
హైదరాబాద్: వెరా వీటా లివింగ్ సంస్థ హైదరాబాద్ ఒఆర్‌ఆర్ కండ్లకోయ వద్ద 55 ఏళ్లు దాటిన సీనియర్ల కోసం అమయా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. సంస్థ వ్యవస్థాపకులు ఆరుద్రదేవ్ రావు, ధ్రువ్ బద్రుకా, తనయ్ సబూ ఈ ప్రాజెక్ట్ లోగోను ఆవిష్కరించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో 3 ఎకరాల్లో రూ.250 కోట్లతో 256 ఇళ్లను (950-2,400 చదరపు అడుగులు) నిర్మిస్తున్నారు. యూనిట్ల ధర చ.అడుగుకు రూ.8,000- నుంచి రూ.8,999 కాగా, నెలసరి నిర్వహణ ఛార్జీ రూ.25 వేలుగా ఉంది. సీనియర్లకు స్వేచ్ఛ, గౌరవం, మనశ్శాంతి ఇవ్వడమే తమ లక్ష్యమని ఆరుద్రదేవ్ రావు తెలిపారు. స్వతంత్రంగా జీవించాలనుకునే వారికి ఇది అనుకూలమని ధ్రువ్ బద్రుకా వెల్లడించారు.











