూచనతో ఈ తనిఖీలు జరిగిన్నట్లు తెలుస్తోంది. అయితే దుకాణాల అద్దెలు, ఇంటి పన్నుల్లో తేడాలపై కొలతలు తీస్తూ విచారణ జరిపారు.జగిత్యాల మున్సిపల్ శాఖ 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా, 2019 నుంచి 16 మంది కమీషనరన్లు బదిలీ కాగా అవినీతి ఆరోపణలపై 8 మంది జైలు కెళ్ళారు. గతంలోనూ రెండు సార్లు ఎసిబి, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు జరిగాయి. తాజాగా విజిలెన్స్ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది. అన్ని విభాగాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించామని, లెక్కలన్నీ తేలిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

గూగుల్ కంటే ముందుగానే...  ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసింది: సీఎం చంద్రబాబు
పాత
Delhi Capitals: ఆర్సీబీ బౌలర్ల దండయాత్ర.. 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
పాత
10 పరుగుల లోపే ఆరు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ
పాత
తెలంగాణ

10 పరుగుల లోపే ఆరు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా.. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్‌సిబి ఢిల్లీని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో కొత్త ఆటగాడు సాహిల్ పరాఖ్(0) పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌ వేసిన హేజిల్‌వుడ్.. తొలి రెండు బంతుల్లోనే రాహుల్, రిజ్వీలను డగౌట్ బాట పట్టించాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికి స్టబ్స్ (5), నాలుగో బంతికి అక్షర్ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో హేజిల్‌వుడ్ నితిష్ రాణాని(1) ఔట్ చేశాడు. దీంతో 9 పరుగులకే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం పవర్‌ప్లే(ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిల్లర్(4), పొరెల్(1) ఉన్నారు.

Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)