
4147 వార్తలు
నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల బస్ స్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు సంక్షేమం, […] The post తాడిచెర్లలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్‌లో బీజేపీని తిరస్కరించాలని CPI జనరల్ సెక్రటరీ డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతో బెంగాల్‌తో పాటు దేశాన్ని సంక్షోభంలో పడేస్తుందన్నారు. నేటితో ముగియునున్న సెకండ్ ఫేజ్ ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వవద్దని నేను బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం. బెంగాల్‌లో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకోనివ్వకూడదు. ఇది కేవలం బెంగాల్‌కే కాకుండా, యావత్తు దేశానికి కూడా వినాశకరంగా పరిణమిస్తుందని’ అని చెప్పారు. […] The post బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం:CPI జనరల్ సెక్రటరీ డి.రాజా appeared first on Navatelangana.
ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు, కుమార్ యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుకౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని యుంసీటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. కౌలు రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందలేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతమన్నారు. భూమి కౌలుకు తీసుకొని అరుగాలం కష్టపడి పంట పండిస్తే పండించిన పంటను ప్రభుత్వానికి […] The post కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలో పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజలందరూ గో ఆరాధన ఉద్యమ ర్యాలీ సోమవారం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరుకొని గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతలతో గోశాల నుండి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదేవిధంగా తహశీల్దార్ ముజీబ్ కు వినతిపత్రం అందజేశారు. గో వంశ సంరక్షణ, గోవును దేశమాతగా, ఓన్నత్య త్యాగానికి చిహ్నంగా […] The post పార్టీలకతీతంగా గో ఆరాధన ఉద్యమ ర్యాలీ appeared first on Navatelangana.
నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం శ్రీరాంపల్లి గ్రామంలో సంవృద్ది జీవ ప్రార్ధన మందిరం నందు సోమవారం ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని రిబ్బన్ కట్ చేసి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వడిత్య విజయ్, శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, పెద్దవూర మండల మాజీ ఉప సర్పంచ్ మట్టపల్లి ప్రదీప్ రెడ్డి, పాస్టర్ శ్యాం బాబు, దోరేపల్లి నరేష్, డేవిడ్, శంకర్ రెడ్డి, జోషి, […] The post వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.
నవతెలంగాణ -పెద్దవూర నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి 26 ఆవిర్భావ దినోత్సవం సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతపల్లి సర్పంచ్ జటావత్ రవి నాయక్, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొదిళ్ల శ్రీను ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు రమావత్ శ్రీకర్ నాయక్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసి కేక్ […] The post ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం appeared first on Navatelangana.
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్థులకు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కాక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ […] The post తాజ్ పూర్ లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు appeared first on Navatelangana.
పరకాలలో బిఆర్ఎస్ ఘనంగా ఆవిర్భావ దినోత్సవంలో చల్లా ధర్మారెడ్డినవతెలంగాణ – పరకాల పరకాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా […] The post బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి appeared first on Navatelangana.

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కుమారుడు హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాని ప్రత్యేక షోలో అమిర్ ఖాన్ చూశారు. ఈ సినిమా చూస్తూ అమిర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న సాయి పల్లవి అమిర్‌ను ఓదార్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆయనకు కన్నీళ్లు ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి అమిర్ ఖానే నిర్మాత కావడం మరో విశేషం.#AamirKhan cried after watching his son Junaid Khan’s acting in #EkDin 😭😭#SaiPallavi #JunaidKhan pic.twitter.com/g5aRAiXDXG— Random Cine Mood (@RandomCineMood) April 26, 2026

హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ఎంఎల్‌సిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎంఎల్‌సిలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసమే తనకు మంత్రి పదవి ఇచ్చారనేది నిజం కాదు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మైనార్టీల సంక్షేమం కోసం పని చేస్తోందని ప్రశంసించారు. ఎంఎల్‌సిగా తనని ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పిసిసికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని అజారుద్దీన్ హామీ ఇచ్చారు.

జగద్గిరి గుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి సాయి నగర్ లోని రెస్క్యూ హోమ్ నుంచి ఏడుగురు మహిళల పారిపోయారు. రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను పోలీసులు రక్షించి రెస్క్యూ హోమ్ లో ఉంచారు. రెస్క్యూ హోమ్ నిర్వాహకుల కళ్ళు కప్పి అక్కడ నుంచి సాల్మా(ఢిల్లీ), స్వేత(తెలంగాణ), కమలమ్మ(తెలంగాణ), ప్రియాంక(తెలంగాణ), సంధ్య(ఎపి), చాందిని(పశ్చిమ బెంగాల్), బీట్రైస్(కెన్యా) అనే మహిళలు పారిపోయారు. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పారిపోయిన మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: త్యాగాల పునాదుల మీద పార్టీ బిఆర్ఎస్ ఏర్పడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దశాబ్దాలుగా, అన్యాయానికి గురై నెత్తురు మండిన జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా అని కొనియాడారు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండా కెటిఆర్ ఆవిష్కరించారు. సీనియర్ నేతలు పాల్గొన్నారు. జై కెసిఆర్, జై బిఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగుతుంది. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల్లో అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బిఆర్ఎస్ అని స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే సమస్యలకు చరమగీతం పాడవచ్చని కెటిఆర్ తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ 25 ఏళ్ల క్రితం జలదృశ్యంలో గులాబీ జెండా ఎత్తారని, 14 సంవత్సరాలు తెలంగాణ జాతిని పార్టీ ఐక్యం చేసిందని అన్నారు. అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బిఆర్ఎస్ అని రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు అధికార బాధ్యతలు ఇచ్చారని, రాష్ట్ర అవశ్యకతను బోధించి ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కెసిఆర్ ది అని ప్రశంసించారు. పదేళ్ల పాటు అధికారమిస్తే బాధ్యతగా భావించి రా
నవతెలంగాణ-హైదరాబాద్: ఆప్ పాలిత రాష్ట్రం పంజాబ్‌లో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఏక కాలంలో విస్తృత దాడులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మది ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది.పంజాబ్ మాజీ DIG హర్‌చరణ్ సింగ్ భుల్లార్, ఇతరులకు సంబంధించిన కేసుల విషయంలో, PMLA చట్టం-2002 కింద చండీగఢ్, లూథియానా, పాటియాలా, నాభా, జలంధర్‌తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ED తెలిపిన వివరాల ప్రకారం, బినామీ ఆస్తులను వెలికితీయడం, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించడమే ఈ […] The post పంజాబ్‌లో ఈడీ సోదాలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. The post ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థి వినీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వినీశ్‌ను ఓయూ సిబ్బంది గాంధీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఈ ఘటప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ఓయూలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం appeared first on Navatelangana.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా దర్శకత్వం లో, వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ ప్లస్‌ఎస్ మూ వీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ‘రావు బహదూర్’ జూన్ 5న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ బాధ్యతలను స్వయంగా తీసుకున్న వెంకటేష్ మహా యూనివర్సల్ ఎమోషన్స్‌ను కలిపిన కథను అద్భుతంగా తెరకెక్కించారు.

హైదరాబాద్: బిసి గురుకుల విద్యాసంస్థల్లో చదివి, ప్రతిభతో వివిధ ఉద్యోగాలను సాధించిన విద్యార్థులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సోమవారం తన ఫేస్ బుక్ ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణకు ఇది ప్రతిఫలం అని, గ్రామీణ, పేద కుటుంబాల నుండి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం అని ప్రశంసించారు. విద్యార్థులు సాధించిన విజయాలు మీ కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం బిసి సమాజానికి గర్వకారణమన్నారు. ఈ విజయాలు మరెంతో మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని, ఇంకా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బిసి విద్యార్థుల విద్య, ఉపాధి, సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, గురుకుల వ్యవస్థ ద్వారా నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు మార్గదర్శకత్వం అందిస్తున్నామని పొన్నం తెలియజేశారు. ఇలాంటి విజయాలను విద్యార్థులకు మరింతగా చేరువ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల అందరి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరోసారి పొన్నం అభినందనలు తెలిపారు.
నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చేరికను రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ బీజేపీ ఎంపీలుగా పరిగణిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 106 నుంచి 113కు చేరుకుంది. అదే సమయంలో ఆప్ ఎంపీల సంఖ్య 3కు పడిపోయింది. గత శుక్రవారం ఆప్ […] The post బీజేపీలో ఏడుగురు ఆప్ ఎంపీల చేరిక..రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న విచారణకు తాను వ్యక్తిగతంగా గానీ, తన లాయర్ ద్వారా గానీ హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరుపుతున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఆయన నేరుగా లేఖ రాశారు. “జస్టిస్ స్వర్ణకాంత గారి నుంచి నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం […] The post కోర్టు విచారణకు హాజరుకాను: కేజ్రీవాల్ appeared first on Navatelangana.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్ ఓయూలో మైనింగ్ చదువుతున్నాడు. రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రికి తరిలించారు. ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో టమాటా ధరలు కిలో రూ. 40 నుండి రూ. 60కి పెరిగాయి. తక్కువ సాగు మరియు అధిక డిమాండ్ కారణంగా ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది. ఈ పరిస్థితిలో టమాటా రైతుల జేబులు నిండుతాయా లేక దళారులకే లాభం దక్కుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు. The post భారీగా పెరిగిన టమాటా ధరలు appeared first on Navatelangana.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ రాశి కన్నా కనిపించనుందని టాక్. గతంలో రాశి, వరుణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.

కామారెడ్డి: మాంసం కూర వండలేదని భార్యతో భర్త గొడవకు దిగాడు. దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కోడవలి తీసుకొని భర్తపైకి భార్య విసరడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోసంగి కాలనీలో కోదండం శివాజీ(28), లక్ష్మీ(23) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శివాజీ పాతసామాన్ల వ్యాపారం చేస్తుండగా లక్ష్మీ ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన తరువాత భార్య మాంసం కూర వండవా? అని భర్త అడిగాడు. ఆమె వండలేదని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోడవలి తీసుకొని భర్తపైకి విసిరింది. కోడవలి భర్త మెడకు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మెడ నరం తెగిపోవడంతోనే అతడు అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. క్షణికావేశంలో భర్తను పొట్టనపెట్టుకున్నానని, ఇప్పుడు తాను జైలుకు వెళ్తే తన కూతుళ్లను ఎవరు చూసుకుంటారని ఆమె కన్నీంటి పర్యంతమైంది. శివాజీ సోద