24437 వార్తలు


అమరావతి: కృష్ణమ్మ రాకతో ఫ్లోరైడ్ చరిత్రగా మిగిలిపోతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, గోదావరి జలాలను విశాఖకు తీసుకెళ్తామని అన్నారు. మార్కాపురం అన్ స్టాపబుల్ అని.. వెలిగొండ నిర్వాసితులకు పాదాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా వెలిగొండ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండలు అడ్డొచ్చాయని.. తొలగించి ముందుకెళ్లామని, సమస్యలు వచ్చాయని అధిగమించామని అన్నారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం 2024లో వీడిందని, చంద్రబాబు పేర్కొన్నారు.ఎలనినో వల్ల ఏ రిజర్వాయర్లు నిండలేదని, అరకొర చెల్లింపులు చేసి నిర్వాసితులను మోసం చేశారని విమర్శించారు. అయినా తాగునీటి కోసం 10టిఎంసిల నీళ్లు తీసుకొస్తున్నామని, పోలవరం జీవనాడి, 2027 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పనులు పూర్తవ్వకపోతే ముందే జాతికి అంకితం చేశారని, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రాజెక్టు పూర్తి చేశామని డ్రామా ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. 2019లో మనం అధికారంలో వచ్చి ఉంటే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేదని, నల్లమల సాగర్ నుంచి ప్ర

జోగులాంబ వద్ద ఆర్వోబీకి రూ.45 కోట్లుతెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిగద్వాల: తెలంగాణలో రైల్వే మార్గాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందనికేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కొత్త రైల్వే మార్గాలతో రైలు ప్రయాణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోగులాంబ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధికి గుర్తించగా, ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్’ రక్షణ వ్యవస్థను తెలంగాణలో వినియోగిస్తున్నామని, భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లు రానుండగా, అందులో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకు సుమారు రూ.5 లక్షల కోట్ల నిధులు

మనతెలంగాణ / గండిపేట్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పార్క్ చేసి ఉంచిన ఐదు బైక్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు విస్తరించడంతో సుమారు ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకుని పలువురు సురక్షితంగా బయటకు వచ్చారు.అయితే.. ఎవరో కావాలనే బైక్‌లకు నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి..? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మూడున్నర సమయంలో వెళ్లినట్లు కనబడుతున్నాయి.

బెంగళూరు: రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం ప్రాంతానికి చెందిన్ ఇర్ఫానా(48) మరో రుకియా(13), రాకియా(08) అనే బాలికలతో కలిసి దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. దొడ్డబళ్లపురలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూఢిల్లీ : విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) ఆగస్టు నెలలో భారతీయ ఈక్విటీలలో రూ. 30,919 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎఫ్‌పిఐలు వరుసగా రెండో నెల కూడా కొనుగోలుదారులు గా నిలిచారు. జూలైలోని రూ. 20,200 కోట్ల పెట్టుబడుల తర్వాత ఈ సానుకూల మార్పు వచ్చింది. అయితే 2026లో ఇప్పటివరకు వారు రూ. 2.23 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కంపెనీల లాభాలు మెరుగుపడటం, రూపాయి స్థిరత్వం, ఎఐ ట్రేడ్ రివర్సల్ పెట్టుబడులు తిరిగి రావడానికి ముఖ్య కారణాలని జియోజిత్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ కుమార్ పేర్కొన్నారు.








చాలాకాలం గ్యాప్ తర్వాత మాస్ మహరాజ రవితేజ ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. భక్తి, కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ని మంత్రముగ్దుల్ని చేసింది. సినిమా రిలీజై పది రోజులు దాటినా సరే చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా.. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించింది. కాగా, జివి ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సినిమాని వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. సినిమాలో ప్రతీ పాట ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ మూవీలోని అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’ పూర్తి వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. అయ్యప్ప దీక్ష తీసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప భక్తుల నృత్యంతో పాటు రవితేజ-పాప కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇకపోతే ‘ఇరుముడి’ ఇప్పటికే రూ.150+ కోట్లు వసూళు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉంది.

మన తెలంగాణ/ బోడుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి దశాబ్ద కాలమవుతున్నా సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు.అసంపూర్తి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు.సాగునీటి ప్రాజెక్టుల సాధనకై సీపీఎం చేపట్టిన పాదయాత్ర రెండో రోజు ఘట్కేసర్, మేడిపల్లి మీదుగా బోడుప్పల్ (పీర్జాదిగూడ) చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జహంగీర్ మాట్లాడుతూ...బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలతో పాటు బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం, రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.నవాబుపేట, అశ్వరాయిపల్లి, ఆసిఫ్‌నగర్, బృందావనం కాల్వలను పునరుద్ధరించి చివరి ఆయకట్టు వరకు నీరందించాలి.మూసి నదికి గోదావరి జలాలను అనుసంధానించడమే శాశ్వత పరిష్కారం.షామీర్‌పేట్ చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి భువనగిరి ప్రాంతానికి గోదావరి నీటిని మళ్లించాలి.ఈ పాదయాత్రకు సీపీఎం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్, మేడిపల్ల






హైదరాబాద్: సీడ్ గణేశుడితో అటు పుణ్యకార్యం.. ఇటు ప్రకృతికి మేలని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సీడ్ గణేశుడిని పూజించండి..పచ్చదనాన్ని పెంచండని సూచించారు. హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేషా ప్రతిమలను చిరంజీవి ఆవిష్కరించారు. విగ్రహంలో వేప, చింత లాంటి దేశీయ విత్తనాలు ఉండేలా చూడాలని చిరంజీవి కోరారు. పివొపి విగ్రహాలతో జలకాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, మట్టి వినాయకులను పూచించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. వినాయక చవితికి పర్యావరణ పరిరక్షణకు అందరూ సీడ్ గణేశాను పూచించాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

కొద్ది రోజుల క్రితం షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్ రష్మిక.. తిరిగి గాయం నుంచి కోలుకున్నారు. తిరిగి ఆమె సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. ‘తిరిగి షూట్‌కు వెళ్తున్నా.. కానీ, ఈ క్షణాలను మాత్రం కచ్చితంగా మిస్ అవుతాను’ అని వరలక్ష్మి వ్రతం చేస్తోన్న ఫొటోలతో పాటు.. ఇతర ఫొటోలను పంచుకున్నారు. ఎట్టకేలకు రష్మిక తిరిగి సెట్స్‌లోకి వెళ్లడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా తుంటి భాగంలో బలమైన గాయమైంది. దీంతో ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రష్మిక ఇంట్లోనే ఉంటూ తరచూ తన హెల్త్ అప్‌డేట్‌లతో పాటు, తాను చేస్తున్న పనులను అభిమానులతో పంచుకుంటూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
