🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3518 వార్తలు

‘నాలుగో స్తంభం’ నలుగుతోందా?
పాత వార్త
తెలంగాణ

‘నాలుగో స్తంభం’ నలుగుతోందా?

ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన మీడియా, నేడు స్వయంకృత పరిమితులు, బాహ్య ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. సమాచార విస్ఫోటం జరిగిన ఈ యుగంలో వాస్తవం కంటే వేగం ముఖ్యమైపోవడం ఒక కొత్త సంక్షోభానికి దారి తీసింది. ఒకప్పుడు వార్త సామాన్యుడి స్వరం అయితే, నేడు అది ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, డిజిటల్ వేదికల మధ్య పోటీ ప్రయోజనాల వలయంలో చిక్కుకుపోయిందనే అభిప్రాయం బలపడుతోంది. పత్రికా స్వేచ్ఛ కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే […] The post ‘నాలుగో స్తంభం’ నలుగుతోందా? appeared first on Navatelangana.

Admin4 రోజుల క్రితం👁 3
ప్రాణం ఖరీదు
పాత
రుజువు ‌కోసం…
పాత
ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు
పాత
తెలంగాణ

ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు

అయిదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌తో రాజకీయ చర్చ కొత్త మలుపులు తిరుగుతున్నది.ఇవేవో నిజమైన ఫలితాలే అయినట్టు హడావుడి ఒకవైపు, వాటిని ముందే మరో విధంగా చూపించాలనే వ్యూహాలు మరోవైపు.. రాజకీయ దృశ్యం తికమకగా మారింది.సినిమా కేంద్రమైన తమిళనాడు,నాటకీయ రాజకీయనేత పాలిస్తున్న పశ్చిమబెంగాల్‌ మరింత సందడిగా వున్నాయి. మరి రెండు రోజుల్లో నిజమైన ఫలితాలు వస్తాయని తెలిసినా ఈ లోగానే చేయగలిగినంత చేసేయాలన్నది వీటి పాచికగా గోచరిస్తుంది.పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఈ సారి ఓడిపోయి బీజేపీ వచ్చేస్తుందని చెప్పిన […] The post ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు appeared first on Navatelangana.

వారే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు: సిఎం రేవంత్
పాత
తెలంగాణ

వారే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు: సిఎం రేవంత్

విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలిప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలి శాసనసభ, శాసనమండలి విప్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి విప్‌లతో శనివారం సాయంత్రం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలను విప్‌లు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో త్రాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను ముఖ్యమంత్రికి వారు తెలియచేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిఎం దిశానిర్దేశం చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సిఎం సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థా

ఇరాన్ కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తాం.. అమెరికా వార్నింగ్
పాత
తెలంగాణ

ఇరాన్ కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తాం.. అమెరికా వార్నింగ్

దుబాయ్ : హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రవాణా నిర్వహణ కంపెనీలకు అమెరికా హెచ్చరికలు వెలువరించింది. సురక్షిత ప్రయాణానికి ఈ కంపెనీలు ఇరాన్‌కు నిర్ణీత పన్ను చెల్లించినట్లు అయితే అటువంటి కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు కంపెనీలకు అలర్ట్‌ను అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. హర్మూజ్ మీదుగా నౌకా రవాణా సాగించాలనుకుంటే తమకు నిర్ణీత పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఇటీవలే ఇరాన్ తమ టోల్ ఖరారు చేసింది. దీనిని అమెరికా తీవ్రంగా పరిగణించింది. హర్మూజ్‌పై నియంత్రణ విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన పర్వం కొనసాగుతున్న దశలోనే అమెరికా హెచ్చరికలు, అంతర్జాతీయ స్థాయి షిప్పింగ్ కంపెనీలపై ఆంక్షల ప్రకటనలతో పరిస్థితి మరింత బిగుసుకుంది. టోల్ చెల్లిస్తే తాము ఊరుకునేది లేదు. ఆంక్షలు వలయంలో పడాల్సి వస్తుందని అమెరికా స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో విషాదం.. కాలేజ్ నుంచి రాగానే డీజిల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పాత
ఎంపి పాఠక్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు..
పాత
తెలంగాణ

ఎంపి పాఠక్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు..

చండీగఢ్ /న్యూఢిల్లీ : పంజాబ్‌లో రాజ్యసభ ఎంపి సందీప్ పాఠక్‌పై స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇటీవలే ఆప్ నుంచి బిజెపిలోకి పార్టీ ఫిరాయించిన ఈ ఎంపిపై రెండు ఎఫ్‌ఐఆర్‌ల దాఖలు కావడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. పోలీసులు ఈ ఎంపిపై బెయిల్‌కు వీల్లేని నిబంధనల మేరకు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అయితే ఆయనపై ఎందుకు వీటిని దాఖలు చేశారనేది పోలీసులు వెల్లడించలేదు.శనివారం ఉదయం ఈ ఎంపి నివాసంపై దాడులు జరుగుతాయని తెలిసిన దశలోనే ఈ ఎంపి వెనుక గేటు నుంచి కారులో బయటకు వెళ్లారు. తరువాత ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయి ఉంది. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఆయన రహస్య ప్రదేశంలో తలదాచుకున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఇటీవలే ఆప్ ఎంపిలు ఏడుగురు పార్టీ వీడి బిజెపిలో చేరారు. వీరి పార్టీ విలీనం అధికారికంగా రాజ్యసభ సచివాలయం ధృవీకరించింది. ఇప్పుడు బిజెపి ఎంపిలుగా చలామణిలోకి వచ్చే ఈ ఎంపిలలో పాఠక్ కూడా ఉన్నారు. పాఠక్‌పై ఎఫ్‌ఐఆర్‌ల దాఖలును బిజెపి ఖండించింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రాబల్యం తగ్గుతూ ఉండటంతో ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బిజెపి మండిపడింది. పంజాబ్ పోలీసును ఆప్

హార్ముజ్ ను దాటిన ..మరో ఎల్పీజీ భారత నౌక సర్వశక్తి
పాత
ప్రైవేట్ సెక్టార్‌లో ప్రజాసేవ గొప్ప విషయం..సత్తయ్య సేవలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి వివేక్
పాత
బజాజ్ పల్సర్ NS400Z ధర తగ్గింది! ఎంతంటే..?
పాత
తెలంగాణ

బజాజ్ పల్సర్ NS400Z ధర తగ్గింది! ఎంతంటే..?

కొత్త బైక్ కొనాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్! ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో తన పాపులర్ పల్సర్ సిరీస్ లో బజాజ్ పల్సర్ NS400Z ను ఇప్పుడు మునుపటి కంటే చౌకగా అందిస్తోంది. 18% GST వల్ల బైక్ ధర మరింత తగ్గింది. ఇపుడు దీని కొత్త ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధర తగ్గింపు వల్ల వినియోగదారులు రూ.24,500 వరకు ఆదా చేసుకోవచ్చు. దేశంలోనే అత్యంత చౌకైన 40-హార్స్‌పవర్ బైక్‌గా నిలిచింది. ఈ తగ్గింపు కేవలం బైక్ ధరపై మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్‌పై కూడా ఉంటుంది. అంటే, ఈ శక్తివంతమైన బైక్‌ను కొనుగోలు చేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత సులభం అయింది. బజాజ్ పల్సర్ NS400Z ఇంజన్ ఈ బైక్‌లో 349cc ఇంజన్‌ను అమర్చారు. ఇది 40.6 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, ఈ బైక్ వేగంతో పాటు మంచి పనితీరును కనబరుస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని ద్వారా ఇంజన్ వేడెక్కకుండా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలలో కూడా బైక్ సజావుగా నడపవచ్చు. బజాజ్ పల్సర్ NS400Z ఫీచర్లు ఫీచర్ల పరంగా, ఇది దాని సెగ్మెంట్‌లో అత్యంత ఫీచర్-రిచ్ బైక్‌గా పరిగణించవచ్చు. ఇది నాలుగు రైడ్ మోడ్‌లను అందిస్తు

IPL 2026: చెపాక్‎లో చెలరేగిన చెన్నై బౌలర్స్.. మోస్తారు స్కోర్‎కే పరిమితమైన ముంబై
పాత
ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘన సన్మానం
పాత
తెలంగాణ

ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘన సన్మానం

నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ పట్టణంలోని భవ్య చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం మహాన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో కలిసి రథోత్సవాన్ని వీక్షించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘనంగా సన్మానించి, లక్ష్మి నారాయణ ఫోటోలు బహుకరించారు. The post ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘన సన్మానం appeared first on Navatelangana.

పేద బిడ్డలను ప్రోత్సహిస్తే.. క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తారు : ప్రొఫెసర్ కంచ ఐలయ్య
పాత
ఆర్‌టిసిలో స్నేహపూర్వక పాలన ఉండాలి
పాత
తెలంగాణ

ఆర్‌టిసిలో స్నేహపూర్వక పాలన ఉండాలి

మే 17లోగా డిపోల్లో వసతులు మెరుగుపరచాలిఆర్‌టిసి ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి అధికారులు కిందిస్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా, ఆప్యాయతతో, స్నేహపూర్వక వాతావరణంలో వారి ద్వారా పనులు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. శనివారం ఆర్‌టిసి ఉన్నతాధికారులతో మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, ఈడీలు, ఆర్‌ఎంలు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డీఎంలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్‌టిసి కార్మిక సంఘాల నేతల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్ స్థాయి అధికారులు సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని సూచించారు. ‘ఇంటర్నల్ ఎటాక్‘ సంస్థకు ప్రమాదకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను

ఆరేపల్లిలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం
పాత
వరంగల్ రైతు సదస్సుకు తరలి రావాలి
పాత
Trisha: పిలవని పేరంటానికి నేనెందుకు? ‘కరుప్పు’ మేకర్స్‌పై త్రిష షాకింగ్ కామెంట్స్!.
పాత
కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగుల తరలింపు సబబే
పాత
తెలంగాణ

కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగుల తరలింపు సబబే

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల కౌంటింగ్ సిబ్బందిగా కేంద్ర ఉద్యోగుల తరలింపు విషయంలో ఆదేశాలకు సుప్రీంకోర్టు శనివారం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఇటీవలి సర్కులర్‌ను సమర్ధించింది. కౌంటింగ్‌కు కేంద్ర ఉద్యోగాల తరలింపును సవాలు చేస్తూ బెంగాల్‌లోని అధికార పక్షం టిఎంసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 4వ తేదీనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కేంద్ర ఉద్యోగులను విధులలో ఉంచడం వల్ల అధికార బిజెపికి మేలు జరిగే అవకాశం ఉందని, వెంటనే వారిని అక్కడి నుంచి తప్పించాలని టిఎంసి కోరింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయం పూర్తిగా ఎన్నికల సంఘం విధులు , బాద్యతల పరిధిలోకి వస్తుందని , ఇది చట్టం నిబంధనలకు విరుద్ధం ఏమీ కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల విధులతో పాటు కౌంటింగ్ ప్రక్రియ దశలో కూడాకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలతో కూడిన బృందాలు ఉంటాయని ఎన్నికల సంఘం ఈ నెల 13న సర్కులర్ వెలువరించింది. ఇది పూర్తిగా చట్టబద్ధం అని సుప్రీంకోర్టు సమర్థించింది.

మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్
పాత
తెలంగాణ

మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్

మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందడం ని అభినందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నవతెలంగాణ-మిరుదొడ్డి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డిపిఎం ప్రకాష్ అన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన హోమ్ ఫుడ్స్ ద్వారా మిరుదొడ్డి మండలం లోని కాసులాబాద్ తో పటు పలు గ్రామాల్లో నీ మహిళా సంఘాలు కుండా ప్రేగు, బాదుషా,తో పాటు అనేక రకాల పదార్థాలు మహిళలు తయారు […] The post మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి: డిపిఎం ప్రకాష్ appeared first on Navatelangana.

చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి
పాత
తెలంగాణ

చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ చేనేత మరమగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘంలో సభ్యత్వాలు ఇప్పించాలని యాదాద్రిభువనగిరి జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎ.శ్రీనివాసరావుకు చౌటుప్పల్ చేనేత కార్మికులు శనివారం వినతిపత్రం సమర్పించారు. గతంలో జియో ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన కార్మికుల జాబితాను పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే సభ్యత్వ నమోదు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షుడు కర్నాటి జనార్ధన్, ఉపాధ్యక్షుడు కందగట్ల కిషన్, కార్యదర్శి సుంకి […] The post చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి appeared first on Navatelangana.

ఇరాన్ పని అయిపోయింది.. ఇక క్యూబా మిగిలింది: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
పాత
చెరువులో పడి మహిళ అనుమానాస్పద మృతి
పాత
సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’
పాత
తెలంగాణ

సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’

నవతెలంగాణ – పరకాల ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్ స్థాయిలోనూ పకడ్బందీగా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి ఆదేశాల మేరకు, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వికేంద్రీకరణలో భాగంగా డివిజన్ స్థాయిలోనే ఆర్డీవో ఆధ్వర్యంలో వినతులను స్వీకరిస్తారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, 30 రోజుల్లోపు పరిష్కరించాలని, బాధితులకు తమ […] The post సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’ appeared first on Navatelangana.

Advertisement