
1614 వార్తలు

సాధారణంగా బ్యాంకులు అంటే డబ్బులు దాచుకోవడానికో లేదా అప్పులు తీసుకోవడానికో వేదికలు. కానీ, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఆలోచనతో "హెల్మెట్ బ్యాంకులను" అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ వినూత్న కాన్సెప్ట్, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలవబోతోంది.

Sri Veerabrahmendra Swamy Jayanti: మహాయోగి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆరాధనీయులు. ఆయన రాసిన “కాలజ్ఞానం” ద్వారా అనేక భవిష్యవాణులు ప్రసిద్ధి చెందాయి. దేశంలో జరిగే అనేక సంఘటనలను ఆయన ముందే చెప్పారని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున ఆయన జయంతి జరుపుకుంటారు. అదే రోజున ఆయన సజీవ సమాధిలో ప్రవేశించిన పవిత్ర దినంగా కూడా భావిస్తారు.

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తూ రాణిస్తున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే.. చిన్న హీరోలతోనూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. దిల్ రాజు ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. కాగా ఓ సినిమా గురించి దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Bangaru teega chepa recipe: ఈ కూరకు నూనె చుక్క కూడా అవసరం లేదు ఎందుకంటే, చేపలో ఉన్న తేమతోనే బాగా ఉడికిపోతుంది. ఇంకా అరిటాకును వాడటం వలన దీనికి ప్రత్యేకమైన వాసన, టేస్ట్ వస్తుంది. ఈ చేప కూరను రైస్‌తో కానీ రోటితో తింటే రుచి అదిరిపోతోంది.

DMart Prices: ఇతర కంపెనీల ఉత్పత్తులను తన షెల్ఫ్స్‌లో ఉంచడానికి డీమార్ట్ 'స్లాట్ ఫీజు' తీసుకుంటుంది. అలాగే సప్లయర్లకు త్వరగా పేమెంట్స్ చేస్తుంది. దీనివల్ల సప్లయర్లు డీమార్ట్‌కు మరిన్ని డిస్కౌంట్లు ఇస్తుంటారు. అందుకే సామాన్యులకు కావాల్సిన నిత్యవసరాల నుండి గృహోపకరణాల వరకు..

Virat Kohli : ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై మైకేల్ వాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. కోహ్లీ కంటే జో రూట్ మేలన్న వాన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు.

Rajyog April astrology: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో, ఏప్రిల్ నెలాఖరులో రాజయోగం ఏర్పడుతోందనే వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ప్రత్యేక యోగం ప్రభావంతో సింహరాశితో పాటు మరిన్ని రెండు రాశుల వారికి ఇది ఒక స్వర్ణయుగంగా మారనుంది. మరి ఆ అదృష్టవంతమైన రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Vaccine Side Effects: యువకుల్లో రోగనిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా ఉండటం వల్ల వారికి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ. వయస్సు పైబడిన వారిలో రోగనిరోధక శక్తి స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల లక్షణాలు తక్కువగా ఉండవచ్చు. గతంలోనే సదరు వైరస్‌కు లేదా..

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తెలుగులోనూ మంచి మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. చివరిగా విక్రమ్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా విక్రమ్ కు సబంధించిన ఓ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది.

మానవత్వానికి, మూగజీవాల పట్ల ప్రేమకు అద్దం పట్టే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడంబరాలకు పోకుండా, ఆకలితో ఉన్న వీధి కుక్కల కడుపు నింపి ఔదార్యం చాటుకున్నారు. ఒకటి కాదు రెండు 50 వేలకు పైగా మూగజీవాల ఆకలి తీర్చారు. తన 55వ పుట్టినరోజును శివసేన పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ గుర్జర్ అత్యంత అర్థవంతంగా జరుపుకున్నారు.

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఇప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ఇప్పుడు ప్రయాణికుల పాలిట నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు కేవలం సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయంలోనే కనిపించే ట్రాఫిక్ రద్దీ, ఇప్పుడు ప్రతి వారాంతంలోనూ (వీకెండ్) సర్వసాధారణమైపోయింది. అసంపూర్తిగా సాగుతున్న నిర్మాణ పనులు, పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలన తీర్పులో, వివాహ బంధాన్ని డబ్బు కోసం దుర్వినియోగం చేసిన భర్తకు రూ.15 లక్షల జరిమానా విధించింది. భార్య పేరు మీద రుణాలు తీసుకుని, ఆమెను వదిలిపెట్టి, తిరిగి భరణం కోరిన భర్త చర్యను కోర్టు తీవ్రంగా ఖండించింది.

ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏపీలోని పెట్రోల్ బంకు యజమానులు నో స్టాక్ బోర్డ్ పెట్టేశారు. కొన్నిచోట్ల 500 రూపాయల పెట్రోలే కొడుతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం వాహనదారులను టెన్షన్ పెడుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంక్ యజమానులతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి.

IPL 2026 Record : ఏప్రిల్ 25, 2026న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో (ఢిల్లీ vs పంజాబ్, రాజస్థాన్ vs హైదరాబాద్) కలిపి మొత్తం 986 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని పరుగులు రావడం ఇదే మొదటి సారి. గతంలో 2024లో నమోదైన 899 పరుగుల రికార్డు ఇప్పుడు కనుమరుగైపోయింది.

Why Dhoni is not playing: ఐపీఎల్ 2026 చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళ్తోంది. అయితే, ఇప్పటి వరకు ధోని మాత్రం ఆడడం లేదు. అభిమానులు మాత్రం మిస్టర్ కూల్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు గాయం కారణంగా ధోని ఆడడం లేదని అంతా అనుకున్నారు. కానీ అసలు రీజన్ వేరొకటి ఉందంట.

శరీరానికి విశ్రాంతి లభించకపోతే మెదడు తనను తాను నియంత్రించుకోలేక మందగిస్తుంది. మనం మేల్కొని ఉన్నా మెదడు మాత్రం పాక్షికంగా నిద్రపోతున్న స్థితిలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల మన దైనందిన పనులలో అనేక అడ్డంకులు ఏర్పడతాయి. మన ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని నిద్రలేమి ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం..

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఫ్యాషన్ విషయంలో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ మలైకా మాత్రం ఆ కట్టుబాట్లను తెంచుకుంటూ తన బాడీని ఎంతో అందంగా మలచుకుంది. ఆ దృఢమైన శరీరం వెనుక ఉన్న క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఆ మెరిసే అందం వెనుక ఉన్న రహస్యాలు ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2026 పరుగుల వరదతో పోటెత్తుతోంది. గత రెండు రోజుల్లో మూడు సెంచరీలు నమోదైనా, విచిత్రంగా ఆ మూడు మ్యాచ్‌లలోనూ శతకాలు చేసిన జట్టు ఓటమి పాలైంది. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, వైభవ్ సూర్యవంశీ శతకాలు వృధా అయ్యాయి. భారీ స్కోర్లు చేసినా విజయాలు అందని ఈ వింత పోకడ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

నీట్ యూజీ (NEET UG) 2026 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 26న విడుదల చేయనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం నీట్ యూజీ 2026 పరీక్ష..

Horoscope Today (April 26, 2026): ఆదివారంనాడు గ్రహస్థితుల ప్రభావంతో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి వృత్తి, ఆర్థిక, కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆదాయం, అవకాశాలు పెరిగితే, మరికొందరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సూచనలు ఉన్నాయి. 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆర్ఆర్ తరఫున 15 ఏళ్ల వైభవ్ సూర్యవన్షీ కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్ తరఫున అభిషేక్ శర్మ (57), ఇషాన్ కిషాన్ (74) మెరుపు హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు.

మన శరీరంలో కలిగే చిన్నపాటి నొప్పుల నుండి ప్రాణాంతకమైన దీర్ఘకాలిక వ్యాధుల వరకు అన్నింటికీ మూలకారణం లోపల జరిగే మంట లేదా వాపు. దీనినే వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేషన్ అని పిలుస్తారు. ఒత్తిడి మరియు జీవనశైలి వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపినప్పటికీ మనం తీసుకునే ఆహారం అన్నింటికంటే శక్తివంతమైన ఆయుధమని నిపుణులు చెబుతున్నారు.