
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిని తన కొడుకు తో కలిసి అతని గొంతు కోసి చంపారు. 10 సంవత్సరాలనుండి ఒక వ్యక్తి తో ఓ మహిళా సహజీవనం చేస్తుంది. అనుమానం రాకుండా మృతదేహాన్ని కవర్లో చుట్టి అర్ధరాత్రి శవాన్ని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చింతల్ లోని అంబేద్కర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.













