తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం (మే 21) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికాసేపట్లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.ఈ సందర్భంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్ మంత్రివర్గంలో చేరనున్నారు. దీంతో 1967 తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో అధికారికంగా భాగస్వామ్యం కానుంది.