తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పార్టీ పేరులో చిన్న మార్పుతో ఈ అనుమతి లభించింది.

మొదట ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రతిపాదించినప్పటికీ, తుది ఆమోదం ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’ పేరుతో వచ్చింది. ఈ నెల 25న పార్టీని అధికారికంగా ప్రారంభించిన కవిత... పార్టీ పేరులో ‘టీఆర్ఎస్’ అక్షరాలు ఉండేలా ఆమె జాగ్రత్త పడ్డారు. సాంకేతిక కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర సేన పేరు పెండింగ్‌లో ఉండగా, తాజాగా కొత్త పేరుకు ఆమోదం లభించింది. దీంతో కవిత వర్గం సంబరాలు జరుపుకుంటున్నారు.