అమెరికాలోని షార్లెట్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ – షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అక్టోబర్ 17న జరగనున్నాయి.
షార్లెట్‌లోని రియా ఫార్మ్స్ స్టీమ్ అకాడమీ వేదికగా శనివారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ మహిళలు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.
అమెరికాలోని తెలుగు సమాజంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు.. కొత్త తరానికి బతుకమ్మ పండుగ విశిష్టతను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
తేదీ: అక్టోబర్ 17, 2026, శనివారం
సమయం: ఉదయం 9 గంటలు
వేదిక: Rea Farms STEAM Academy, 11532 Golf Links Dr, Charlotte, NC 28277














