
4147 వార్తలు
నవతెలంగాణ-తుంగతుర్తిరాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ సర్పంచ్ మేడ్డుల రమేష్ అన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు కేసిఆర్ దూరదృష్టి,పట్టుదల వల్లే ఉద్యమం సాఫల్యం సాధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు యువత ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఏకమై పార్టీకి […] The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలంలోని పిరట్వానిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని గ్రామ సర్పంచ్ సుప్రియ పరిశీలించారు. దాసరోనికుంట వద్ద కొనసాగుతున్న పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచూ నీరు తాగడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, తలపై గుడ్డలు కట్టుకోవడం వంటి […] The post ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో మే 9 నుంచి 11 వరకు జరగనున్న ఎప్‌సెట్ (ఇంజినీరింగ్) పరీక్షకు హాల్‌టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఇటీవల అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా ఇంజినీరింగ్ విభాగం పరీక్ష రాసే విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇంజినీరింగ్ పరీక్షను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లోని […] The post ఎప్‌సెట్ హాల్‌టికెట్లు విడుదల appeared first on Navatelangana.

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పార్టీకే మనుగడ లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి గతం ఉందని.. భవిష్యత్ లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై సిఎం స్పందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సిఎం చిట్ చాట్ చేశారు. కొత్త పార్టీ సంగతి తరువాత.. ఉన్న పార్టీ ఉంటుందా.. ఊడుతుందా? అని ప్రశ్నించారు. ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహంచారని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవని, కెసిఆర్ కుటుంబ సభ్యులు తెచ్చి పెట్టుకున్న నటన చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబంమంతా ఒక్కటేనని..రంగు రుచి లేదని, కుటుంబ పెద్ద తర్వాత వారసత్వం వస్తుందని పేర్కొన్నారు. కెసిఆర్ చనిపోతే తనకేం వస్తుందని, కెసిఆర్ చావు తాను ఎందుకు కోరుకుంటానని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, కెసిఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని తెలియజేశారు. కెసిఆర్ మర మనిషో.. కాదో..కుటుంబసభ్యులకే తెలుసు అని వివక్ష లేని పాలన కాంగ్రెస్ దని, తమకు ప్రతిపక్షమే లేదని చెప్పారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటల

హైదరాబాద్: అంబర్పూటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్ కూడలి వద్ద ఓ షోరూమ్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. షోరూమ్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో.. వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ డేటా వాడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన మరో సరసమైన, ప్రయోజనకరమైన ప్లాన్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను మరింత ప్రత్యేకంగా నిలుపుతూ, సంస్థ అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్రత్యేక రూ. 225 రీఛార్జ్ ప్లాన్ గురించిన సమాచారాన్ని సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంది. తక్కువ ధరకే అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్న ఈ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ రూ. 225 రీఛార్జ్ ప్లాన్బిఎస్ఎన్ఎల్ రూ. 225 రీఛార్జ్ ప్లాన్ కింద, వినియోగదారులు ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఇది తరచుగా ఇంటర్నెట్ వాడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డేటాతో పాటు, ఈ ప్లాన్ రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. దీనివల్ల వినియోగదారులు సులభంగా మెసేజింగ్ చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది, దీనివల్ల వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా దేశవ్యాప్తంగా తమకు కావలసినన్ని క






నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేమ్రాజ్ కల్లానిలో మాజీ సర్పంచ్ సుంకరి వెంకన్న, డోన్ గావ్ గ్రామ సర్పంచ్ శ్రీనివాసా ఆధ్వర్యంలో, సావర్గావ్ మాజీ సర్పంచ్ కిషన్, మాదాపూర్ సర్పంచ్ ఆశా చందర్ పటేల్, మతుర తండా సర్పంచ్ అనిత చౌవాన్ , అధ్యక్షతన గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ జెండాను […] The post గ్రామాలలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ- మద్నూర్ హైదరాబాదులో సోమవారం నిర్వహించిన రెవెన్యూ, గృహ నిర్మాణాల, శాఖ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలు కావాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి […] The post గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.


నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి గ్రామస్థాయి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో భారత రాష్ట్ర సమితి జెండాను గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎగరవేశారని తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గ్రామస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో […] The post డోన్గావ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-నాచారంబీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాచారంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసిన మహానేత కేసీఆర్ నాయకత్వమే రాష్ట్ర సాధనకు దారి తీసిందని పేర్కొన్నారు. ఉద్యమకారుల నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందువల్లే ప్రజాప్రతినిధులుగా సేవ […] The post తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం appeared first on Navatelangana.
నవతెలంగాణ-కంఠేశ్వర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈనెల 28న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ సమస్మరణ సభను న్యూ అంబేద్కర్ భవన్లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్మరణ సభకు పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా వామపక్ష […] The post నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

నవతెలంగాణ-రామారెడ్డి కష్టపడి పండించిన రైతు తన ధాన్యాన్ని దళారులకు అన్నీ మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించి లబ్ధి పొందాలని సర్పంచ్ లతశ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని అన్నారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఉప సర్పంచ్ దయానంద్, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, పాలకవర్గ సభ్యులు చాట్ల లక్ష్మణ్, వంచ సతీష్, నరేందర్ రెడ్డి, కూడెల్లి ఎల్లం, దేవదాస్, కీసరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు […] The post వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన గౌసోద్దిన్ భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సేవా సమితి సభ్యులు సోమవారం బాధిత కుటుంబానికి రూ.3000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. The post అనారోగ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.
