హైదరాబాద్: తాను అందరికీ ఆడపడుచునేనని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి మూడోసారి రాఖీ కట్టానని అన్నారు. తాజా పరిణామాలను కొండా సురేఖ ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో రాఖీ శుభాకాంక్షలకే కొండా సురేఖ పరిమితమయ్యారు. సిఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టానని, ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా రాఖీ కట్టానని తెలియజేశారు. మంత్రి సీతక్కతో కలిసి రాఖీ కట్టానని, సిఎం మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు. తనను వేరు చేసి చూడకండని, ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అన్నారు. ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా రాఖీ కట్టానని, సిఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టానని, పండగ వాతావరణంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయనని కొండా సురేఖ అన్నారు.