
3765 వార్తలు

హైదరాబాద్: ‘కల్కి-2’లో కీలక పాత్ర.. జెడి చక్రవర్తి రియాక్షన్ ఇదే..!న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. తొలి భాగంలో చాలా మంది నటీనటులు, దర్శకులు ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సీక్వెల్‌లో కూడా చాలా కామియోలు ఉండే అవకాశం ఉంది. అందులో నటుడు జెడి చక్రవర్తి ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను జెడి చక్రవర్తి ఖండించారు. తన కొత్త చిత్రం ‘గాయపడిన సింహం’ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ సీక్వెల్‌లో నటించడం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలు విని ఎంజాయ్ చేశానని.. అందులో ఏ మాత్రం నిజం లేదన పేర్కోన్నారు. దీంతో ఈ రూమర్‌కి చెక్ పడింది.

హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి- నార్కట్ పల్లి రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పక్కనుంచి వస్తున్న బైక్ పైన ఉన్న వ్యక్తిను, ఎదురుగా ఇద్దరు వ్యక్తులను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల పేర్లు ఇరికించాలని చూస్తున్నారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీస్ అధికారులు పాటించవద్దు అని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎస్ఐబి చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట కలిగించందని, కోట్లు ఖర్చు పెట్టి బెయిల్ అడ్డుకోవాలని చూసినా..ప్రభాకర్ రావుకు ఉపశమనం లభించిందని, ఓ కరుడుగట్టిన నేరస్తుడిలాగా 18 రోజులు ఆయన్ని టార్చర్ చేశారని విమర్శించారు. పోలీస్ స్టేషన్ లో నేల మీద పడుకోబెట్టి వేధించారని మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు ఛార్జిషీటులో పెట్టాలని కుట్ర జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి మీద 26 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతడిని నిర్బంధించారని ధ్వజమెత్తారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ సంధ్యా శ్రీధర్ రావు వాలిపోతాడని, అతడితో బలవంతంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు చెప్పించారని అన్నారు. ఇంకా చాలామందిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. బిసి సంక్షేమ శాఖకు మంత్రి హోదాలో విహెచ్నె సలహాదారుగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు డిజిపిగా ఈ రోజు పదవీ విరమణ చేయనున్న బత్తుల శివధర్ రెడ్డిని ప్రభుత్వం భద్రతా సలహాదారుగా నిమయమించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటములతో సతమతమవుతోంది. బుధవారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగులు చేసినా.. పరాజయం మాత్రం తప్పలేదు. ముఖ్యంగా స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో విఫలమవుతున్నాడు. వికెట్లు తీయడం మాట అటుంచితే... భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. దీంతో బుమ్రా ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. బుమ్రాని జట్టు నుంచి తప్పించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై కోచ్ కీరన్ పొలార్డ్ బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరైనా క్రికెటర్ సరిగా ప్రదర్శన చేయలేకపోతే.. వెంటనే ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించడం మొదలు పెడతాం. ఎందుకు అతడు సరిగా ఆడలేకపోతున్నాడనే దానిపై విశ్లేషణలు చేసేస్తుంటాం. ఇందుకు బుమ్రా కూడా మినమహాయింపు కాదు. గత కోన్నేళ్లుగా అతడు ఏం చేశాడో మనం చూశాం. అతడు కూడా మనిషే కదా. బుమ్రా కూడా మిస్టేక్స్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మంచి రోజు కాకపోవచ్చు. మంచి సీజన్ కాకపోవచ్చు. కొన్ని నెలలు కలిసి రాకపోవచ్చు. ఇలాంటప్పుడే గతంలో చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి. అదే సమయంలో వర్తమానంలో ఉండేందకు ప్రయత్నించాలి, బుమ్రా తన స్థాయికి తగ్


నవతెలంగాణ-హైదరాబాద్: ఐ-ప్యాక్(పొలిటికల్ యాక్సన్ కమిటీ), కో ఫౌండర్, ఛైర్మన్ వినేష్ కుమార్‌కు బెయిల్ లభించింది.గురువారం ఢిల్లీ పాటియాల కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పాటియాలా హౌస్ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సల్, వినేష్ చందేల్‌కు రూ. 2 లక్షల బెయిల్ బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తు బాండ్‌పై బెయిల్ మంజూరు చేశారు. చందేల్ దర్యాప్తుకు సహకరించాడని, అతని సహకారం ఉద్దేశపూర్వకమైనదని ఈడీ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా […] The post ఐ-ప్యాక్ ఛైర్మన్‌కు బెయిల్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వీ.హెచ్ కు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో, నెలకు రూ. 50,000 ఇంటి అద్దె పొందే వీలుంది. ప్రభుత్వ పనులకు సొంత […] The post వి. హనుమంతరావుకు ప్రభుత్వ కీలక బాధ్యతలు appeared first on Navatelangana.







నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన జర్నలిస్టులందరికీ మే 1 నుంచి 10లోపు కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పష్టం చేసింది. 2022-2024 సంవత్సరాలకు గాను గతంలో జారీ చేసిన కార్డుల గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ కమిషనర్ జి.ముకుంద రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. […] The post రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ appeared first on Navatelangana.




