
హైదరాబాద్: పాతబస్తీ మదీనా చౌరస్తాలో అగ్నిపమాదం జరిగింది. ఎస్ వైజె కాంప్లెక్స్ లో వస్త్రదుకాణంలో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. మంటలు అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.













