
1594 వార్తలు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దీర్ఘాయువు, బలం, శక్తిని కోరుకుంటున్నారు. కానీ, దీని కోసం ప్రజలు ఖరీదైన సప్లిమెంట్లు, మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజం ఏమిటంటే, అసలైన శక్తి మన వంటగదిలోనే ఉంది . నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని చిన్న గింజలు శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేసి, వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేస్తాయి. అటువంటి ఒక గింజను దాని అద్భుతమైన ప్రయోజనాల కారణంగా స్వచ్ఛమైన బంగారం అని పిలుస్తారు. సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడు, ఈ గింజ బలాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ విత్తనాలేంటో, అది శరీరానికి ఎలా అద్భుతాలు చేస్తుందో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలామంది తమ అవసరాల కోసం ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. మూడు లేదా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను వినియోగిస్తున్నారు. ఇలా ఎక్కువ అకౌంట్లను కలిగి ఉండటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 94.56 వద్ద బలహీనపడింది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలే దీనికి ప్రధాన కారణాలు. స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. నిపుణుల ప్రకారం, ప్రపంచ అనిశ్చితి కొనసాగితే రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంది.

నిజ జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రియల్ క్రైమ్ స్టోరీలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే.

వేసవి కాలంలో బయట దొరికే ఆహారం, ముఖ్యంగా పానీపూరి వంటివి ప్రాణాంతకంగా మారవచ్చా అనే ఆందోళన ఇప్పుడు ప్రజల్ని భయపెడుతోంది. ఎందుకంటే.. వీధి వ్యాపారి వద్ద గోల్గప్పా తిని 45మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వేసవిలో వీధి ఆహారం పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను హెచ్చరిస్తోంది.

కూతురి పెళ్లి జరిగి 24 గంటలు కూడా కాలేదు.. ఇంట్లో బంధువల సందడి, చిన్నారుల కిలకిల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతలోనే ఓ వార్త అందరి ఆనందాన్ని చిదిమేసింది. బిడ్డ పెళ్లి చేసిన ఆనందం ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేక పోయింది. కన్న కూతురు పెళ్లి చేసిన రోజే తండ్రి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలంగాణ నూతన డీజీపీ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. నూతన డీజీపీగా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్ ను నియమిస్తూ.. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అపార్ట్మెంట్లలో నివసించే వారికి పావురాలు పెద్ద తలనొప్పిగా మారాయి. బాల్కనీలలో గూళ్లు కట్టడం, అరుపులతో నిద్ర చెడగొట్టడమే కాకుండా, వాటి రెట్టల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పావురాలను తరిమికొట్టడానికి మార్కెట్లో అనేక రకాల నెట్లు, గ్రిల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి చాలా ఖరీదైనవి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సులభమైన చిట్కా ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో పావురాలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పాత వస్తువులతోనే ఈ బేర్ పీజియన్ స్పైక్స్(DIY Bird Spikes) ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ఫష్టతిచ్చింది. ప్రస్తుతానికి పెంచే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చింది. బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి వద్ద సరుకు రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీని వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

మ్యారేజ్ ముసుగులో మనీ ట్రాప్.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి వర్సెస్ టెక్కీ ధర్మేంద్ర వివాదంలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. అషురెడ్డి అండ్ ఫ్యామిలీ తనను నిండా ముంచేశారని ధర్మేంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు ఫైలయింది. రేపోమాపో అషురెడ్డి సహా ఆమె తల్లికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు.. ఈ క్రమంలో అషురెడ్డి ధర్మేంద్రకు ఫోన్ చేసి.. సెటిల్మెంట్ ఆఫర్ చేసిన ఆడియో వైరల్ అవుతోంది.

Galijeru Pappu Recipe: మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది 'గలిజేరు'. దీనినే పునర్నవ అని కూడా అంటారు. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఈ ఆకును ఆహారంగా తీసుకునేవారు. అయితే, నేటి తరానికి ఈ మొక్క విలువ తెలియక దీనిని ఒక కలుపు మొక్కలా చూస్తున్నారు. కానీ, ఈ గలిజేరు ఆకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు అస్సలు వదలరు.

ప్రేమ ఊపిరి పోస్తుంది అనుకుంటే అతడి ఊపిరి తీసింది. ఓయూలో ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. యువతి అన్న ఆ ఒక్క మాటతో కుంగిపోయిన యువకుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆధార్ కార్డు ఉన్నవారికి ఊరట. ఇక నుంచి ఫిజికల్ కార్డు మీ వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆధార్ అవసరమైతే డిజిటల్ రూపంలో చూపించవచ్చు. ఇందుకోసం గూగుల్ వ్యాలెట్‌లో మీ ఆధార్ సేవ్ చేసుకోవచ్చు. యూఐడీఏఐతో గూగుల్ కీలక ఒప్పందం కుదర్చుకుంది.

Snake Prevention Tips: వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే కొద్దీ పాముల భయం కూడా పెరుగుతుంది. వేడి నుంచి ఉపశమనం కోసం, చల్లదనం వెతుక్కుంటూ పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి పాములు ఇంట్లోకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ పాము కాటు వేస్తే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మనలో చాలా మంది ఫోన్ ఛార్జింగ్ విషయంలో చాలా తప్పులు చేస్తారు. వాటిలో ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలానే మర్చిపోవడం.కానీ ఇలా చేయడం ద్వారా కొన్ని సార్లు అవి పేలిపోయే ప్రమాదం ఉంటంది. లేదా ఫోన్ ఛార్జర్ వేడెక్కి, ఫోన్ లేదా ఛార్జర్ పాడయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కరించేందుకు ఓ సరికోత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చింది. అదెంటో చూద్దాం పదండి.

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు వెండితెరపై హీరోగానూ కనిపిస్తున్నాడు సుడిగాలి సుధీర్. అతను నటించిన గోట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఓ షోలో తన లవ్, బ్రేకప్ స్టోరీ చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు సుడిగాలి సుధీర్.

Egg prices in Hyderabad : వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గడంతో.. గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. అయితే.. గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, చిల్లర గిరాకీ తగ్గినా కోడి మాంసం ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుల విషయంలో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న నిబంధనలను పూర్తిగా మార్చేసింది. అలాగే ఆర్దిక లావాదేవీలకు పాన్ కార్డులను తప్పనిసరి చేసింది. గతంలో ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త రూల్స్ ఏంటి అనేది చూద్దాం.

పెరుగుతున్న విద్యా ఖర్చుల దృష్ట్యా, పిల్లల ఉన్నత చదువుల కోసం ముందుగానే రూ.1 కోటి నిధిని సమకూర్చుకోవడం అవశ్యం. క్రమశిక్షణతో కూడిన SIPలు, PPF, సుకన్య సమృద్ధి యోజన వంటి పెట్టుబడులతో ఇది సాధ్యం. కాంపౌండింగ్ ప్రయోజనం పొందడానికి చిన్నతనం నుండే పెట్టుబడులు ప్రారంభించడం, రిస్క్ తగ్గించడానికి వివిధ మార్గాల్లో నిధులను విభజించడం కీలకం.

Vastu For Wall Clock Placement: వాస్తు ప్రకారం గోడ గడియారం: ఇంట్లోని గడియారం కేవలం సమయం చెప్పే సాధనం మాత్రమే కాదు, వాస్తు శాస్త్రం ప్రకారం అది మన శక్తి, ఆలోచనలు, పురోగతికి కూడా ముడిపడి ఉంటుంది. గడియారాన్ని సరైన దిశలో ఉంచకపోతే, అది ఆటంకాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుందని నమ్ముతారు.

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, రహదారుల విస్తరణపై వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత పానిక్ బయ్యింగ్ వల్ల తాత్కాలికంగా ఏర్పడింది. రాష్ట్రంలో తగినంత ఇంధనం నిల్వ ఉందని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించి, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి 122 ఏళ్లుగా మూసి ఉన్న రహస్యం. 1903లో బ్రిటీష్ అధికారులు ఆలయ రక్షణ కోసం ఇసుకతో నింపి సీల్ చేశారు. ఇప్పుడు భారత పురావస్తు శాఖ (ASI) ఆధునిక సాంకేతికతతో ఆ ఇసుకను తొలగిస్తూ గర్భగుడిని పునరుద్ధరిస్తోంది. లోపల ఏముందో అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చర్య ఆలయానికి మరో 1000 ఏళ్ల ఆయుష్షును ఇస్తుందని భావిస్తున్నారు.