🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Todayతెలంగాణ

తెలంగాణ

3528 వార్తలు

ఆర్‌టిసిలో స్నేహపూర్వక పాలన ఉండాలి
పాత వార్త
తెలంగాణ

ఆర్‌టిసిలో స్నేహపూర్వక పాలన ఉండాలి

మే 17లోగా డిపోల్లో వసతులు మెరుగుపరచాలిఆర్‌టిసి ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి అధికారులు కిందిస్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా, ఆప్యాయతతో, స్నేహపూర్వక వాతావరణంలో వారి ద్వారా పనులు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. శనివారం ఆర్‌టిసి ఉన్నతాధికారులతో మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, ఈడీలు, ఆర్‌ఎంలు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డీఎంలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్‌టిసి కార్మిక సంఘాల నేతల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్ స్థాయి అధికారులు సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని సూచించారు. ‘ఇంటర్నల్ ఎటాక్‘ సంస్థకు ప్రమాదకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను

Admin4 రోజుల క్రితం👁 6
ఆరేపల్లిలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం
పాత
వరంగల్ రైతు సదస్సుకు తరలి రావాలి
పాత
Trisha: పిలవని పేరంటానికి నేనెందుకు? ‘కరుప్పు’ మేకర్స్‌పై త్రిష షాకింగ్ కామెంట్స్!.
పాత
కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగుల తరలింపు సబబే
పాత
తెలంగాణ

కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగుల తరలింపు సబబే

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల కౌంటింగ్ సిబ్బందిగా కేంద్ర ఉద్యోగుల తరలింపు విషయంలో ఆదేశాలకు సుప్రీంకోర్టు శనివారం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఇటీవలి సర్కులర్‌ను సమర్ధించింది. కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగాల తరలింపును సవాలు చేస్తూ బెంగాల్‌లోని అధికార పక్షం టిఎంసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 4వ తేదీనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కేంద్ర ఉద్యోగులను విధులలో ఉంచడం వల్ల అధికార బిజెపికి మేలు జరిగే అవకాశం ఉందని, వెంటనే వారిని అక్కడి నుంచి తప్పించాలని టిఎంసి కోరింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయం పూర్తిగా ఎన్నికల సంఘం విధులు , బాద్యతల పరిధిలోకి వస్తుందని , ఇది చట్టం నిబంధనలకు విరుద్ధం ఏమీ కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల విధులతో పాటు కౌంటింగ్ ప్రక్రియ దశలో కూడాకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలతో కూడిన బృందాలు ఉంటాయని ఎన్నికల సంఘం ఈ నెల 13న సర్కులర్ వెలువరించింది. ఇది పూర్తిగా చట్టబద్ధం అని సుప్రీంకోర్టు సమర్థించింది.

మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్
పాత
తెలంగాణ

మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్

మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందడం ని అభినందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నవతెలంగాణ-మిరుదొడ్డి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డిపిఎం ప్రకాష్ అన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన హోమ్ ఫుడ్స్ ద్వారా మిరుదొడ్డి మండలం లోని కాసులాబాద్ తో పటు పలు గ్రామాల్లో నీ మహిళా సంఘాలు కుండా ప్రేగు, బాదుషా,తో పాటు అనేక రకాల పదార్థాలు మహిళలు తయారు […] The post మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్ appeared first on Navatelangana.

చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి
పాత
తెలంగాణ

చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ చేనేత మరమగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘంలో సభ్యత్వాలు ఇప్పించాలని యాదాద్రిభువనగిరి జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎ.శ్రీనివాసరావుకు చౌటుప్పల్ చేనేత కార్మికులు శనివారం వినతిపత్రం సమర్పించారు. గతంలో జియో ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన కార్మికుల జాబితాను పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే సభ్యత్వ నమోదు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షుడు కర్నాటి జనార్ధన్, ఉపాధ్యక్షుడు కందగట్ల కిషన్, కార్యదర్శి సుంకి […] The post చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి appeared first on Navatelangana.

ఇరాన్ పని అయిపోయింది.. ఇక క్యూబా మిగిలింది: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
పాత
చెరువులో పడి మహిళ అనుమానాస్పద మృతి
పాత
సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’
పాత
తెలంగాణ

సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’

నవతెలంగాణ – పరకాల ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్ స్థాయిలోనూ పకడ్బందీగా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి ఆదేశాల మేరకు, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వికేంద్రీకరణలో భాగంగా డివిజన్ స్థాయిలోనే ఆర్డీవో ఆధ్వర్యంలో వినతులను స్వీకరిస్తారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, 30 రోజుల్లోపు పరిష్కరించాలని, బాధితులకు తమ […] The post సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’ appeared first on Navatelangana.

బిజెపి ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మా పార్టీనే: మమతా
పాత
తెలంగాణ

బిజెపి ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మా పార్టీనే: మమతా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 200లకు పైగా సీట్లు గెలిచి, రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సిఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసినా.. తమ పార్టీనే గెలుస్తుందని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికి తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ను సృష్టించారని ఆరోపించారు. 2021, 2024లోనూ బిజెపి ఇదే విధంగా చేసిందని.. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారని అన్నారు. వర్చువల్‌గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారాలు, పోలింగ్ సమయంలో పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో బెంగాల్‌లో మోహరించిన కేంద్ర బలగాలు టిఎంసి కార్యకర్తలతో క్రూరంగా ప్రవర్తించారని.. ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. మే 4న జరిగే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఆ రోజున అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు, పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లెక్కింపు కేంద్రాల్లో 24 గంటలు నిఘా పెట్టాలన్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న అనిల్ రెడ్డి
పాత
తెలంగాణ

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న అనిల్ రెడ్డి

– మాజీ ఉపసర్పంచ్ యాదయ్యనవతెలంగాణ – ఊరుకొండ అనారోగ్యంతో బాధపడుతూ అర్ధాంతరంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని మాజీ ఉపసర్పంచ్ యాదయ్య, కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన కంఠం నర్సమ్మ(55) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి […] The post ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న అనిల్ రెడ్డి appeared first on Navatelangana.

కడ”చూపు”..కన్నీటి “వీడ్కోలు”
పాత
తెలంగాణ

కడ”చూపు”..కన్నీటి “వీడ్కోలు”

కన్నీటి సంద్రమైన సిరిసిల్లసిరిసిల్లకు ఓఆర్ఆర్ యాక్సిడెంట్ మృత దేహాలువరుసగా ఆరు మృతదేహాల అంతిమయాత్రఒకే చితిలో ముగ్గురి దహనసంస్కారాలునవతెలంగాణ-రాజన్న సిరిసిల్లభగవంతుడా ?.. ఆ కుటుంబానికి ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా ??… ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులతో పాటు మరో ముగ్గురిని ఆ కుటుంబానికి దూరం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందయ్యా ???… ఐదు వైకుంఠరథాలపై ఆరుగురి మృతదేహాలు సిరిసిల్ల విద్యానగర్ వైకుంఠధామం వైపు అంతమయాత్రగా ఉద్విగ్న భరిత వాతావరణంలో సాగుతుంటే పట్టణ ప్రజల గుండె లోతుల్లోంచి… మౌనంగా  […] The post కడ”చూపు”..కన్నీటి “వీడ్కోలు” appeared first on Navatelangana.

ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మక్కపంట దగ్ధం
పాత
తెలంగాణ

ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మక్కపంట దగ్ధం

నవతెలంగాణ – బల్మూరు మండలంలోని నల్లచెరువు సమీపాన వ్యవసాయ పొలంలో శనివారం మక్కపంటకు నిప్పు అంటుకొని దగ్ధమైన సంఘటన చోటు చేసుకున్నది. సంబంధిత రైతుల వివరాల ప్రకారం బల్మూరుకు చెందిన బక్కయ్య, అనంతవరం గ్రామానికి చెందిన వెంకటస్వామి ఇద్దరూ కలిసి రెండెకరాల్లో సాగు చేసుకుంటున్నారు. మక్క పంట పూర్తి అయ్యి ఏరుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎకరన్నర భూమిలో మక్కపంట తీశామని, మిగతా అర్ధ ఎకరంలో 10 గుంటల వరకు పూర్తిగా మక్కపంట అగ్ని ప్రమాదంలో […] The post ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మక్కపంట దగ్ధం  appeared first on Navatelangana.

కేంద్ర మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని వినతి
పాత
తెలంగాణ

కేంద్ర మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని వినతి

మునీగల వీడు గ్రామ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు నవతెలంగాణ-నెల్లికుదురుకేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి మా గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు మునిగిలవీడు గ్రామ పంచాయతీ ఆరవ వార్డు సభ్యుడు నల్లని పాపారావు వినతిపత్రం అందించి తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని మా మునిగేలా […] The post కేంద్ర మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని వినతి  appeared first on Navatelangana.

సామాన్యుల నడ్డి విరచడమే బిజెపి సర్కార్ మ్యానిపిస్టో
పాత
ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం..కీలక నిర్ణయం
పాత
తెలంగాణ

ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం..కీలక నిర్ణయం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా వైద్య […] The post ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం..కీలక నిర్ణయం appeared first on Navatelangana.

వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నోముల
పాత
పరకాలలో నడిరోడ్డుపై నిలిచిపోయిన లారీ
పాత
తెలంగాణ

పరకాలలో నడిరోడ్డుపై నిలిచిపోయిన లారీ

పొంచి ఉన్న ప్రమాదంనవతెలంగాణ – పరకాలపట్టణంలోని ప్రధాన రహదారిపై గత 13 రోజులుగా ఒక లారీ గేర్ బాక్స్ సమస్య కారణంగా నిలిచిపోయింది. నిత్యం వాహనాలతో ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో, రోడ్డుకు మధ్యలోనే లారీ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ భారీ వాహనం సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆగి […] The post పరకాలలో నడిరోడ్డుపై నిలిచిపోయిన లారీ appeared first on Navatelangana.

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. లేదంటే సెక్రటేరియట్ ముట్టడిస్తం: హరీష్ రావు
పాత
ఆర్‌బిఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌..
పాత
తెలంగాణ

ఆర్‌బిఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌..

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌ నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయనను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రోహిత్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో.. మే 3న బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. రోహిత్ జైన్ ప్రస్తుతం ఆర్‌బిఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన దాదాపు మూడు దశాబ్దాలుగా కేంద్ర బ్యాంకులో వివిధ హోదాలలో పనిచేశారు.కాగా, ఇటీవల పొడిగించిన పదవీకాలం ముగిసిన టి.రబీ శంకర్ స్థానంలో జైన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రబీ శంకర్ మొదట 2021లో నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగియడంతో.. 2024, 2025లో కేంద్రం రెండుసార్లు పొడిగించింది.

కాంగ్రెస్ లో పనిచేసి మనోవేదనకు గురవుతున్నా.?
పాత
తెలంగాణ

కాంగ్రెస్ లో పనిచేసి మనోవేదనకు గురవుతున్నా.?

మామూలు నాయకులను పట్టించుకోరా? నాన్న చావు కంటే..కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే బాధిస్తోంది!సాయం అందించాలని గ్రామ శాఖ అధ్యక్షుడు వేడుకోలు!నవతెలంగాణ-అక్కన్నపేట ఓట్లప్పుడు మాత్రమే కార్యకర్తలు గుర్తుకొస్తారా, పనిచేసిన వారికి గుర్తింపు ఉండదా అంటూ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. ఒక గ్రామానికి అధ్యక్షున్ని అయి ఉండి, పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ నాకు, కష్టం వస్తే కన్నెత్తి చూసిన నాయకులు లేరు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకుంటే ఇంకెప్పుడు […] The post కాంగ్రెస్ లో పనిచేసి మనోవేదనకు గురవుతున్నా.? appeared first on Navatelangana.

విద్యా, వైద్యాభివృద్దిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యం: ఎమ్మెల్యే
పాత
తెలంగాణ

విద్యా, వైద్యాభివృద్దిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యం: ఎమ్మెల్యే

నవతెలంగాణ-తుంగతుర్తివిద్యా,వైద్యాభివృద్ధిలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు.శనివారం మండల కేంద్రంలోని డిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన,ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశాన్ని రాష్ట్ర గీతం ఆలపించి,సీఎం సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.ఉచిత బస్సు ప్రయాణం,గృహజ్యోతి,రైతు భరోసా,రైతు భీమా,సన్నబియ్యం,ఇందిరమ్మ ఇండ్లు,500కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి […] The post విద్యా, వైద్యాభివృద్దిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యం: ఎమ్మెల్యే appeared first on Navatelangana.

ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు: రేవంత్
పాత
తెలంగాణ

ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు: రేవంత్

హైదరాబాద్: తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సిఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఉద్యోగ సంఘాలకు సిఎం స్పష్టత ఇచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపుల కోసం రూ.6వేల కోట్లు ఇస్తామని చెప్పారు. పిఆర్సిపై తక్షణమే రిపోర్టు ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని.. ఆ రిపోర్టు ఆధారంగా పిఆర్సిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. రెండు నెలలకోసారి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు సంఘాలు నివేదిక ఇవ్వాలని సూచించారు.

Advertisement