25168 articles


హైదరాబాద్: వెరా వీటా లివింగ్ సంస్థ హైదరాబాద్ ఒఆర్‌ఆర్ కండ్లకోయ వద్ద 55 ఏళ్లు దాటిన సీనియర్ల కోసం అమయా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. సంస్థ వ్యవస్థాపకులు ఆరుద్రదేవ్ రావు, ధ్రువ్ బద్రుకా, తనయ్ సబూ ఈ ప్రాజెక్ట్ లోగోను ఆవిష్కరించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో 3 ఎకరాల్లో రూ.250 కోట్లతో 256 ఇళ్లను (950-2,400 చదరపు అడుగులు) నిర్మిస్తున్నారు. యూనిట్ల ధర చ.అడుగుకు రూ.8,000- నుంచి రూ.8,999 కాగా, నెలసరి నిర్వహణ ఛార్జీ రూ.25 వేలుగా ఉంది. సీనియర్లకు స్వేచ్ఛ, గౌరవం, మనశ్శాంతి ఇవ్వడమే తమ లక్ష్యమని ఆరుద్రదేవ్ రావు తెలిపారు. స్వతంత్రంగా జీవించాలనుకునే వారికి ఇది అనుకూలమని ధ్రువ్ బద్రుకా వెల్లడించారు.







హైదరాబాద్: తాను అందరికీ ఆడపడుచునేనని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి మూడోసారి రాఖీ కట్టానని అన్నారు. తాజా పరిణామాలను కొండా సురేఖ ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో రాఖీ శుభాకాంక్షలకే కొండా సురేఖ పరిమితమయ్యారు. సిఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టానని, ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా రాఖీ కట్టానని తెలియజేశారు. మంత్రి సీతక్కతో కలిసి రాఖీ కట్టానని, సిఎం మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు. తనను వేరు చేసి చూడకండని, ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అన్నారు. ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా రాఖీ కట్టానని, సిఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టానని, పండగ వాతావరణంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయనని కొండా సురేఖ అన్నారు.






బీజింగ్: చైనా దేశంలోని సిచువాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు చేశారు. చైనా-నేపాల్ సరిహద్దులో భూకంప కేంద్రం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒక వైపు భారీ వర్షాలు, మరో వైపు భూకంప తీవ్రతతో నేపాల్‌కు మరో భారీ జల ప్రళయం ఉంటుందని నేపాల్ అధికారులు హెచ్చరించారు. నిన్నటితో పోలిస్తే 5 రెట్ల తీవ్రతతో మరోసారి నేపాల్‌కు భయంకరమైన వరదలు సంభవిస్తాయని అలర్ట్ చేశారు. మరో 20 నిమిషాల్లో వరదలు వస్తాయని పోలీసులు హెచ్చరించడంతో నేపాలు వాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నేపాల్ వాసులు తీవ్ర భయాందోళనలతో ఎత్తైన ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. భారీ మంచు కొండలు బద్దలవ్వడంతో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మంచి శిథిలాలు వరదల్లో కొట్టుకొని రావడంతోనే జలప్రళయానికి కారణమయ్యాయని యుఎస్ జిఎస్ ప్రకటించింది.





హైదరాబాద్: రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజునే శ్రావణ శుక్రవారం రావడంతో పూజలు విశేషంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. పరకాల వివాదం తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ వచ్చారు. రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.


