ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన 40వ మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్‌ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 222 పరుగులు చేసింది. ఆ తర్వాత 19.2 ఓవర్లలోనే టార్గెట్‌ని చేధించింది రాజస్థాన్. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి.