
3532 వార్తలు

అమరావతి: ఇంట్లో తమ్ముడి పెళ్లి రోజే అన్న విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మిర్తివలసకు చెందని సతీష్ (32) అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సతీష్ కూడా గత సంవత్సరం పెళ్లి జరిగింది. తన సొంత తమ్ముడు వివాహం ఉండడంతో హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చాడు. మేడపై దుస్తులు ఆరేస్తుండగా పెళ్లి డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగలడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పెళ్లి బజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తమ్ముడి పెళ్లి కోసం వస్తే అన్న చావే శరణ్యమైందని స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనాల మధ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. The post డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరణ appeared first on Navatelangana.

హైదరాబాద్: అనేక రంగాల్లో కార్మికులు తన చమటను చిందించి పని చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కార్మికులు పనిచేయటం ఆపేస్తే ప్రపంచమే స్తంభిస్తుందని అన్నారు. ఖమ్మం పట్టణంలో పువ్వాడ అజయ్ మే డే వేడుకల్లో పాల్గొన్నారు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం, రాష్ట్ర, మానవ ప్రగతికి కార్మికులు ఎంతో ముఖ్యమని, బిఆర్ఎస్ హయాంలో కార్మికుల కోసం అనేక పథకాలు అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు ఎల్లప్పుడూ బిఆర్ఎస్ అండగా ఉంటుందని పువ్వాడ అజయ్ భరోసా ఇచ్చారు.

అమరావతి: తల్లి, కుమారుడు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పాలకొల్లులో బండారు లక్ష్మీలహరి అనే మహిళ ఆరో తరగతిలోనే చదువు ఆపేసింది. ఆమె కుమారుడు విజయ్ పదో తరగతి చదువతుండడంతో తాను పదో తరగతి పరీక్షలు రాస్తానని కుటుంబ సభ్యులకు తెలిపింది. చదువుపై మమకారంతో ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాయడానికి సిద్ధపడింది. కుమారుడు విజయ్ తో కలిసి పదో తరగతి పుస్తకాలు చదవడం మొదలు పెట్టింది. పదో తరగతి పరీక్షలకు కుమారుడితో కలిసి తల్లి హాజరైంది. పదో తరగతి ఫలితాలలో కుమారుడు 562/600, తల్లి 360/500 మార్కులు రావడంతో వాళ్ల ఆనంద భాష్పలకు అవధులు లేకుండా పోయాయి. రిజల్ట్స్ చూసుకొని తల్లీకొడుకులు మురిసిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత పుస్తకం పట్టి విజయం సాధించిన తల్లిని పలువురు అభినందిస్తున్నారు.

అమరావతి: శ్రామికుల హక్కులను గుర్తించే చరిత్రాత్మక దినోత్సవం మే డే అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి శ్రామికుడికి గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం అని అన్నారు. మే డే సందర్భంగా చంద్రబాబు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో వెళ్తుందని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తుందని అన్నారు. కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

భోపాల్: పెళ్లి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగతున్నాయి. వరుడికి దండ వేసే సమయానికి ప్రియుడు పెళ్లి మండపానికి రావడంతో లవర్ మెడలో వధువు దండ వేసి కౌగలించుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛింద్వాడా మండలంలో జరిగింది. దీనిక ిసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ యువతి, యువకుడికి పెళ్లి ఘనంగా జరిగింది. వధువరులు దండాలు మార్చుకుంటుండగా వధువు స్టేజీ పైనుంచి పరుగులు తీసి ప్రియుడి మెడలో దండ వేసింది. ప్రియుడిని కౌగలించుకొని ముద్దుల వర్షం కురుపించింది. వెంటనే బంధువులు అప్రమత్తమై వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రియుడిని, పెళ్లి కూతురును చితకబాదారు. వెంటనే వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.



నవతెలంగాణ – హైదరాబాద్ : మే నెలలో పలు పండుగలు, ప్రత్యేక దినోత్సవాల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయి. మే 1న మే డే, మహారాష్ట్ర దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా (కొన్ని రాష్ట్రాలు మినహా) సెలవు. మే 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మే 9న రెండో శనివారం, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా సెలవు. మే 16న సిక్కిం రాష్ట్ర […] The post మే నెలలో 12 రోజులు బ్యాంక్ సెలవులు.. appeared first on Navatelangana.








హైదరాబాద్: శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపునిచ్చే ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ (May Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టం చేసిన ప్రతి చేతి విలువను గుర్తించి, సమానత్వం, న్యాయం, గౌరవం కోసం కలిసి ముందుకు సాగుదామని సిఎం పిలుపునిచ్చారు. “ప్రతి కార్మికుడి చెమట చుక్కలో మన సమాజ భవిష్యత్తు దాగి ఉంది. కార్మికుల అంకితభావం, కష్టపడే మనస్తత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికుల హక్కులను కాపాడటంలో ప్రజాప్రభుత్వం నిరంతరం పాటుపడుతుంది” అని రేవంత్ చెప్పారు.కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం, వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమాన

అమరావతి: మహిళపై సిఐ అత్యాచారం చేసిన కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సిఐ మల్లయ్య పరారీలో ఉన్న సంఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రాహ్మణపల్లిలో చిలకలూరిపేట సిఐ మల్లయ్య తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి చిలకలూరి పేటలో న్యాయమూర్తి ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలాన్నీ తీసుకున్నారు. సిఐ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి బ్రాహ్మణపల్లికి విచారణకు వెళ్తుండగా సిఐ మల్లయ్య గ్రామం నుంచి పారిపోయాడు. బ్రాహ్మణపల్లి గ్రామంలో పలువురు మహిళలను సిఐ వేధించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. సిఐ మల్లయ్య తనని లైంగికంగా వేధించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. మరో మహిళ వైపు కన్నెత్తి చూడకుండా అతడిని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. సదరు సిఐకి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని పలువురు మహిళలపై సిఐ అత్యాచారం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పరువుపోతు

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రి యేషన్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘హంట్’ తెలుగులో ‘డాక్టర్ కీర్తి‘, ఎంబీబీఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవుతోంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూ పొందిన ఈ మూవీని సంచలనం సృష్టించిన కోల్‌కతాలో జరిగిన డాక్టర్ రేప్. మర్డర్ నేపథ్యంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పీవీఆర్ సినిమాస్ తో కలిసి స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ్ రెడ్డి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ “కోల్‌కతాలో సంచలనం సృష్టించిన డాక్టర్ రేప్, మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. డాక్టర్ పాత్రలో నటి భావన అద్భుతంగా నటించారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ సాయివెంకట్, ప్రభాకర్ పాల్గొన్నారు.

హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ టైం’. సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అని క్క విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన అందాల తార పాయల్ రాజ్‌పుత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా నిర్మాత, దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి ప్రభ గౌడ్, జి చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్, హీరో అభినవ్ శౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ “మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాము. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ రా.7.30 గంటలకు జైపూర్‌లో తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆర్ఆర్ 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో, డీసీ 3 విజయాలతో 7వ ప్లేస్‌లో ఉన్నాయి. ఇక టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచుల్లో పోటీపడగా చెరో 15 గెలిచాయి. కాగా ఈ మ్యాచ్‌లో డీసీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. The post IPL-2026: నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోరు appeared first on Navatelangana.
