10002 వార్తలు


హైదరాబాద్: పాతబస్తీ మదీనా చౌరస్తాలో అగ్నిపమాదం జరిగింది. ఎస్ వైజె కాంప్లెక్స్ లో వస్త్రదుకాణంలో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. మంటలు అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.



నవతెలంగాణ – బోనకల్ : దొంగతనాల కేసులో తనను అనుమానించి నల్లగొండ జిల్లా పోలీసులు తీసుకెళ్లి విచారణ అనంతరం తనను వదిలేసారని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన పాకాల పాటి మోహన్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనాల కేసులో నల్లగొండ పోలీసులు అనుమానితునిగా తనను తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఆ దొంగతనాల కేసులో తనను నల్గొండ జిల్లా పోలీసులు విచారించారని తెలిపారు. విచారణలో […] The post దొంగతనాల కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు : మోహన్ రాయ్ appeared first on Navatelangana.



తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం (మే 21) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికాసేపట్లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.ఈ సందర్భంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్ మంత్రివర్గంలో చేరనున్నారు. దీంతో 1967 తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో అధికారికంగా భాగస్వామ్యం కానుంది.



నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మేడిపల్లి మండలం కొండాపూర్‌లోని శివగంగా ఆలయ కోనేరులో నిన్న సాయంత్రం ఈ ఘోర దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్‌కు చెందిన భార్గవి-శేఖర్ దంపతుల కుమారుడు షార్వింద్ (7), జగిత్యాలకు చెందిన భారతి-భూషణం దంపతుల పిల్లలు మన్వీత్ (11), మనస్వి (9) మృతి చెందారు. వీరిలో మన్వీత్, మనస్వి అన్నాచెల్లెళ్లు. షార్వింద్ తల్లి […] The post ఘోర విషాదం..కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి appeared first on Navatelangana.

దుల్కర్ సల్మాన్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించా రు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అ త్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతు న్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగ స్టు 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాం డ్‌గా థియేటర్లలో విడుదల కానుం ది. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు పో స్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాకు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. వే ఫారర్ ఫిలమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, షహబాస్ రషీద్, ఆ దర్శ్ సుకుమారన్ కథా రచన అం దించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది.




నవతెలంగాణ-హైదరాబాద్ : మహరాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ మార్కెట్ కాంప్లెక్స్ లో గురువారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. ఒక ఫైర్ మ్యాన్, ఒక సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మే 21 గురువారం తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో గమ్ దేవి మార్కెట్ కాంప్లెక్సులో మంటలు చెలరేగాయి. అక్కడ పెద్దసంఖ్యలో కూరగాయలు, బట్టల దుకాణాలు ఉండటంతో మంటలు వేగంగా […] The post భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి appeared first on Navatelangana.



సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్లుగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ అందించారు. మే 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ “ఇది చాలా మంచి కథ. మంచి ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి. సినిమా చూసే ప్రేక్షకులు మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు”అని పేర్కొన్నారు. రామ్ జగదీష్ మాట్లాడుతూ “రమణీ కళ్యాణం చాలా స్పెషల్ ఫిల్మ్. కళ్లులేని అమ్మాయి, కాళ్లు లేని అబ్బాయి.. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే స్క్రీన్‌పై ఎలా ఉంటుందో అనిపించింది. దాన్ని చాలెంజ్‌గా తీసుకుని సినిమా చేశాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిజి విశ్వప్రసాద్, సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస్ రెడ్డి, అలీ, సూరజ్, యువరాజ్ పాల్గొన్నారు.




న్యూఢిల్లీ: బిసిసిఐ, పాకిస్థాన్ క్రికెటర్లకు ఐపిఎల్ లో ఆడేందుకు అనుమతించని సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ మాజీ పేసర్.. ఐపిఎల్ ఆడే అవకాశం లభించింది. పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్.. బ్రిటిష్ పౌరసత్వం పొందాడు. దీంతో ఇప్పుడు ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ లెఫ్ట్-ఆర్మ్ పేసర్ రెండోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. బ్రిటిష్ పౌరురాలైన తన భార్య నర్జిస్ ఖాన్ ద్వారా యూకే పాస్‌పోర్ట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు అతను గతంలో వెల్లడించాడు. ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తయినట్లు సమాచారం.అమీర్ తన కొత్త జాతీయతను సూచిస్తూ ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసిన తర్వాత, అతని ఐపీఎల్ అర్హతపై ఊహాగానాలు మరింత పెరిగాయి. ఎందుకంటే పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాల కింద నమోదు చేసుకున్న విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ప్లేయర్ పూల్‌కు అర్హులుగా ఉంటారు.ఇక, అమీర్ కూడా ఈ అవకాశం గురించి గతంలో మాట్లాడుతూ.. బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందడం ద్వారా 2026లో ప్రారంభమయ్యే లీగ్‌కు తాను అర్హుడనవుతానని పేర్కొన్నాడు. "వచ్చే ఏడాది నాటికి, నాకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంటుంది. అవకాశం ఇస్తే ఎందుకు వదులుకోవాలి?