
అమరావతి: ఇంట్లో తమ్ముడి పెళ్లి రోజే అన్న విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మిర్తివలసకు చెందని సతీష్ (32) అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సతీష్ కూడా గత సంవత్సరం పెళ్లి జరిగింది. తన సొంత తమ్ముడు వివాహం ఉండడంతో హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చాడు. మేడపై దుస్తులు ఆరేస్తుండగా పెళ్లి డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగలడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పెళ్లి బజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తమ్ముడి పెళ్లి కోసం వస్తే అన్న చావే శరణ్యమైందని స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారు.










