
1609 వార్తలు

ఇండియన్ క్రికెట్‌తోపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రనే మార్చేసింది ఐపీఎల్. ప్రతి సీజన్‌కూ క్రేజ్ పెంచుకుంటూ సామాన్యులతోపాటు సెలబ్రిటీలను కూడా టీవీలకు, స్టేడియాలకు కట్టిపడేస్తోంది ఐపీఎల్. మ్యాచ్‌లు చూడటానికి వచ్చే సెలబ్రిటీలు, క్రికెటర్ల పార్ట్నర్స్ కూడా ఐపీఎల్ క్రేజ్‌ను మరింత పెంచేస్తున్నారని చెప్పడంలో డౌటే లేదు.

Mohini Ekadashi 2026: వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. సముద్ర మథనంలో అమృతాన్ని కాపాడేందుకు శ్రీమహావిష్ణువు మోహినీ రూపం ధరించిన రోజు ఇదే అని పురాణ కథనం. ఈ రోజున ఉపవాసం, దానధర్మాలు చేయడం వల్ల అధిక పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం ఏప్రిల్ 27న వచ్చిన ఈ ఏకాదశికి ధ్రువ యోగం కూడా ఉండటంతో విష్ణు భక్తి కార్యక్రమాలు మరింత శుభఫలితాలను ఇస్తాయని పండితుల అభిప్రాయం.

Gold, Silver Prices Today: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం భారీగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. తాజాగా కూడా ధరలు దిగి వస్తున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మార్కెట్లో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో మెరిసిపోయే క్యాప్సికమ్‌లు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. చాలామంది ఇవి కేవలం చూడటానికి వేర్వేరుగా ఉంటాయి తప్ప రుచిలో పెద్దగా తేడా ఉండదని భావిస్తుంటారు. కానీ నిజానికి ఈ రంగుల వెనుక ఒక పెద్ద కథే ఉంది. క్యాప్సికమ్ రంగు అనేది అది ఎంతవరకు పక్వానికి వచ్చింది అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా, దాని రుచిని, మన శరీరానికి అందించే పోషక విలువలను కూడా నిర్ణయిస్తుంది.

బంగారం కొనడం ఆర్థిక నిర్ణయం, స్వచ్ఛత ముఖ్యం. నకిలీ హాల్‌మార్క్‌లతో మోసాలు పెరుగుతున్నందున, స్వయంగా ధృవీకరించుకోవాలి. BIS HUID, BIS కేర్ యాప్ ద్వారా అసలు బంగారాన్ని గుర్తించవచ్చు. ఇంట్లో అయస్కాంతం, నీటి పరీక్ష, సిరామిక్ ప్లేట్ వంటి పద్ధతులతో ప్రాథమిక పరీక్షలు చేసి, మీ కష్టార్జితాన్ని నకిలీ బంగారం మోసాల నుండి కాపాడుకోండి.

ప్రతిరోజూ లాగే ఆ రోజు కూడా పక్క మీద నుంచి లేచిన ఆ వ్యక్తికి తన శరీరాన్ని చూసుకోగానే గుండె ఆగినంత పనైంది. అద్దంలో తన ముఖం చూసుకుంటే అచ్చం ఏదో సినిమాలోని వింత మనిషిలా శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది. తనకి ఏదో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని, ఇక బతకడం కష్టమని భయపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి పరుగులు తీశాడు. తీరా అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత తెలిసిన అసలు విషయం విని అందరూ నవ్వుకున్నారు. బ్రిటన్‌లో జరిగిన ఈ వింత సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ నీలం రంగు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథాకమిషేంటో తెలుసుకుందాం.

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఈ, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్ 2026) ఆన్ లైన్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు (ఏప్రిల్ 28) విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన..

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ బరితంగా సాగిన మ్యాచ్‌లో చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. సూపర్ ఓవర్లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగా..లక్ష్యచేధనలో బరిలోకి దిగన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ మొదటి బంతికే ఫోర్ కొట్టి మ్యాచ్‌ను పూర్తి చేశాడు.

తెలంగాణలో ఆర్టీసీ బస్సు సేవలను ప్రతీ పల్లెకు తిప్పేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంతో అందరికీ సమన్యాయం పాటిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంక్ డీలర్స్కు ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని HPCL, IOCL,BPCL ప్రతినిధులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుల కోసం గ్రామాల్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఇందుకోసం 200 టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టీమ్‌లు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నాయని తెలుస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. ఓ చిన్న విషయంలో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవ కారణంగా ఢిల్లీ పోలిస్ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రాణాలు కోల్పోగా అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకకలం రేపింది.

బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రక్రియను మొదలుపెట్టనుంది. గతంలో తరహాలో ఏళ్ల పాటు కాకుండా 12 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు.

వంట ఏదైనా.. చివర్లో కొంచెం కొత్తిమీర పడితేనే ఆ రుచే వేరు.. కానీ వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్ నుండి తెచ్చిన గంటకే కొత్తిమీర వాడిపోతుంది. ఫ్రిజ్‌లో పెట్టినా రెండు రోజుల్లోనే నల్లగా మారిపోయి పారేయాల్సిన పరిస్థితి వస్తోంది. మరి కొత్తిమీరను వారాల తరబడి తాజాగా, పచ్చగా ఉంచుకోవడం ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బెంగాల్ గడ్డపై రెండో విడత ఎన్నికల జోరుగా సాగుతోంది. తన భారీ రోడ్‌షోతో కోల్‌కతా వీధులను హోరెత్తించే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక బాట పట్టారు. బెంగాలీల ఆరాధ్య దైవం మా కాళీ మాత ఆశీస్సులు తీసుకుంటూ, స్థానిక సంస్కృతితో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. 300 ఏళ్ల చరిత్ర గల తంతానియా కాళిబారిలో మోదీ పూజల గురించి తెలుసుకుందాం..

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ప్రత్యేకమైన దర్శకత్వ శైలిని పంచుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల నుండి అడవిరాముడు వంటి మాస్ చిత్రాల వరకు తన ప్రయాణాన్ని వివరించారు. ఎన్టీఆర్, చిరంజీవి, శ్రీదేవి వంటి తారలతో తన అనుబంధం గుర్తుచేసుకున్నారు.

RCB playing XI Update: ఐపీఎల్ 2026 సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న కీలక పోరుకు ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ వార్త బెంగళూరు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈ జట్టు ఈ సవాలును ఎలా అధిగమిస్తుందో చూడాలి.

How to Cold Room without AC: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇంట్లో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండవేడి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్ వేసుకుంటే దాని నుంచి కూడా వేడి గాలే వస్తుందని చాలా మంది వాపోతున్నారు. అలాంటి వారికోసమే ఓ ఆదిరిపోచే చిట్కా తీసుకొచ్చాం. ఈ చిట్కాను పాటిస్తే..మీ దగ్గర ఉన్న ఫ్యాన్ ద్వారానే ఏసీ లాంటి చల్లదనం పొందచ్చు. అదెలానో చూద్దాం పదండి.

దర్శకుడు చంద్ర మహేష్ సినీ ప్రియులకు సుపరిచితమే. తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విక్టరీ వెంకటేష్ వ్యక్తిత్వం, సురేష్ బాబుతో తనకున్న అనుబంధం, శివయ్య చిత్రం విజయం, తన శిష్యులుగా పనిచేసిన వినాయక్, కొరటాల శివ వంటి ప్రముఖ దర్శకుల విజయాలను వివరించారు. ఆయన ఒక విడుదల కాని చిత్రం గురించి, దాని వెనుక ఉన్న ఆర్థిక సమస్యల గురించి కూడా పంచుకున్నారు.

సినీరంగంలో సక్సెస్ కావడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలి. అవమానాలు భరించి.. విమర్శలు స్వీకరించి తమ నటనతో, ప్రతిభతో సక్సెస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరో ఒకరు. కానీ ఇప్పటికీ అతడికి ఊహించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ?

వేసవి కాలం వచ్చిందంటే..పెద్దింటి వాళ్ళు సెంట్రల్ AC, AC లు, కూలర్లు తో చల్లని గాలి కి ఉపశమనం పొందుతారు. అదే పేదవాడు అయితే చెట్టు నీడ చూకుని సేద తీరుతారు. ఎండల తీవ్రతకు ప్రతి జీవి కూడా ఉపశమనం కోసం తహతహ లాడుతుంటాయి. మరి అలాంటి ఒక ఒక మూగ జీవి తాను ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతుంది. తనతో పాటు తన బిడ్డ కూడా ఎండ తీవ్రతకు గురవుతుందని భావించిన ఆ మూగ జీవి తన బిడ్డ కు ఎండ తగలకుండా చేసిన ఉపాయం చూసి అందరూ షాక్ అయ్యారు.

భారతదేశంలో మనం సంపాదించే ఆదాయంపై ట్యాక్స్ అనేది ఉంటుంది. అయితే కొన్ని దేశాల్లో ట్యాక్స్ అనేది ఉంటుంది. ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు చాలానే ఉన్నాయి. ఈ దేశంలోని ప్రజలు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. కానీ కొన్ని వ్యాపారాలపై మాత్రమే ట్యాక్స్‌లు ఉంటాయి.

నీటిని తోడే ప్రయత్నంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. చేపలు పారిపోతుండగా, పెద్ద క్యాట్ ఫిష్ కనిపించింది. అకస్మాత్తుగా ఒక పాము వచ్చి క్యాట్ ఫిష్‌ను పట్టుకుంది. పాము పట్టు వదలకుండా చేపను తినేందుకు ప్రయత్నించింది. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం అక్కడివారిని విస్మయానికి గురిచేసింది.