
1589 వార్తలు

Hyundai EV: హ్యుందాయ్ ఈ కారును సుమారు 25,000 యూరోల (దాదాపు రూ.26 - రూ.28 లక్షలు) ప్రారంభ ధరతో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి చూస్తే, భవిష్యత్తులో హ్యుందాయ్ ఈ మోడల్‌ను ఇక్కడి మార్కెట్‌కు..

మదర్సాలు మతపరమైన విద్యాబోధన జరిగే పాఠశాలలు. స్వతంత్రంగా నిర్వహిస్తారు. వాటికి సంబంధించి గవర్నమెంట్ దగ్గరా ఎలాంటి లెక్కాపత్రం ఉండదు. కానీ ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మదర్సాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ జరుగుతోంది. కానీ అందుకు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకూ మదర్సాలను ప్రభుత్వ పరిధిలోకి తెస్తే నష్టమా ? లాభమా.?

Washing Machine Hacks: సాధారణంగా మన ఇళ్లలో ఉండే వాషింగ్ మెషీన్లో చాలా మంది కేవలం బట్టలను మాత్రమే ఉతుకుతారు. ఇందులో బెడ్ షీట్లు, రోజువారీ బట్టలు వేయడం తప్ప మరేమీ ఆలోచించరు. కానీ, నిజానికి గంటల తరబడి చేతులతో రుద్దాల్సిన అవసరం లేకుండా, మన పనిని సులభతరం చేస్తూ వాషింగ్ మెషీన్లో ఉతకగలిగే మరికొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వాషింగ్ మెషీన్లో బట్టలే కాకుండా ఇంకా ఏం ఉతకవచ్చో చూద్దాం.

Yashasvi Jaiswal : ఐపీఎల్ 2026లో యశస్వి జైస్వాల్ మరోసారి రికార్డు సృష్టించాడు. పంజాబ్‌పై హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ తరపున 20 సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లోకి చేరాడు.ఆడిన 76 మ్యాచుల్లో జైస్వాల్ 2,472 పరుగులు చేశాడు. 2500 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు.

పశ్చిమ బెంగాల్లో రెండవ, చివరి దశ పోలింగ్ బుధవారం (ఏప్రిల్ 29) ప్రారంభమైంది. ఈ రెండవ దశలో 142 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో, 152 స్థానాలలో 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ రెండవ దశలో 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.

Registered Will Deed: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ, వంశపారంపర్యంగా లేదా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపై మక్కువ చూపిస్తుంటారు. మరికొందరు తమ స్వశక్తితో ఏమీ సంపాదించలేక, కేవలం తల్లిదండ్రుల ఆస్తిపైనే ఆధారపడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్తి పంపిణీ విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ తదనంతరం..

నేటి వేగవంతమైన ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ సమూలంగా మారుతోంది. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లడం అంటే గంటల తరబడి వేచి ఉండటం, కానీ ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్‌తోనే సాధ్యమవుతోంది. ముఖ్యంగా జెన్ జీ (Gen Z) తరం సాంప్రదాయ బ్యాంకింగ్ పద్ధతుల కంటే డిజిటల్ స్పీడ్ మరియు వినూత్న అనుభవాలకే ప్రాధాన్యతనిస్తూ, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.

నెల రోజులుగా పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ఈ రోజే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది..

బరువు పెరగడం అనేది కేవలం శారీరక సమస్యే కాదు, అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి కూడా దారితీస్తుంది. పెరిగిన బరువును ఎలాగైనా తగ్గించుకోవాలనే తపనతో చాలా మంది అడ్డదారులు తొక్కుతుంటారు. ప్రజల ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని ప్రస్తుతం మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజెక్షన్లు విపరీతంగా వస్తున్నాయి.

ఐపీఎల్లో మంగళవారం జరిగిన 40వ మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 222 పరుగులు చేసింది. ఆ తర్వాత 19.2 ఓవర్లలోనే టార్గెట్‌ని చేధించింది రాజస్థాన్. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి.

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తోంది. వివిధ కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తోంది. శిక్షణ తర్వాత ఉద్యోగాలు కూడా కల్పిస్తోంది.

ఉదయం లేవగానే మలవిసర్జన సాఫీగా కాకపోయినా.. కడుపు ఉబ్బరం, గ్యాస్ పట్టేసినట్లు అనిపించినా ఆ రోజంతా నరకప్రాయంగా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఫలితం తాత్కాలికమేనా? అయితే మీరు ఒక్కసారి మీ వంటింట్లోకి చూడాల్సిందే.. మన ఇంట్లో ఉండే ఐదు పదార్థాలతో తయారు చేసుకునే ఒక చిన్న పొడి మీ ప్రేగులను శుభ్రపరిచి, జీర్ణవ్యవస్థను రీసెట్ చేస్తుంది.

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ విదేశీ జాతిని తన ప్రభుత్వ సంస్థాగత నిర్మాణంలోకి చేర్చింది. ఈ మేకల ద్వారా రాష్ట్రంలో పాల విప్లవాన్ని తీసుకురావాలని, తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాశ్మీర్ వాతావరణం ఈ మేకల పెరుగుదలకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ డెయిరీ రంగంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

Marcus Stoinis 62 Runs: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 40వ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించారు. ముఖ్యంగా మార్కస్ స్టోయినిస్ ఆడిన ఇన్నింగ్స్ స్టేడియంను హోరెత్తించింది.

మల్లె పూల సువాసన అంటే ఇష్టపడని వారుండరు. ఎండలు మండుతున్న వేసవిలో మన శరీరం నుండి వచ్చే చెమట వాసనను అరికట్టడానికి మల్లె పూల అత్తరు ఒక అద్భుతమైన మార్గం. రసాయనాలతో కూడిన పర్ఫ్యూమ్ల కంటే ఇంట్లో తయారు చేసిన ఈ సహజ అత్తరు చర్మానికి ఎంతో సురక్షితం. మల్లె పూల (మొగ్రా) సువాసనతో ఇంట్లోనే సహజసిద్ధమైన పర్ఫ్యూమ్ లేదా అత్తరును ఎలా తయారు చేసుకోవాలో ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

చికెన్ అంటే పడిచచ్చే వారికి ఇదొక హెచ్చరిక.. మీరు ఇష్టంగా తినే కోడి మాంసం లోని కొన్ని భాగాలు మీ ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. కోడి శరీరంలో ఏయే భాగాల్లో విష రసాయనాలు ఉంటాయి? యాంటీబయాటిక్స్ ప్రభావం ఏ అవయవాలపై ఎక్కువగా ఉంటుంది? డాక్టర్ల ఏమంటున్నారు..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

After 10th Which Course to Choose: 10వ తరగతి పూర్తి కాగానే విద్యార్థులు, తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు 'ఏ కోర్సు ఎంచుకోవాలి?'. ఎవరో చెప్పారని కాకుండా, మీ ఇష్టాఇష్టాలు, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఈ దశలో వేసే ప్రతి అడుగు మీ కెరీర్‌ను నిర్ణయిస్తుంది. నిపుణుల సలహాలతో మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒకడు. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతోనూ మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్ , సినిమాలతో బిజీగా ఉంటోన్న అవినాష్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దీర్ఘాయువు, బలం, శక్తిని కోరుకుంటున్నారు. కానీ, దీని కోసం ప్రజలు ఖరీదైన సప్లిమెంట్లు, మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజం ఏమిటంటే, అసలైన శక్తి మన వంటగదిలోనే ఉంది . నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని చిన్న గింజలు శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేసి, వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేస్తాయి. అటువంటి ఒక గింజను దాని అద్భుతమైన ప్రయోజనాల కారణంగా స్వచ్ఛమైన బంగారం అని పిలుస్తారు. సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడు, ఈ గింజ బలాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ విత్తనాలేంటో, అది శరీరానికి ఎలా అద్భుతాలు చేస్తుందో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలామంది తమ అవసరాల కోసం ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. మూడు లేదా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను వినియోగిస్తున్నారు. ఇలా ఎక్కువ అకౌంట్లను కలిగి ఉండటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 94.56 వద్ద బలహీనపడింది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలే దీనికి ప్రధాన కారణాలు. స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. నిపుణుల ప్రకారం, ప్రపంచ అనిశ్చితి కొనసాగితే రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంది.

నిజ జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రియల్ క్రైమ్ స్టోరీలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే.