భారత్-బంగ్లాదేశ్‌ సరిహద్దు సమీపంలో ఓ మహిళ అక్రమంగా దాచి పెట్టిన బంగారాన్ని బిఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులోని బన్‌పూర్ గ్రామంలో ఓ మహిళ కొంతకాలంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు జవాన్లు గమనించారు. దీంతో ఆమెప నిఘా పెట్టి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నివాసంలో సోదాలు చేయగా.. 15.6 కిలోల బంగారం బయటపడింది. దాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలుల రూ.24 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇంత పెద్ద మొత్తంలో బంగారం సరిహద్దుకు ఎలా చేరింది.? దానినిఎవరికి ఇవ్వడానికి మహిళ ప్రయత్నిస్తుందనే వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క ఉండొచ్చని అనుమమనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.