తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆలేరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రతిభతో మెరిశాయి.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు గొలనుకొండ, కొల్లూరు, శారజీపేట, శ్రీనివాసపురం, టంగుటూరు పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించారు. కొలనుపాక పాఠశాల 96% ఉత్తీర్ణతతో మంచి ఫలితాలు నమోదు చేసిందని ఆలేరు మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.