24152 articles

ఆకస్మికంగా వచ్చిన జల ప్రళయంతో నేపాల్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ఉపద్రవంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. దీని కారణంగా నేపాల్ ఇప్పట్లో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా నేపాల్‌కు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తాజాగా కొరియన్ పాప్‌స్టార్ లీ నో తన దాతృత్వం చాటుకున్నారు. నేపాల్ వరద బాధితులకు 100 మిలియన్ వన్‌ల(భారత కరెన్సీలో రూ.69 లక్షలు) విరాళమిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఈ మొత్తాన్ని వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపించారు. ‘‘ఈ కష్ట సమయంలో నేపాల్‌ను ఆదుకునేందుకు నా వంతు ప్రయత్నం చేశా. వీలైనంత త్వరగా ఆ దేశ ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని లీ నో ఈ సందర్భంగా వెల్లడించారు. సామాజిక సేవలో లీ నో ఎప్పుడూ ముందుంటారు. 2014 నుంచి వరల్డ్ విజన్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల సంరక్షణ కోసం తన వంతు సాయం అందిస్తున్నారు. 2024లో ఆహార సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు 100 మిలియన్ వన్‌ల విరాళం అందించారు. గతేడాది కూడా తన పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ



భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్ 57 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్థ శతకం సాధించిన అతడు.. దులీప్ ట్రోఫీలో అతి చిన్న వయస్సులోనే (15 ఏళ్ల 157 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) పేరిట ఉండేది. 1969లో ఆయన దులీప్ ట్రోఫీలో ఈ ఘనత సాధించాడు. 2005లో పీయూష్ చావ్లా (16 ఏళ్ల 307 రోజులు) కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 81 బంతులు ఎదురుకున్న వైభవ్ 92 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈస్ట్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. ఈస్ట్ జోన్ బ్యాటింగ్‌లో వైభవ్ 92 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (69) రాణించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (16) నిరాశపరిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు.





తెలుగు సినీ సంగీత దర్శకుడు కాల భైరవ తన రిలేషన్‌షిప్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ గురించి సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ కాలభైరవ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. కావ్యతో ఉన్న ఫొటోలను పంచుకున్న కాల భైరవ ‘‘నీతో ఉంటే కొండల మధ్య కూర్చొని, పారే సెలయేరును చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీతో కలిసి చేసే ఏ చిన్న పని అయినా, ఎప్పటికీ ముగియకూడదనిపించే అందమైన విహారయాత్రలా అనిపిస్తుంది. నీతో మాట్లాడే ప్రతి సంభాషన, శీతాకాలపు ఉదయాల్లో ఇష్టమైన కాఫీని ఆస్వాదించినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. ఈ అనుభూతికి ఏ పేరు పెట్టాలో నాకు నిజంగా తెలియలేదు. మన ప్రయాణంలో ఈ అనుభూతికి నాకు అర్థం తెలిసింది. ఆ భావనే ‘కుటుంబం’. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు కొత్త వ్యక్తిలా అనిపించలేదు. నేనిప్పుడు నీ గమ్యాన్ని చేరుకున్నా. ఆ క్షణం నుంచి వదిలి రాలేదు. మేమిద్దరం జీవితాంతం ఒకరికొకరం తోడూనీడగా ఉంటామన్న విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని అన్నారు. View this post




హైదరాబాద్: ఎపి ప్రభుత్వం కృష్ణా జలాలు బేసిన్ దాటి యధేచ్ఛగా తరలిస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎపి చేస్తున్న కృష్ణా జలాల దోపిడీపై సిఎం రేవంత్ రెడ్డి మౌనం మనకు తీరని ద్రోహమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు దోచుకుంటే సిఎం చోద్యం చూస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టులు ఎండిపోతుంటే..బేసిన్ దాటి ఎపికి నీళ్ల తరలింపు జరుగుతుతుందని హరీష్ రావు విమర్శించారు. మూల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఎపికి తరలిస్తారని, ఇప్పుడు వెలిగొండ ద్వారా మన వాటా తరలిస్తుంటే రేవంత్ రెడ్డి నోరెత్తట్లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎపికి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని, పర్యవేక్షించాల్సిన కెఆర్ఎంబి కూడా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కెఆర్ఎంబి వైఖరిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలని హరీష్ రావు కోరారు.




భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఓ మహిళ అక్రమంగా దాచి పెట్టిన బంగారాన్ని బిఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులోని బన్‌పూర్ గ్రామంలో ఓ మహిళ కొంతకాలంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు జవాన్లు గమనించారు. దీంతో ఆమెప నిఘా పెట్టి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నివాసంలో సోదాలు చేయగా.. 15.6 కిలోల బంగారం బయటపడింది. దాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలుల రూ.24 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం సరిహద్దుకు ఎలా చేరింది.? దానినిఎవరికి ఇవ్వడానికి మహిళ ప్రయత్నిస్తుందనే వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క ఉండొచ్చని అనుమమనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

న్యూఢిల్లీ : జపాన్ పెట్టుబడులతో నడిచే నెక్ట్ భారత్ వెంచర్స్ (ఎన్‌బివి) తన ఇంపాక్ట్ రిపోర్ట్ 2026ను విడుదల చేసింది. దీని ప్రకారం, గ్రామీణ, పట్టణ అసంఘటిత రంగాల్లోని 21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రైతులు, గిరిజన రైతుల ఆదాయం ఏటా 75%, చేతివృత్తిదారుల ఆదా యం 93%, అలాగే వీధి వ్యాపారుల ఆదాయం 25% చొప్పున పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశానికి చెందిన కృషివన్, సిద్స్ ఫార్మ్ వంటి సంస్థలు 3.64 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చి ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, వ్యవసాయం వంటి రంగాలు లక్ష్యంగా రూ. 20.76 కోట్ల కొత్త పెట్టుబడులను ప్రకటించారు. దీనిలో ప్రాణరక్షణ వ్యాక్సిన్ రవాణా సాధనం ఎమ్‌వోలియోను రూపొందించిన బ్లాక్‌ఫ్రాగ్ టెక్నాలజీస్‌కు రూ. 9 కోట్లు కేటాయించారు. అలాగే ఇ-బిక్ సంస్థకు రూ. 7.5 కోట్లు, సిబోస్‌కు రూ. 2 కోట్లు, వేలన్ మార్ట్‌కు రూ. 1.26 కోట్లు, ఎస్‌జిబి ఆగ్రోకు రూ. 1 కోటి మేర నిధులు సమకూర్చారు. జపాన్‌కు చెందిన సుజుకి మోటర్ కార్పొరేషన్‌తో పాటు 5 ఎల్‌పిల మద్దతుతో రూ. 2,000 కోట్ల భారీ అంచనాతో ఫండ్2ను సిద్ధం చేస



హైదరాబాద్: గతంలో ప్రజలను పట్టించుకోని నేతలు.. తమకు నీతులు చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పాలనలో రెవెన్యూ మంత్రి ఏనాడైనా ప్రజలను కలిసారా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. కేససముద్రంలో బహిరంగ సభలో మంత్రులు సీతక్క, పొంగులేటి పాల్గొన్నారు. 780 మంది రైతులకు భూధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇందిరమ్మ హయాంలోనే 25 లక్షల ఎకరాల భూమి పంచామని, 150 ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అడుగుతున్నారని..త్వరలోనే అందిస్తామని తెలియజేశారు. భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించామని, మహబూబాబాద్ లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలని జనం అనుకుంటున్నారని, పేదోడి కష్టం తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజాప్రభుత్వాన్నే గెలిపిస్తున్నారని, పేదవాడికి అండగా ఉన్నాం కనుకే ప్రతి ఎన్నికలోనూ గెలిపిస్తున్నారని కొనియాయాడారు. ఎవరో గగ్గోలు పెడితే తాము పనిచేస్తున్నామని అనుకుంటే అది వారి భ్రమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించా
