హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. టెకీ సీతారాం ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.“నా ప్రేమ సరిపోలేదా..? నీకు కావాల్సింది కేవలం శృంగారమేనా..?” అంటూ ఆయన రాసిన మాటలు హృదయాన్ని కదిలిస్తున్నాయి.
భార్య రేణుకపై అతను పెట్టుకున్న నమ్మకం చిద్రమైంది. ఆమెకి ఇతరులతో సంబంధాలు ఉన్నాయని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో, చివరకు తన ప్రాణాలను తీసుకున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, రేణుకతో పాటు ఆమె ఇద్దరు ప్రియులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దాంపత్య జీవితంలో నమ్మకం, విలువలపై పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.











