
4083 వార్తలు

ఒమన్ తీరానికి సమీపంలో మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు లక్షంగా చేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. షినాస్ పోర్టు సరిహద్దుకు సమీపంలో టోగో దేశ జెండా కలిగిన నౌక ఎమ్‌టి సిరోన్‌పై ఏప్రిల్ 25న ఈ దాడి జరిగిందని తెలిపింది.ఇరాన్ టార్గెట్ చేసిన నౌకలో భారత సిబ్బంది కూడా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్‌దీప్ సింగ్ రణ్‌ధావా తెలిపారు. ఇతర నౌకలతో పాటూ వెళుతున్న ఎమ్‌టి సిరోన్ నౌకను ఇరాన్ కోస్ట్ గార్డు దళాలు అడ్డగించి హెచ్చరికగా కాల్పులు జరిపాయని చెప్పారు. అయితే, నౌకలో భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని అన్నారు. విదేశాంగ శాఖతో పాటూ ఇతర వర్గాల సమన్వయంతో అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు.


కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సక్సేనా ఆమోదం తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ప్రకటించారు. ఇదొక చరిత్రాత్మకమైన రోజని, ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో లెహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఆమోదించిన ఐదు జిల్లాలతో వీటి సంఖ్య ఏడుకు చేరుకుంటుందని సక్సేనా తెలిపారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల పేర్లను నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్, జన్‌స్కర్, ద్రాస్‌గా ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, వృద్ధి, ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. పాలనను నేరుగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు 12 గంటల వ్యవధిలో వరుసగా మరణించడం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనకు ఫుడ్ పాయిజనింగ్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 13 ఏళ్ల జైనబ్, ఆమె అక్క, తల్లిదండ్రులు శనివారం రాత్రి బిర్యానీ విందులో పాల్గొన్నారు. అర్ధరాత్రి తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఆదివారం తెల్లవారుజామున వారికి తీవ్ర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా మృతి చెందారు. బిర్యానీ విందు తర్వాత విషాదం అబ్దుల్లా అబ్దుల్ ఖాదర్ (40) అనే స్థానిక వ్యాపారి మొబైల్ యాక్సెసరీస్ దుకాణం నిర్వహించేవాడు. ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు జైనబ్ (13), ఆయేషా (16)తో కలిసి మరో ఐదుగురు బంధువులతో శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు విందులో పాల్గొన్నారు. ఆ విందులో బిర్యానీ వడ్డించారు. విందు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు పైధోనిలోని తమ ఇంటికి వెళ్లారు. అప్పటివరకు ఎవరికీ ఆరోగ్య సమస్యలు కనిపించలేదని సమాచారం. ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి వాంతులు, విరేచనాలు


తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ (టిఆర్‌ఈఐఎస్) సోమవారం టిఎస్‌ఆర్‌జెసి సెట్- 2026 హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgrjc.cgg.gov.in నుండి తమ అడ్మిట్ కార్డులను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టిఆర్‌ఈఐఎస్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్ష మే 3 న ఆదివారం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రెండున్నర గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది. మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని సంస్థ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవని, అభ్యర్థులు ముందుగానే ప్రింటౌట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ లలో పరీక




నవతెలంగాణ-నవాబు పేటగుట్టలు చీల్చి పెద్ద పెద్ద బండరాళ్లను పగులగొట్టి యధేఛ్చగా కొందరు రాళ్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ప్రధాన రహదారి పక్కనే ఉండటం గమనార్హం. సంబందించిన మండల స్థాయి అధికారులు వస్తూ పోయే ప్రధాన రహదారి పక్కనే ఉన్నా.. వారికి కనపడటం లేదా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సహాజసిద్దంగా ఏర్పడిన గుట్టలు తవ్వాలంటే సంబంధించిన మైనింగ్ రెవెన్యూ అధికారులతో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కాని ఇలా ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు […] The post గుట్టలు చీల్చి యధేఛ్చగా రాళ్ల దోపిడీ appeared first on Navatelangana.
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ నవతెలంగాణ – హైదరాబాద్: బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన, కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని, నడికుడి నుండి బీబీనగర్ వరకు రైల్వే రెండవ లైన్ లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను వెంటనే ప్రకటించి కాంగ్రెస్ కార్యకర్తలకు […] The post ప్రాజెక్టు నిర్వాసితులు, రైల్వే లైన్ లో భూముల రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి appeared first on Navatelangana.

కేజ్రీవాల్ నాయకత్వపు ఆప్ నిట్టనిలువునా చీలింది. ఈ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ రెబెల్ ఎంపిలు బిజెపిలో అధికారికంగా విలీనం అయ్యారు. వీరి విలీనాన్ని ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సోమవారం తెలిపారు. ప్రస్తుత పరిణామంతో కేజ్రీవాల్ పార్టీ బలం ఎగువ సభలో కేవలం మూడుకు చేరింది. ఇదే దశలో అధికార పక్షం బిజెపి సంఖ్యాబలం రాజ్యసభలో 113కు చేరుకుంది. ఇప్పుడు ఆప్ వీడి , బిజెపిలో చేరిన ఎంపిలలో రాఘవ ఛద్ధా, అశోక్ మిట్టల్, హర్బజన్ సింగ్ (క్రికెటర్), విక్రమ్‌జిత్ సాహ్నే, స్వాతీ మాలివాల్, రాజీందర్ గుప్తా ఉన్నారు. వీరంతా కూడా ఆప్‌లో సీనియర్ నేతలే. వీరి బిజెపి చేరిక తరువాత రాజ్యసభ సెక్రెటెరియట్ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఈ ఏడుగురిని బిజెపి సభ్యుల జాబితాలో చేర్చుతూ తాజా వివరణ ఇచ్చింది. ఈ ఏడుగురు ఎంపీలు కూడా పంజాబ్ నుంచి రాజ్యసభకు ఆప్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఇక ఢిల్లీ నుంచి ఉన్న ముగ్గురు ఆప్ ఎంపిలలో ఇద్దరు ఆప్‌లో ఉన్నారు. వీరు సంజయ్ సింగ్, ఎనడి గుప్తా, ఇక స్వాతీమాలీవాల్ బిజెపిలోకి వెళ్లారు. బిజెపిలోకి చేరిన ఏడుగుర

జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్నవతెలంగాణ – మిడ్జిల్ ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన 6 ఎకరాల మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని బూడిదైందని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. పంట నష్టపోయిన రైతులను చెందిన కుమ్మరి రాములు, నాగేష్, రవి రైతుల కాలిపోయిన మొక్కజొన్న పంటను రైతులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన […] The post కాలి బూడిదైన మొక్కజొన్న.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి appeared first on Navatelangana.

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయమే 60 మంది అధికారులు 8 గ్రూపులుగా చేరుకుని కార్యాలయంలోని అన్ని విభాగాలను తనిఖీలు చేశారు. అయితే ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లలో అనినీతి ఆరోపణలపై ఈ నెల 7న ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. ఎసిబి అధికారుల సూచనతో ఈ తనిఖీలు జరిగిన్నట్లు తెలుస్తోంది. అయితే దుకాణాల అద్దెలు, ఇంటి పన్నుల్లో తేడాలపై కొలతలు తీస్తూ విచారణ జరిపారు.జగిత్యాల మున్సిపల్ శాఖ 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా, 2019 నుంచి 16 మంది కమీషనరన్లు బదిలీ కాగా అవినీతి ఆరోపణలపై 8 మంది జైలు కెళ్ళారు. గతంలోనూ రెండు సార్లు ఎసిబి, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు జరిగాయి. తాజాగా విజిలెన్స్ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది. అన్ని విభాగాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించామని, లెక్కలన్నీ తేలిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.



న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్‌సిబి ఢిల్లీని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో కొత్త ఆటగాడు సాహిల్ పరాఖ్(0) పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన హేజిల్‌వుడ్.. తొలి రెండు బంతుల్లోనే రాహుల్, రిజ్వీలను డగౌట్ బాట పట్టించాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికి స్టబ్స్ (5), నాలుగో బంతికి అక్షర్ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో హేజిల్‌వుడ్ నితిష్ రాణాని(1) ఔట్ చేశాడు. దీంతో 9 పరుగులకే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం పవర్‌ప్లే(ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిల్లర్(4), పొరెల్(1) ఉన్నారు.

వచ్చే సండత్సరం 2027కు పద్మ పురస్కారాలకు దరఖాస్తుల నామినేషన్ల ప్రక్రియ ఆరంభం అయింది. నామినేషన్, సిఫార్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది జులై 31వ తేదీలోగా పౌరులు తమ నామినేషన్‌ను పంపించుకోవచ్చు. కళా, సాంస్కృతిక సాహిత్య రంగాలు, సామాజిక శాస్త్ర సాంకేతిక , క్రీడా, విద్యా, వైద్య, ప్రజా వ్యవహారాలు , వ్యాపార వాణిజ్య రంగాలు, వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి ఎవరైనా తమ పేర్లను పద్మ పురస్కారాల కోసం నేరుగా పంపించుకోవచ్చు. అంతేకాకుండా విశిష్టుల పేర్లను ఇతరులు ప్రతిపాదించవచ్చు. ఈ ప్రతిపాదనలను కేవలం ఆన్‌లైన్‌లోనే రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in ) వేదికకు చేరవేయవచ్చునని అధికారిక ప్రకటనలో తెలిపారు. పద్మశ్రీ, అత్యున్నత పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, అవార్డుల ఎంపిక ప్రక్రియ 1954లో ఆరంభం అయింది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఈ పౌర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడుతుంది.

మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యువతి పట్ల ఓ వ్యక్తి వేధించిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్, నానక్‌రాంగూడ సైకిల్ ట్రాక్‌పై రన్నింగ్ చేసేందుకు యువతి వచ్చింది. రన్నింగ్ చేస్తూండగా ఓ యువకుడు బాధితురాలిని వెంబడించి అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అప్రమత్తమైన యువతి నిందితుడిని వీడియో తీయబోగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షిత మనుకున్నా... కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’ అంటూ యువతి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్‌కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. గుర్తుతెలియని వ్యక్తి యువతి పట్ల ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్ మహిళలకు సురక్షితంగా ఉండకూడదా? సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్‌కు రాలేదని తెలిపారు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే రన్నింగ్‌కు వస్తా అని రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారని ఆవేదన వ్య

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. వదంతులను పట్టుంచుకోవద్దని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టి ఇంధన నిల్వ చేయడం నేరమని హెచ్చరించారు.

ఎపిలోని పల్నాడులో విషాదం చోటు చేసుకుంది. జిల్లా యడ్లపాడు మండలం జగ్గపురంలో సోమవారం ఉదయం స్థానిక చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతులను అమనుల్లా (13), అబ్దుల్లా (16)గా గుర్తిం చారు. చెరువు గట్టుపై బాలుర చెప్పులు ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరు కున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. బాలురు ఈత కొట్టేందుకు చెరువులోకి దిగి లోతు ఎక్కు వగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకేసారి ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పో వడం తో ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరు మున్నీర య్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.