
1584 వార్తలు

బాపట్లజిల్లా వేటపాలెం మండలం రావురిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదాల నేపథ్యంలో భార్యాభర్తలు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ కాఫీ, సిగరెట్లుతో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాకెట్ ను కోదాడ చేధించారు. కంత్రీగాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

బ్రాండెడ్ వస్తువుల పేరుతో తక్కువ ధరకే ఆపిల్ ఫోన్లు, వాచీలు ఇస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన తొమ్మిది మంది సభ్యుల ముఠా హైదరాబాద్ లక్ష్యంగా ఈ మోసాలకు పాలడుతున్నే పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 14 ఆపిల్ ఇయర్ ఫోన్స్, 14 ఆపిల్ వాచెస్ తో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకన్నారు.

Protein Rich Breakfast: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మర్చిపోతున్నాం. పూర్వం మన పెద్దలు ఎంతో బలంగా ఉండేవారు. దానికి ప్రధాన కారణం వారు తీసుకునే పౌష్ఠికాహారం. అటువంటి సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన 'ఆవిరి కుడుము', దానికి జోడిగా అదిరిపోయే 'టొమాటో చట్నీ' ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్ పెంచింది. ఆక్రమణలకు గురైన స్థలాలను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా నార్సింగ్ సమీపంలోని ముష్కిన్ చెరువు సమీపంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఏర్పాట్లు చేసుకున్న దుకాణాలు, షెడ్డులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

అసలే వేసవికాలం.. ఎండలు మండిపోతున్నాయి.. ఉక్క పోత ఒక్కరి బిక్కిరి చేస్తోంది.. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.. మాడుపగిలే ఎండ గొంతు మార్చేస్తుంది.. దాహంతో గొంతు ఎండిపోతుంది.. ఆ సమయంలో చుక్క నీరు గొంతులో దిగితే ఆ హాయే వేరు.. అదే మండుటెండలో రోడ్డుపై ప్రయాణిస్తూ ఎక్కడ చుక్క నీరు లేని చోట ఒక బోరు కనిపిస్తే... అక్కడ ఆగి దాహం తీర్చుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోట ఉన్న బోరుకే తాళం వేస్తే..?!

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడంలో జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. అద్భుతమైన సాంకేతికత, కనువిందు చేసే చెర్రీ బ్లాసమ్స్, ఆకాశాన్ని తాకే మౌంట్ ఫుజి పర్వతం, నోరూరించే వంటకాలు.. ఇలా ఒకటేమిటి జపాన్ లో చూడాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. అందుకే చాలామంది భారతీయుల బకెట్ లిస్టులో జపాన్ ఖచ్చితంగా ఉంటుంది.

మిత్రులారా, మనం రోజూ ఎంతో కష్టపడుతుంటాం. పొద్దున్నే లేచి ఆఫీసులకు వెళ్తాం, బాస్ తిట్లు తింటాం, సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మనకంటే తక్కువ కష్టపడే వారు మనకంటే ఎక్కువ ఎలా సంపాదిస్తున్నారు? నిజానికి దేవుడు ఎవరినీ పేదవాడిగా పుట్టించడు, మన ఆలోచనా విధానమే మనల్ని పేదరికంలో ఉంచుతుంది. ధనవంతులు తమ విజయ రహస్యాలను ఎప్పుడూ బయటపెట్టరు. కానీ మన పురాణాల్లో, ముఖ్యంగా చాణక్య నీతిలో ఈ సమస్యలన్నింటికీ సమాధానాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఉద్యోగులకు ఉపయోగపడేలా అనేక మార్పులు చేసింది. ఓవర్ టైమ్ నిబంధనలను మార్చింది. ఇక నుంచి 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే అదనపు జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

తెలంగాణ స్పెషల్ వంటకాలు అనిగుర్తు వస్తే చాలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సకినాలు, సర్వపిండి. ముఖ్యంగా సమ్మర్ వస్తే చాలు ప్రతి పల్లెలో సాయంత్రం స్నాక్‌గా సర్వపిండి ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ సర్వపిండిని కొంత మంది కారం పొడితో చేస్తే మరికొంత మంది పచ్చి మిర్చి కారంతో చేస్తారు. అయితే ఇప్పుడు మనం పచ్చి మిర్చి కారంతో సర్వపిండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

ఈ రోజుల్లో మనమందరం పరుగుల జీవితంలో పడిపోయాము. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్, పని ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడం.. ఇవన్నీ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పురుషులలో ఈ ఒత్తిడి కారణంగా శారీరక బలహీనత, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది కేవలం ఆరోగ్యాన్నే కాదు, మన వ్యక్తిగత జీవితాన్ని, అంటే దాంపత్య సుఖాన్ని కూడా దెబ్బతీస్తోంది. అయితే, వీటన్నింటికీ మన వంటింట్లోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉందని మీకు తెలుసా?

జింకల కొమ్ములు పగిలిపోవడం వల్ల కాదు… ప్రతి సంవత్సరం సహజంగానే రాలిపోతాయి. సంతానోత్పత్తి కాలం తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గడంతో కొమ్ములు తలకు అంటి ఉండే భాగం బలహీనపడి, నొప్పి లేకుండానే వదులుకుంటాయి. అనంతరం మళ్లీ కొత్త కొమ్ములు “వెల్వెట్” దశలో పెరిగి ...

అల్లూరి మన్యంలో వికసిస్తున్న బెల్లడోనా లిల్లీ పూలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 'నేకెడ్ లేడీ' అని కూడా పిలువబడే ఈ గులాబీ రంగు సువాసనభరిత పుష్పాలు వసంతకాలంలో పూస్తాయి. మన్యం ప్రాంతంలోని అనుకూల వాతావరణం కారణంగా ఈ అలంకార పూలు అద్భుతంగా వికసించి, పరిసరాలకు ప్రత్యేక అందాన్ని ఇస్తున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

ఎండలు దంచికొడుతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు అవస్థ పడుతున్నారు. వేసవి దాహం తీర్చుకోవడానికి చాలా మంది కొబ్బరి బోండాం నీళ్లు తాగుతుంటారు. అయితే, కొబ్బరి బోండాం తాగేవారికి ఒక సందేహం తప్పక వచ్చే ఉంటుంది. కొబ్బరి నీళ్లను ఒకేసారి తెచ్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకొవచ్చా అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదూ..! అయితే, ఇది మీ కోసమే..కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం..

Indian Cricket Forgotten Stars: భారత క్రికెట్ చరిత్రలో ఎందరో ప్రతిభావంతులు వచ్చి వెళ్తుంటారు. కానీ ఒకప్పుడు సాక్షాత్తూ విరాట్ కోహ్లీ కంటే గొప్ప ఆటగాడిగా ముద్ర వేయించుకుని, నేడు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఒక క్రికెటర్ కథ ఇది. కేవలం 19 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించిన ఆ ఆటగాడి పతనం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

దర్శకుడు వి. సముద్ర బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లతో చేయాల్సిన సినిమాలు ఎలా చేజారాయో వివరించారు. బాలకృష్ణతో ప్రారంభమైన ఒక ప్రాజెక్టు కథా సమస్యలు, దురదృష్టకర సంఘటనల కారణంగా నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ అన్నవరం చిత్రాన్ని మహానంది షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల కోల్పోయానని ఆయన తెలిపారు.

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు దాగివున్నాయి. అప్పుడప్పుడూ ఏదో ఒక చోట అలాంటి వింత సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఈ సృష్టిలోని వివిధ రకాల జంతువులకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కొన్ని జీవజాతులకు కళ్లు అసాధారణంగా ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వింత చేప ఒకటి ఇంటర్నెట్ను షాక్ అయ్యేలా చేస్తోంది. ఒక చెరువులో జాలర్లకు అత్యంత అరుదైన, వింతైన చేప చిక్కింది. ఈ చేపను చూసిన స్థానికులు, జాలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఉత్తర కొరియా కఠిన ఆంక్షల నుంచి స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం చేసిన సాహసోపేత ప్రయాణం ఇది. దశాబ్ద కాలపు పక్కా ప్రణాళికతో, ప్రాణాలను పణంగా పెట్టి సముద్ర మార్గంలో పలాయనం చేశారు. దక్షిణ కొరియాలో స్వేచ్ఛ లభించినా, వారి ఆనందం విషాదంతో ముగిసింది. ఈ కథ స్వేచ్ఛ విలువను, కుటుంబ బంధాలను, ఊహించని విధిని గుర్తుచేస్తుంది. యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్న ఈ ఘటన ఆశ, నిరాశల సమ్మేళనం.

Asian Games 2026 India Captain: ఆసియా క్రీడలు 2026 కోసం భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2026లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు జట్టు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యువ రక్తంతో నిండిన ఈ జట్టును నడిపించే ఆ నాయకులు ఎవరో, వారి ఎంపిక వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇక నుంచి మీరు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ మొత్తంలో చేసే లావాదేవీలకు కేవలం మీ ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదా ఫేస్ రికగ్నిషన్ విధానంలో పేమెంట్ చేయవచ్చు. ఈ మేరకు కొత్త ఫీచర్ వచ్చేసింది.

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎందురుగా ఉన్న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో విడుదల చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ..

Chinnaswamy Stadium CCTV Issue: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపాలు తలెత్తాయన్న వార్తలు ఐపిఎల్ అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో సిసిటివి కెమెరాలు పనిచేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎట్టకేలకు స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించింది.

ప్రభుత్వ ఖజానా ఇప్పుడు డేటింగ్ కోసం తెరిచి ఉందని మీకు తెలుసా? మీరు ఒంటరిగా ఉండి, భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే, కాస్త సరదాగా మాట్లాడండి, ప్రేమించండి.. మిగతా ఖర్చులన్నీ మేమే భరిస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. అవును, మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్ పేరుతో ప్రభుత్వం ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా యువత స్వయంగా పెళ్లి చేసుకోకపోతే, వారికి ఆర్థికంగా ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 ఏప్రిల్ 1న ఈ పథకం అమల్లోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..