మానవత్వానికి, మూగజీవాల పట్ల ప్రేమకు అద్దం పట్టే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడంబరాలకు పోకుండా, ఆకలితో ఉన్న వీధి కుక్కల కడుపు నింపి ఔదార్యం చాటుకున్నారు. ఒకటి కాదు రెండు 50 వేలకు పైగా మూగజీవాల ఆకలి తీర్చారు. తన 55వ పుట్టినరోజును శివసేన పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్ గుర్జర్ అత్యంత అర్థవంతంగా జరుపుకున్నారు.